• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిలో స్టాపర్లు ఏర్పాటు

VZM: జాతీయ రహదారి అనుకొని ఉన్న బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వాహనాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్సై యు. మహేష్ ప్రమాదాలను అరికట్టేందుకు భారీ స్టాపర్లను ఏర్పాటు చేశారు. దూరం నుండి వచ్చే వాహనాలు వేగ నియంత్రణ ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు. దీంతో వాహనదారులు గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

April 6, 2026 / 10:28 AM IST

ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉన్నారు: DMHO

PPM: PHCలో పనిచేసే వైద్యులు అందుబాటులోనే ఉన్నారని, సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నారని DMHO డా. భాస్కర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 2న, ఓ పత్రికలో వైద్యులు ఉండరు, చికిత్స అందదు అనే కథనానికి ఆయన పై విధంగా స్పందించారు. జీ.ఎల్.పురం మండలం రేగడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

April 6, 2026 / 10:17 AM IST

‘వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశానికి మంచి’

SKLM: వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజ నిర్మాణం జరుగుతుందని, దీని ద్వారా దేశానికి మంచి జరుగుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రాంత కార్యకారిణి సభ్యుడు ఓలేటి సత్యనారాయణ అన్నారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో వైభవ భారతం కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమంలో డాక్టర్ అమ్మన్నాయుడు, పీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 10:13 AM IST

పెన్నా నది వద్దకు వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి: ఎస్సై

KDP: పెన్నా నది వద్దకు వచ్చే పర్యాటకులకు వల్లూరు ఎస్సై శివ హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. నది బయటకు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ లోపల తీవ్ర ప్రమాదాలు దాగి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. సుడిగుండాలు, లోతైన నీటి ప్రాంతాలు కనిపించకపోయినా ప్రాణాంతకంగా మారే అవకాశముందని తెలిపారు. ఫోటోలు, వీడియోలు కోసం నదిలోకి దిగడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.

April 6, 2026 / 10:06 AM IST

తమిళనాడు బోట్లను ఏపీ బార్డర్‌లోకి రానివ్వం: మంత్రి

ప్రకాశం: తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్యసంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బొట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబునాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగే బోటుల్లో ఉన్న పోలీసులకు తుపాకులు అందిస్తామన్నారు.

April 6, 2026 / 10:06 AM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న డీఎస్పీ దంపతులు

NDL: పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తిరుపతి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు వారికి మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి రూ.45,000, అన్నదానానికి రూ.25,000 విరాళం అందజేసినట్లు తెలిపారు.

April 6, 2026 / 10:05 AM IST

భీమవరంలో దొంగనోట్ల ముఠా అరెస్ట్

W.G: భీమవరంలో దొంగనోట్ల ముఠాను సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రికి చెందిన గోపీచంద్రరెడ్డి, సాయిలు కలిసి పట్టణానికి చెందిన జోగ శివశంకర్ కు రూ.3 లక్షలకు రూ.9 లక్షల నోట్లు ఇస్తామని ఆశ చూపారని తెలిపారు. శివశంకర్ సమాచారంతో సీఐ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోను ఇదే తరహాలో మోసం చేసినట్లు వీరు ఒప్పుకున్నారన్నారు.

April 6, 2026 / 10:05 AM IST

మదనపల్లిలో బైక్ రేసర్లపై కేసు నమోదు

అన్నమయ్య: మదనపల్లె తాలూకాలో బైక్ రేసర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శనివారం స్థానిక జగన్ కాలనీలో నివసిస్తున్న మైనర్ బాలుడు దీక్షిత్‌ను బైక్ రేసర్లు ఢీకొట్టడంతో అతనికి కాలు విరిగిందన్నారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

April 6, 2026 / 10:03 AM IST

కలెక్టరేట్ వద్ద నేడు భవన నిర్మాణ కార్మికుల ధర్నా

కర్నూల్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టనున్నారు. ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

April 6, 2026 / 10:00 AM IST

శిథిల కల్వర్టు తో… ప్రాణాలకు ముప్పు!

VZM: వంగర, పార్వతీపురం ప్రధాన రహదారిలో కొప్పరవలస సమీపంలోని కల్వర్టు ప్రమాదానికి దారితీసేలా మారింది. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కల్వర్టు పదేళ్లుగా శిథిలావస్థలోనే ఉండిపోయింది. జిల్లాకు నిత్యం భారీగా వాహన రాకపోకలు జరుగుతుండగా, చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

April 6, 2026 / 09:55 AM IST

ఈ నెల 10న రెడ్డిపల్లి జైలులో బహిరంగ వేలం పాట

ATP: బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి జిల్లా జైలులో ఈ నెల 10వ తేదీన వేరుశనగ చెక్కకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 75 వేల కిలోల వేరుశనగ చెక్క వేలం వేస్తామని, పాల్గొనేవారు రూ. 60వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా జైలులో సంప్రదించాలని వారు పేర్కొన్నారు.

April 6, 2026 / 09:53 AM IST

సూర్యలంకలో పర్యాటకుల అవస్థలు

BPT: సూర్యలంక బీచ్‌లో పర్యాటకులు ఎండకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు నీడనిచ్చే గొడుగులు, బల్లలను తొలగించడమే ఇందుకు కారణం. వేసవిలో వారాంతాల్లో వచ్చే వేలాది మంది నీడ లేక అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి గొడుగులు, బల్లలను తిరిగి ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.

April 6, 2026 / 09:42 AM IST

మదనపల్లె తహసీల్దారుపై అవినీతి ఆరోపణలు

అన్నమయ్య: మదనపల్లె MRO కిషోర్ కుమార్ రెడ్డిపై అక్రమ వసూళ్లు, ఆలస్యం ఆరోపణలు రావడంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఆయనను బదిలీ చేశారు. మ్యుటేషన్ కోసం వచ్చిన వ్యక్తుల నుంచి రూ.లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. బాధితులు CCLA కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విజిలెన్స్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

April 6, 2026 / 09:40 AM IST

విద్యుత్ సమస్యలు ఉన్నాయా.. ఈ నంబర్‌ను సంప్రదించండి

విశాఖ: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని సీఎండీ పేర్కొన్నారు.

April 6, 2026 / 09:39 AM IST

బుచ్చిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామచంద్రపురం గ్రామంలో జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఆనాడు కాంగ్రెస్ విధివిధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఆవిర్భావం చెందిందన్నారు.

April 6, 2026 / 09:39 AM IST