• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్వామివారి సేవలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా

CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు, వేదపండితులు, ఇతర ఆలయ సిబ్బంది కూడా హాజరయ్యారు.

April 6, 2026 / 07:43 PM IST

‘టెంపుల్ సిటీగా తాడిపత్రి అభివృద్ధి చేయండి’

ATP: తాడిపత్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని MLA జేసీ అస్మిత్ రెడ్డి CM చంద్రబాబుని కోరారు. యాడికిలో సీఎంను కలిసి ఈ ప్రాంతంలోని చారిత్రక ఆలయాల ప్రాముఖ్యతను వివరించారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని విన్నవించారు.

April 6, 2026 / 07:40 PM IST

ప్రహరీ గోడ నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం తాడిచర్ల రోడ్డు శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే రామును కట్టావాని చెరువు ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఖబరస్థాన్‌కు (బరియల్ గ్రౌండ్) రక్షణగా ప్రహరీ గోడ నిర్మించాలని అబ్దుల్ కరీం, ఫైజు తదితరులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

April 6, 2026 / 07:35 PM IST

రేపు భవన నిర్మాణ కార్మికుల ధర్నా

AKP: సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి కార్మికులకు ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గృహ నిర్మాణ మెటీరియల్ రేట్లను తగ్గించాలన్నారు. రద్దు చేసిన భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని పునరుద్ధరించాలన్నారు.

April 6, 2026 / 07:35 PM IST

సర్పంచుల సేవలు చిరస్మరణీయం: వై.విశ్వేశ్వర్ రెడ్డి

ATP: గ్రామ స్వరాజ్య స్థాపనలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని వైసీపీ తాజా మాజీ సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో విశేష కృషి చేశారని ప్రశంసించారు.

April 6, 2026 / 07:20 PM IST

కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

కర్నూలు జిల్లా కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరం ఆలయంలో జరిగిన చోరీ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 కిలోల వెండి దొంగిలించగా, 4 కిలోల వెండి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా కేసును ఛేదించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.

April 6, 2026 / 07:13 PM IST

కలెక్టరేట్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అనంతపురం కలెక్టర్ కార్యాలయం సమీపంలో సోమవారం మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రాయదుర్గం ప్రాంతానికి చెందిన రాముడు విద్యుత్ స్తంభానికి ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు రాఘవేంద్ర సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, బాధితుడి పరిస్థితిని గమనించి ఆసుపత్రికి తరలించారు.

April 6, 2026 / 07:12 PM IST

సొంత నిధులతో కాలువలో పూడికతీత పనులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ 9వ వార్డు శాంతినగర్లో గుడిపల్లి కాలువ పూడిక నిండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన, దోమలతో సతమతమవుతున్నామని వాపోయారు. సమస్యను స్థానిక కౌన్సిలర్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. ఆయన సొంత నిధులతో కాలువలో పూడిక తీత పనులు చేయించారు.

April 6, 2026 / 07:10 PM IST

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

CTR: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి సూచించారు. అధిక లాభాల పేరుతో సోషల్ మీడియా ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు. నకిలీ యాప్‌లు, వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరితోనూ పంచుకోరాదని సూచించారు.

April 6, 2026 / 07:01 PM IST

ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానం

TPT: చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపాలెం మండలం ఆవలయ్యగారిపల్లి–కూరపర్తివారిపల్లి గ్రామాల్లో నిర్వహించనున్న శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమ ఆహ్వాన పత్రికను అందజేసి మహోత్సవానికి విచ్చేయాలని కోరగా, ఆయన ఆహ్వానాన్ని స్వీకరించారు.

April 6, 2026 / 07:00 PM IST

ఈ విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీ ప్రారంభం

PLD: పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ, అనుబంధ ఆసుపత్రి ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభం కానుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.

April 6, 2026 / 07:00 PM IST

అనపర్తిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

E.G: అనపర్తి రాయల్ సిటీ లేఔట్‌లో ఏప్రిల్ 12వ తేదీన జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే కుమార్తె సనాతని, పాణ్యంఎమ్మెల్యే చరితారెడ్డి కుమారుడు జనార్దన్ రెడ్డిల వివాహం హైదరాబాదులో జరిగిన విషయం తెలిసిందే. అనపర్తికి సినీ, రాజకీయ ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేయాలని కోరారు.

April 6, 2026 / 07:00 PM IST

బాపట్ల కలెక్టరేట్‌కు 15 ఎకరాలు

BPT: జిల్లా శాశ్వత కలెక్టరేట్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బాపట్ల-గుంటూరు రహదారిలో దీనికోసం 15 ఎకరాలు కేటాయించనున్నారు. ముందుగా 10 ఎకరాలు తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే మంత్రి పార్థసారథి స్థలాన్ని పరిశీలించి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 15 ఎకరాలు ఎంపిక చేయాలని సూచించారు. త్వరలో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు.

April 6, 2026 / 07:00 PM IST

ఘనంగా అమరావతి సంబరాలు

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్లో అమరావతి సంబరాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాద్ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తరం కాదని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి అంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 6, 2026 / 07:00 PM IST

తెనాలి PGRSలో ఫిర్యాదులు.. వెంటనే చర్యలకు ఆదేశాలు

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ PGRSలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గంగానమ్మపేటలో వాటర్ టాక్స్ రద్దు, నందులపేటలో చేపల దుర్వాసన, అమరావతి ప్లాట్లలో పందుల సమస్యలపై అర్జీలు వచ్చాయి. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత శాఖలకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

April 6, 2026 / 07:00 PM IST