VZM: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బిఆర్ నాయుడును తొలగించేలా ఆలోచన ప్రభుత్వానికి కలిగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి బజారు జంక్షన్ వద్ద గల శ్రీనివాస ఆలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
NLR: త్వరలో ఉదయగిరిలో జరగనున్న శ్రీ జగన్నాథ శోభాయాత్రను జయప్రదం చేసేందుకు ఉదయగిరి భక్తులు శ్రీకారం చుట్టారు. శనివారం ముందస్తుగా పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి చీర సారే సమర్పించారు. మండలంలోని 17 పంచాయతీల్లో హిందూ భక్తులు స్వచ్ఛందంగా సంకల్పం బూని కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
W.G: అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నేత కామ్రేడ్ యస్.యస్ ప్రసాద్(68) శనివారం తాడేపల్లిగూడెంలో గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ప్రసాద్‌కు భార్య ఇద్దరు కుమారులు వున్నారు. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జి ప్రసాద్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
VSP: పశ్చిమ నియోజకవర్గం ములగడ పరిధిలోని గ్రామాలను కలుపుకుంటూ ఏడు వార్డుల్లో ఇవాళ ‘స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ఫర్ జీసస్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో శాంతి సోదర భావం పెంపొందించడంలో క్రైస్తవ సోదరుల పాత్ర అభినందనీయమని కొనియాడారు.
కడప డివిజన్లో జీఎస్టీ వసూళ్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.851.44 కోట్లు రాగా.. 2025-26లో రూ.932.83 కోట్లు వచ్చాయని SGST కడప జాయింట్ కమిషనర్ సుమతి తెలిపారు. నెలకు సగటున రూ.70.95 కోట్లు జీఎస్టీలు వసూలయ్యాయని ఆమె చెప్పారు. రూ.82.38 కోట్ల పెరుగుదల నమోదైందన్నారు. 2025 మార్చిలో రూ.73.31 కోట్లు రాగా.. 2026 మార్చిలో రూ.84.39 కోట్లకు పెరిగాయని వెల్లడించారు.
AKP: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ (NSTL)లో లార్జ్ కేవిటేషన్ టన్నెల్ (LCT) ప్రాజెక్టుకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ అత్యాధునిక సదుపాయం డీఆర్డివో ఆధ్వర్యంలో నిర్మాణం కానుంది. నౌకల హైడ్రోడైనమిక్ పరిశోధన, పరీక్షలను దేశీయంగా నిర్వహించేందుకు ఇది దోహదం చేస్తుంది.
KDP: జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి వల్లూరు మండలం టి. జి పల్లె, తప్పెట్ల గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ కింద జరుగుతున్న ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించారు. నూతనంగా వచ్చిన ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫోటోలు పంపే పద్ధతిని తనిఖీ చేసి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిశీలనలో ఏపీవో డి. వి సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
E.G: డప్పు కళాకారుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకోవడం హేయమైన చర్యలు అని మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్లిపూడి సలీం విమర్శించారు. దళితుడి వయసుపై గౌరవం లేకుండా వ్యవహరించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.10 వేల వరకు రికార్డు స్థాయిలో ధర పలికింది. పదేళ్లలో ఇంత ధర పలకడం ఇదే తొలిసారని రైతులు, వ్యాపారులు తెలిపారు. మార్చి రెండో వారం వరకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. కిలో నిమ్మకాయలు రూ.125 వరకు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామ సమీపంలో శనివారం ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న ఓ విద్యార్థికి స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు పీహెచ్సీ ఉపకేంద్రంలో అపారిశుధ్యం తాండవిస్తుందని ప్రజలు అంటున్నారు. ఎక్స్ఫేర్ అయిన మందులు అక్కడే గుట్టలుగా వేసి తగలబెట్టడంతో పరిసరాలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భవనం వద్ద ఉన్న మరుగుదొడ్లలో చెదల పుట్టలు వెలిశాయి. సూదులు, గాజు సీసాలతో ఆసుపత్రి ప్రాంగణం అంతా దారుణంగా ఉందని రోగులు అంటున్నారు.
VZM: కొత్తవలస ప్రియదర్శిని గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు సిలిండర్లతో క్యూ కడుతున్నారు. గ్యాస్ బుక్ చేసి ఇరవైరోజులు కావస్తున్నా ఏజెన్సీ వాళ్లు పంపిణీ చేయకపోవడంతో వినియోదరులు వాపోతున్నారు. ఉదయం నుంచి ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. దీనిమీద డిప్యూటీ తహసీల్దార్ (పౌర సరఫరాల) చిరంజీవిని వివరణ కోరగా వినియోగదారులకు సరిపడా సిలిండర్లు ఉన్నాయని చెప్పారు.
NTR: తిరువూరు పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ కే. మనోజ శనివారం పరిశీలించారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి ఆహార నాణ్యత, నిర్వహణ విధానాలు, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది శుభ్రతను పాటిస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
KRNL: సి.బెళగల్–పలుకుదొడ్డి మధ్య రహదారిపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు శనివారం సూచిస్తున్నారు. మలుపు వద్ద చెట్లు దట్టంగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాల ముప్పు పెరిగింది. ఈ ప్రాంతంలో నెమ్మదిగా ప్రయాణించాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి చెట్లను తొలగించి రహదారి స్పష్టతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
SKLM: బైబిల్ బోధనలు సమాజానికి మార్గదర్శకం అని జిల్లా ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఇవాళ ఉదయం జిల్లాలోని రన్ ఫర్ జీసస్ కార్యక్రమం క్రైస్తవులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. యేసుక్రీస్తు జీవితం ప్రేమ, కరుణ, క్షమ, సేవ అనే విలువలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ యువత పాల్గొన్నారు.