కోనసీమ: స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి బీజేపీ ఆధ్వర్యంలో మండపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ స్దానిక 8వ వార్డులో ఉన్న జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోన మాట్లాడుతూ.. బీహార్‌లో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి బాబూజీగా ప్రసిద్దిగాంచారని పేర్కొన్నారు.
KKD: పిఠాపురం పాదగయ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (POLYCET) అభ్యర్థులకు ఆదివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కె. మాణిక్యరావు శనివారం తెలిపారు. ఈ నెల 25న జరిగే పరీక్షకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికుల హక్కులు, రైతుల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానేతగా ఆయనను నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత డ్రైవర్లను ఆపి ముఖం కడిగించి మేల్కొలిపి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచిస్తున్నారు. నిద్రమత్తు వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. లారీలు, బస్సులు, కార్లు వంటి వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఏలూరు రూరల్ మండల డిప్యూటీ ఎంపీడీవో చింతమనేని విష్ణు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించిన ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు.
EG: క్రీస్తు పునరుత్థాన పర్వదినమైన పవిత్ర ఈస్టర్ సందర్భంగా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ సేవా కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం పాల్గొన్నారు. పునరుత్థానాన్ని స్మరించుకుంటూ, సమాధుల తోట వద్ద నివాళులర్పించారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు బట్టర్ మిల్క్, బ్రెడ్ పంపిణీ చేశారు. ప్రేమ, త్యాగం విలువలను గుర్తు చేస్తుందన్నారు.
W.G: ఈస్టర్ పర్వదిన సందర్బంగా పాలకొల్లు దొడ్డిపట్ల రోడ్‌లోని Y జంక్షన్ వద్దనున్న సమాధులతోట వద్ద ఆదివారం తెల్లవారుజామున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సమాధుల తోట వద్దకు శంభుని పేట, పెదపేట, మార్కుపేట, యాళ్ళవాని గరువుకు చెందిన క్రైస్తవ విశ్వాసులు, బంధు మిత్రులు వచ్చి సమాధుల వద్ద ప్రార్ధనలు చేశారు.
TPT: తిరుపతి స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం MRCలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ఫారం కోసం అధికారిక వెబ్‌సైట్ svimstpt.ap.nic.inను సందర్శించాలని కోరారు.
VZM: జమ్మూ పడాలపేటలో ఉన్న బేతని మిషన్ చర్చి ఆధ్వర్యంలో క్రీస్తు పునరుత్థాన ర్యాలీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాస్టర్ డా. పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పడాలపేట, నారాయణపురం, బీసీ కాలనీ, జమ్మూ, ఆనందపురం కాలనీ, సింగపూర్ సిటీ ప్రాంతాల మీదుగా కొనసాగింది. అనేక మంది క్రైస్తవులు ర్యాలీ సందర్భంగా స్తోత్ర గీతాలు పాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజావేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాల మేరకు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలో అసమానతల నిర్మూలనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని టిడిపి సీనియర్ నాయకుడు చౌలం మల్లికార్జున పేర్కొన్నారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
CTR: మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలో దళిత సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వెల్లడించారు.
PPM: బొబ్బిలి, రామభద్రాపురం వేగవతి నదిపై నిర్మిస్తున్న పారాది వంతెన నిర్మాణా పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి. సి.జనార్ధన రెడ్డి ఆదివారం పర్యవేక్షించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. ఆనంతరం బొబ్బిలి వీణను స్థానిక ఎమ్మెల్యే రంగారావు బహుకరించారు.
గుంటూరు: విదేశీ పర్యటనలు చేసి వచ్చిన అర్చకులు దేవాలయ గర్భాలయంలో పూజలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారు ఆలయం వెలుపల మాత్రమే పూజలు నిర్వహించాలి. ఈ నిబంధనల అమలు బాధ్యత దేవాదాయ శాఖపై ఉందని కోర్టు పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డీఎస్పీ వివేకానంద పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత దేశ ఉప ప్రధాని అని అన్నారు. దళిత వర్గాల ఆశాజ్యోతి అని, వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.
NDL: రుద్రవరం మండలం చిన్న కంబలూరులో సోమవారం రాష్ట్రస్థాయి న్యూ కేటగిరి వృషభరాజ్యముల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ‘గుడ్ ఫ్రైడే-ఈస్టర్’ పర్వదిన వేడుకలను పురస్కరించుకొని గ్రామానికి చెందిన క్రైస్తవ సంఘపెద్దలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామని తెలిపారు.