• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుమల దర్శన టోకెన్లు దొరకడం లేదు..!

TPT: వేసవి సెలవులు మొదలు కావడంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుపతిలో జారీ చేస్తున్న దర్శన టోకెన్లు గంటల వ్యవధిలో అయిపోతున్నాయి. ఫ్రీ దర్శనం కోసం వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు టోకెన్ల కోసం మరుసటి రోజు కోసం ఆగాల్సివస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జీల ధరలు ఎక్కువ కావడంతో చెట్ల కిందే నిద్రిస్తున్నారు.

April 7, 2026 / 10:40 AM IST

‘వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు అవసరం’

VZM: వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డీడీవో కిరణ్ కుమార్ అన్నారు. బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి వేసవిలో తాగునీటికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. మంచినీటి పథకాల మోటార్లు మరమ్మతులకు గురైతే 24 గంటల్లో బాగు చేయాలని వారికి ఆదేశించారు.

April 7, 2026 / 10:30 AM IST

వాణిజ్య పన్నుల వసూళ్లలో విశాఖ టాప్

విశాఖ వాణిజ్య పన్నుల శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,845.39 కోట్ల వసూళ్లతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని జాయింట్ కమిషనర్ పీబీ వల్లీ తెలిపారు. గత ఏడాది రూ.1,733.59 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.111.8 కోట్ల అధికంగా ఆదాయం నమోదైందన్నారు. బకాయిల వసూళ్లలో పురోగతి సాధించి, 2025 మార్చి నాటికి రూ.150.71 కోట్ల నుంచి 2026 మార్చి నాటికి రూ.158.59 కోట్లకు పెరగిందని వెల్లడించారు.

April 7, 2026 / 10:25 AM IST

అకాల వర్షం… వరి పంట నష్టం

TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా వరి పంట నీట మునిగింది. దీంతో రైతులు నష్టపోయారని సీపీఐ నాయకుడు జనమాల గురవయ్య తెలిపారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని ఇవాళ ఆయన డిమాండ్ చేశారు. ఏర్పేడు మండలం కోబాక గ్రామంలో పంటలను పరిశీలించి అధికారులను చర్యలు తీసుకోవాలని కోరారు.

April 7, 2026 / 10:14 AM IST

నందవరం ఆలయంలో చవితి పూజలు

NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో ఇవాళ చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన, రుద్రాభిషేకం చేశారు. ప్రత్యేక వారంగా భావించి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు సౌకర్యాల కోసం కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

April 7, 2026 / 10:07 AM IST

రోడ్డుపై నడవలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

PPM: సీతంపేట మండలం దుగ్గి గ్రామానికి వెళ్లే తారు రహదారి పూర్తిగా ఛిద్రమైంది. కూడలి నుంచి గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల మార్గం నామరూపాల్లేకుండా తయారైంది గ్రామస్థులు తెలిపారు. రాళ్ల కుప్పలు పరిచినట్లు మారిందన్నారు. నడిచి వెళ్తే కాళ్లకు రాళ్లు గుచ్చుకుంటున్నాయని, వాహనాలపై వెళ్లా మంటే టైర్లు తరచూ పంక్చర్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

April 7, 2026 / 10:07 AM IST

బైక్‌తో పాటు బావిలో పడి యువకుడి మృతి

CTR: పెనుమూరు మండలం చిన్నకలికిరిలో విషాదం నెలకొంది. మునస్వామి కుమారుడు శేఖర్ (27) గ్రామ సమీపంలోని నీవా నది వద్ద ఉన్న పొలం దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు. మార్గమధ్యంలో పెద్ద బావి ఉంది. నిన్న రాత్రి కాలి నడక బాటలో బైకుపై వెళ్తుండగా.. రాళ్లు తగిలి అదుపుతప్పి బైక్‌తో సహా బావిలో పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో బావిలోనే చనిపోయాడు.

