NTR: వీరులపాడు మండల మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులను అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వివిధ పథకాల ద్వారా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు.
PPM: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పీజీఆర్ఎస్ సమర్థవంతమైన వేదికని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా PGRS గ్రీవెన్స్‌లో సమస్యలను పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్‌కు 88 వినతులు, రెవెన్యూ రెవెన్యూ క్లినిక్‌కు 25 వినతులు అందాయన్నారు. సమస్యలన్నీ నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.
KDP: బద్వేలులో ఆదివారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు రోడ్డులో టీ తాగి ఇంటికి వెళ్తున్న అల్లూరి వెంకటేశయ్య (70)పై నలుగురు దుండగులు దాడి చేశారు. పాత కక్షలతో దారి కాచి, కట్టెలతో తీవ్రంగా కొట్టారు. బాధితుడు వేడుకున్నా కనికరం చూపకుండా దారుణంగా హింసించి, ఆయన వద్ద ఉన్న సుమారు రూ.20 వేలు, మొబైల్ ఫోన్ లాక్కొని పరారయ్యారని బాధితుడు వాపోయాడు.
BPT: బాపట్ల పట్టణంలోని 9వ వార్డు గుంటూరు బ్రిడ్జి కింద నూతనంగా ఏర్పాటు చేసిన ‘బాపట్ల బాలవనం’ను జిల్లా ఇంచార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా పార్కును రూపొందించామని తెలిపారు.
SKLM: మందస మండలంలో సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. టీడీపీ మందస మండల అధ్యక్షులు భావన దుర్యోధన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మందస జన చెరువు దగ్గర కార్యక్రమం నిర్వహించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ఏప్రిల్ 21 నుండి జూలై 14వ తేదీ లోపల పనులన్నింటినీ పూర్తి చేయాలని తెలిపారు.
CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామపంచాయతీలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని కొత్తయిండ్లు, సింగిరిగుంట వద్ద ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, రాష్ట్ర నాయకుడు రాజారెడ్డి తదితరులు కలిసి జెండాను ఎగురవేశారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలో బీజేపీ స్థాపించారని తెలిపారు.
E.G: ఆయుష్మాన్ వయో వందన కార్డులకు వైద్య సదుపాయాలు అందించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ రామకృష్ణం రాజు, కో కన్వీనర్ యానాపు ఏసు కలెక్టర్‌కి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం సమర్పించారు. ఆయుష్మాన్ వయో వందన కార్డులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా అంగీకరించాలన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 11 మందిని స్థానిక పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.80,800 నగదు స్వాధీనం చేసుకున్నామని అర్బన్ సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని సీఐ సురేష్ హెచ్చరించారు.
NTR: నందిగామలో వ్యవసాయ అధికారి (టెక్నికల్)గా పనిచేస్తున్న కే. వెంకటేశ్వరరావు కంచికచర్ల ఇంఛార్జ్ మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పనిచేసిన కే. విజయ్‌కుమార్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. కొత్త అధికారితో రైతులకు సేవలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.
అన్నమయ్య: బోయకొండ అటవీ ప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవించిన తర్వాత గొడవలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నమయ్య: బోయకొండ అడవిలో సోమవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సేవించిన తర్వాత గొడవలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
NDL: నందికొట్కూరులో శ్రీశైలం నీటి ముంపు బాధితుల రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. సాగునీరు లక్షల ఎకరాలకు అందుతున్నా తమ త్యాగాలు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల రైతుల కోసం చట్టాలు చేస్తూ, దశాబ్దాలుగా పోరాడుతున్న తమ హక్కులపై ప్రభుత్వం మౌనం ఎందుకని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సత్యసాయి: పరిగి ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 తోపుడు బండ్లు, 27 ట్రైసైకిళ్లు, 286 డస్ట్‌బిన్లను పంచాయతీ వారీగా పంపిణీ చేశారు. మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ATP. అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు నాయుడుకు MLA జేసీ అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. సోమవారం యాడికిలో సీఎంను కలిసిన వారు.. బుద్ధుడి విగ్రహంతో కూడిన ప్రత్యేక అమరావతి లోగోను బహూకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలను సీఎం అభినందించారు.
TPT: తిరుపతిలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ స్థాపన, అభివృద్ధిపై నాయకులు ప్రసంగించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో 16 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.