• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సమ్మర్ కిట్స్‌ను అందజేసిన ఎస్పీ

VZM: జిల్లా ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు బ్యాగు, క్యాప్, వాటర్ బాటిల్‌తో కూడిన సమ్మర్ కిట్స్‌ను ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఇవాళ పంపిణీ చేశారు. వేసవి కాలం అంతా మజ్జిగ, కూలింగు వాటర్, ఎలక్ట్రోలర్, గ్లూకోజ్ పౌడర్‌ను ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీ రోజూ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

April 6, 2026 / 06:00 PM IST

ఉప ముఖ్యమంత్రిని కలిసిన సీఆర్డీఏ కమిషనర్

GNTR: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమరావతి రాజధాని పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

April 6, 2026 / 05:40 PM IST

గుత్తి APTF నూతన కార్యవర్గం ఎన్నిక

ATP: గుత్తి మండల ఏపీటీఎఫ్ నూతన కార్యావర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు పోతులయ్య పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మండల అధ్యక్షులుగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా వీరాంజనేయులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఉపాధ్యాయులు సమస్యలపై పోరాటం చేయడంతోపాటుగా, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దిశగా కృషి చేయాలన్నారు.

April 6, 2026 / 05:40 PM IST

‘వేతనదారులు కొలతల ప్రకారం పని చేయాలి’

VZM: వేతనదారులు కొలతల ప్రకారం పనిచేయాలని జిల్లా జల యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ శారదాదేవి సూచించారు. సోమవారం బొండపల్లి మండలంలోని ఓంపల్లి గ్రామంలో జరుగుతున్న చెరువు పనులను పరిశీలించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 నుంచి 10 వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అరుణ పాల్గొన్నారు.

April 6, 2026 / 05:38 PM IST

‘కూటమి ప్రభుత్వంలోనే 70 శాతం పనులు పూర్తి’

SKLM: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 శాతం వరకు ములపేట పోర్ట్ పనులు పూర్తి చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో కలిసి పోర్టును సందర్శించారు. పోర్టుకు ఉప్పు భూములు 400 ఎకరాలు అవసరమైతే 399 ఎకరాలు భూములు 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు.

April 6, 2026 / 05:37 PM IST

ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత: ఎస్పీ

CTR: చిత్తూరు జిల్లా పోలీసుల పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 41 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ, డబ్బు, కుటుంబ తగాదాలు వంటి వివిధ సమస్యలు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం విచారించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు న్యాయం చేయడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ తెలిపారు.

April 6, 2026 / 05:21 PM IST

‘నీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం’

అన్నమయ్య జిల్లాలో నీటి కొరత నివారణకు జలధార–జలహారతి కార్యక్రమాన్ని 100 రోజుల మిషన్‌గా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. కేసాపురం పరిధిలోని రెడ్డివారిపల్లి చెరువు వద్ద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిన్న చెరువుల పునరుద్ధరణ, ఫీడర్ ఛానళ్ల శుభ్రపరిచే పనులతో భూగర్భ జలాలు 5.6 మీటర్లు పెరిగాయని, తాగునీటి సమస్య 90% వరకు పరిష్కారమైందని కలెక్టర్ తెలిపారు.

April 6, 2026 / 05:21 PM IST

‘నీటి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి’

NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత100 రోజుల ప్రత్యేక కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కోవూరు మండలం గంగవరం క్రాస్ రోడ్డు సదరన్ ఛానల్ వద్ద సాగునీటి సంఘాల నేతలు, రైతులు ర్యాలీ చేశారు.

April 6, 2026 / 05:20 PM IST

గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి ప్రతి పనిని క్షుణ్ణంగా సమీక్షించారు. పనుల వేగాన్ని మరింత పెంచి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

April 6, 2026 / 05:20 PM IST

క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

AKP: చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో పట్టాలమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం బ్యాట్ పట్టుకుని క్రీడాకారులతో సరదాగా ఆడారు. పండుగల వేళ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని, యువత క్రీడలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

April 6, 2026 / 05:20 PM IST

‘గిరిజనలకు పట్టాలు మంజూరు చేయాలి’

PPM: జిల్లాలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్యాక్రాంతం, గంగునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజనులకు పేదలకు పట్టాలు ఇవ్వడం లేదన్నారు.

April 6, 2026 / 05:15 PM IST

నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యతలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా సీఎం చంద్రబాబు “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజు విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో గల చెరువు వద్ద ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంచడం, చెరువులను పూడికతీసి నీటిని సంరక్షించడం ప్రధాన లక్ష్యమన్నారు.

April 6, 2026 / 05:14 PM IST

చేబ్రోలు కాలువలో పడిన లారీ

GNTR: చేబ్రోలు వద్ద ప్రమాదం జరిగింది. చేబ్రోలు కాలువ వంతెన పైనుంచి వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. వంతెనపై వెళ్తున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ కాలువలో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

April 6, 2026 / 05:10 PM IST

శరవేగంగా కసాపురం ఆలయ నిర్మాణ పనులు

ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో దాతల సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కోనేరుతో పాటు ఆలయంలో స్వామివారి గర్భగుడి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో విజయ రాజు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు.

April 6, 2026 / 05:10 PM IST

పాక్స్ నూతన భవనాన్ని ప్రారంభించిన కేడీసీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని KDCC బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ.. సహకార రంగం రైతులకు నిజమైన ఆర్థిక భరోసా కల్పించే బలమైన వేదికగా మారిందని తెలిపారు.

April 6, 2026 / 05:05 PM IST