April 7, 2026 / 10:04 AM IST

అక్రమ మద్యం విక్రేత అరెస్ట్

KRNL: మంత్రాలయంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బోయ పెద్దయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగలదిన్నె రహదారిలో సుంకప్ప తాత దర్గా వద్ద మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో సీఐ రామాంజులు, ఎస్సై మల్లికార్జున దాడులు నిర్వహించారు. నిందితుడి వద్ద నుంచి 94 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

April 7, 2026 / 10:00 AM IST

గ్రామపంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు నియామకం

AKP: నర్సీపట్నం మండలంలో 12 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. గబ్బాడ, ఎరక్కన్నపాలెం, వేములపూడి, దుగ్గాడ పంచాయతీలకు తహసీల్దార్ రామారావును నియమించారు. అమలాపురం, ధర్మసాగరంకు MDO ఉషశ్రీ, కేఎల్ పురం, ఓఎల్ పురంకు డిప్యూటీ ఎండీవో రమణకుమారిని నియమించారు. చెట్టుపల్లి, గురందరపాలెంకి ఏఈ రామన్నపాత్రుడు, మెట్టపాలెంకి డిటి గణేష్‌ను నియమకం చేశారు.

April 7, 2026 / 10:00 AM IST

గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాల్‌టికెట్లు విడుదల

KKD: తుని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ విశ్వశాంతి తెలిపారు. ఏప్రిల్ 12న నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు ఈ పరీక్ష అత్యంత కీలకమన్నారు.

April 7, 2026 / 09:58 AM IST

కలుషిత నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

E.G: సింగరాజుపాలెం ఎస్సీ కాలనీలో పైపుల ద్వారా మురికినీరు వస్తోందని కాలని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా కలుషిత నీరు తాగడంతో అనారోగ్య సమస్యలు పెరిగినట్లు స్థానికులు తెలిపారు. సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో సమస్యను పట్టించుకునే వారు లేరని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటరాజు స్పందించి అధికారులతో వెంటనే మరమ్మతులు చేయించారు.

April 7, 2026 / 09:51 AM IST

సపోటా పండ్లతో స్వామివారి అలంకరణ

ATP: తాడిపత్రిలోని ప్రసిద్ధ బుగ్గరామలింగేశ్వరస్వామి క్షేత్రంలో మంగళవారం ఉదయం స్వామివారిని విశేషంగా సపోటా పండ్లతో అలంకరించారు. శివలింగం చుట్టూ పండ్లను అమర్చిన తీరు సందర్శకులను కట్టిపడేసింది. ప్రకృతి ప్రసాదాలతో దైవాన్ని కొలవడం భక్తికి, పర్యావరణ హితానికి నిదర్శనమని అర్చకులు యోగానందశర్మ పేర్కొన్నారు. ఫలాల అలంకరణను చూసి భక్తులు పులకించిపోయారు.

April 7, 2026 / 09:47 AM IST

నడిరోడ్డుపై పార్కింగ్.. పట్టించుకోని అధికారులు..!

GNTR: తెనాలి గాంధీచౌక్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో ఐతే నడిచి వెళ్లేందుకు కూడా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అటువంటి చోట పలువురు రోడ్డు మీద వరకు వాహనాలు నిలిపి ఉంచి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు. గాంధీచౌక్ నుంచి బోసురోడ్డు మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్‌ల ఎదుట రోడ్డు మధ్య వరకు బైక్‌లు పార్క్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు.

April 7, 2026 / 09:47 AM IST

మాజీ ఎంపీటీసీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

KRNL: చిప్పగిరి మండలం నేమకల్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ వెల్డింగ్ లక్ష్మన్న, ఉనురు గొల్ల మల్లికార్జున అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఇవాళ గ్రామానికి వెళ్లి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

April 7, 2026 / 09:46 AM IST

నేటి కూరగాయాల ధరలు ఇవే..!

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు ఇవాళ (కేజీ/రూ.ల్లో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.12, బంగాళదుంప రూ.11, వంకాయ రూ.24, మిర్చి రూ.28, కాకరకాయ రూ.32, మునగకాడలు రూ.44, క్యారెట్ రూ.25, దొండ రూ.28, బెండకాయ రూ.26, బీరకాయ రూ.32, కీర రూ.16, పెన్సిల్ బీన్స్ రూ.60, గ్రీన్ పీస్ రూ.60, చిక్కుడుకాయ రూ.28, క్యాప్సికం రూ.38, పొటల్స్ రూ.64, పొట్లకాయ రూ.28 ఈ విధంగా ఉన్నట్లు వ్యాపారులు వెల్లడించారు.

April 7, 2026 / 09:40 AM IST