అన్నమయ్య: సుండుపల్లెలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరి ప్రసాద్, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అభివృద్ధి పనులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ATP: ఆపదలో అత్యవసర చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం రాయదుర్గంలో 24 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.13 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 387 మందికి రూ.2.58 కోట్ల సహాయం అందిందని తెలిపారు.
SS: తెలంగాణలో కొందరు విశ్లేషకులు వైసీపీ ట్రాప్‌లో ఉండి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపాలని చూడటం సరైన పద్ధతి కాదని ధర్మవరం జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ దేశ నాయకుడని, తెలుగు ప్రజల శ్రేయస్సే ఆయన ధ్యేయమన్నారు. కొందరు వైసీపీ కోవర్టులుగా మారి పవన్ కళ్యాణ్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.
ATP: జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతోంది. డీజిల్ ధరలు పెరగడంతో జిల్లాలో ట్రాక్టర్ బాడుగలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో గంటకు రూ. 900 లుగా ఉన్న టిల్లర్ బాడుగను ప్రస్తుతం రూ. 1000 కి పెంచారు. ట్రాక్టర్ యజమానులు రకాన్ని బట్టి గంటకు రూ.100 నుంచి రూ. 200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
GNTR: మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో సాగుతున్న ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పనులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు. MTMC కమిషనర్ ఆలీమ్ బాషా ఆధ్వర్యంలో జేసీబీలతో ఈ పూడికతీత పనులు జరుగుతున్నాయి. వర్షాకాలం లోపు డ్రైనేజీల్లో మట్టిని తొలగించి, మురుగునీరు సాఫీగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు.
KRNL: ఆదోని మండల పరిధిలో జరగాల్సిన ఒక బాల్య వివాహాన్ని శక్తి బృందం అడ్డుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ, శిశు సంక్షేమ, పోలీసు, సచివాలయ సిబ్బంది కలిసి విచారణ చేపట్టారు. ఇరు కుటుంబాల సభ్యులను పెద్దతుంబలం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇవాళ ఎస్ఐ విద్యాశ్రీ, సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాల అనర్థాలను వివరించి, చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. వైద్య చికిత్సలు, అత్యవసరాల కోసం, ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని అర్హులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఊరటనీస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కోనసీమ: జనగణన ప్రక్రియకు శనివారం చివరి రోజు కావున ప్రజలందరూ ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని రావులపాలెం ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం కోరారు. ప్రజలు అందించే వివరాల ఆధారంగానే దేశ ఆర్థిక ప్రణాళికలు రూపొందించబడతాయని, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు గ్రాంట్లు మంజూరు అవుతాయని తెలిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ క్లస్టర్లలో 100 శాతం పూర్తి చేయాలన్నారు.
ATP: శింగనమల నియోజకవర్గ YCP బీఎల్ఏల శిక్షణా సమావేశం జూన్ 2న నార్పలలోని ఎస్వీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలు, సమన్వయకర్త సాకే శైలజనాథ్ సూచనలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించే ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొననున్నారు.
PLD: హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సంబంధించిన భూవ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గండిపేట ప్రాంతంలోని భూమికి సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో పలువురి పాత్రపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు వెల్లడించారు.
NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ శనివారం కలిశారు. ఇటీవల నియమితులైన పలువురు వేల్పనూరులో ఎమ్మెల్యే గృహానికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, విధులపట్ల అంకిత భావంతో పనిచేసే పిల్లలకు, గర్భిణీలకు మెరుగైన సేవలు అందించాలని అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ కు సూచించారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్లు పీహెచ్‌సీలో ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి మాట్లాడుతూ.. పొగాకు వినియోగం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. యువత పొగాకుకు దూరంగా ఉండాలని, సమాజంలో పొగాకువ్యతిరేక చైతన్యం పెంపొందించాలని పిలుపునిచ్చారు.
TPT: శ్రీకాళహస్తిలోని కాలువలు ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో నిండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ ప్రజలు ప్లాస్టిక్ వస్తువులు, ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని అధికంగా పెంచడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. వాడేసి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లు కాలువల్లో చేరి మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయని పలువురు మండిపడుతున్నారు.
గుంటూరు లాలాపేటలోని పురాతన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులకు కొరిటిపాడు వాస్తవ్యులు యలవర్తి సాంబశివరావు, విజయశ్రీ దంపతులు విరాళం అందజేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో వారు రూ.1,01,116ల విరాళం చెక్కును దేవస్థానం ఛైర్మన్ శ్రీనివాసరావుకు నేరుగా అందజేశారు. ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం భక్తులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు.
CTR: ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలీసు అధికారులు శనివారం కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ప్రజల భద్రత, రక్షణే ధ్యేయంగా వీటిని చేపట్టినట్టు వారు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల తనిఖీలు, వాహనాల పరిశీలన, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. నేరాలను ముందస్తుగా పసికట్టేందుకు తనిఖీలు ఉపయోగపడతాయని చెప్పారు.