• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చౌడేశ్వరి ఆలయానికి విరాళం అందజేత

NDL: శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధికి నెల్లూరు వాసి హరి ప్రసాద్ కుటుంబం రూ.50,116 విరాళం అందజేశారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఆలయ ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి, పీవీ నాగార్జున రెడ్డి నగదు స్వీకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. విరాళంపై ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అభివృద్ధి పనులకు నిధులు వినియోగిస్తామన్నారు.

April 6, 2026 / 08:20 AM IST

నేడు సంగంలో మంత్రి పర్యటన

NLR: సంగం మండల కేంద్రంలో ఇవాల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని గాంధీ జన సంఘం వద్ద కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ పూడికతీత పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు. అనంతరం సంగం ఇరిగేషన్ కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

April 6, 2026 / 08:16 AM IST

GVMCలో 79 గ్రామ పంచాయతీల విలీనం ?

విశాఖ: జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా ఉంటుంది. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.

April 6, 2026 / 08:10 AM IST

మంత్రి జనార్దన్ రెడ్డి ను కలిసిన ఎమ్మెల్యే శంకర్

SKLM: జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డిని, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సమస్యలను విన్న మంత్రి వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

April 6, 2026 / 08:10 AM IST

ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

BPT: బాపట్ల పట్టణంలో ఆదివారం రాత్రి స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తిని వేగంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 6, 2026 / 08:09 AM IST

పొన్నూరులో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

GNTR: పొన్నూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత కక్షల వల్లే ఈ గొడవ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

April 6, 2026 / 08:07 AM IST

మంత్రులకు సాదర స్వాగతం పలికిన కలెక్టర్

PPM: జిల్లా పర్యటన నిమిత్తం మన్యం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకు, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులకు కలెక్టర్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా మంత్రులను ఆహ్వానించారు.

April 6, 2026 / 08:05 AM IST

‘ఉద్యోగుల రెగ్యులర్‌పై హైకోర్టు తీర్పు హర్షణీయం’

అల్లూరి: తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్సు ఆదివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి 3 లక్షల మందిని అవుట్ సోర్సింగ్ పేరిట, మరో లక్ష మందిని కాంట్రాక్టు పేరిట తక్కువ వేతనాలతో ఎటువంటి సౌకర్యాలు లేకుండా కొనసాగిస్తోందన్నారు. ఇప్పటికైనా తాత్కాలిక ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 

April 6, 2026 / 08:01 AM IST

మాజీ సర్పంచ్ సాహసం.. స్తంభం ఎక్కి విద్యుత్ పునరుద్ధరణ

AKP: గొలుగొండ మండలం కొమిర గ్రామంలో మాజీ సర్పంచ్ కర్రి నాయుడు ధైర్య సాహసాన్ని ప్రదర్శించారు. గ్రామంలో ఓ విద్యుత్ స్తంభం వద్ద సరఫరా నిలిచిపోయింది. దీంతో స్పందించిన మాజీ సర్పంచ్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టి విద్యుత్తును పునరుద్ధరించారు. మాజీ సర్పంచ్ ధైర్య సాహసాలకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

April 6, 2026 / 08:00 AM IST

‘పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోండి’

NDL: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్-2026కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బేతంచెర్ల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఏప్రిల్ 9వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. SC,ST అభ్యర్థులు రూ.100, ఓసీ, బీసీలు రూ.400 దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు.

April 6, 2026 / 08:00 AM IST

‘బీజేపీ పార్టీలో భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నారు’

KRNL: నందవరంలో బస్ స్టాండ్ వద్ద ఉన్న బీజేపీ జెండా కట్ట ఉన్నప్పటికీ మరో జెండా కట్ట ఎందుకని BJP ఓబీసీ రాష్ట్ర నాయకులు ఈరన్న ఇవాళ ప్రశ్నించారు. కొందరు నాయకులు స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీలో భేదాభిప్రాయాలు సృష్టించేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కూటమిలో ప్రతి నాయకునికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

April 6, 2026 / 08:00 AM IST

రోడ్డుపై భారీగా రేషన్ బియ్యం పట్టివేత

NLR: కోవూరు వద్ద జిల్లా గ్రాండ్ హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి ఒక వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఆ వాహనంలో భారీగా PDS బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ బియ్యం ప్రకాశం జిల్లా మద్దిపాడు నుంచి కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి, స్టేషన్‌కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు.

April 6, 2026 / 07:54 AM IST

మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

PPM: రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి. సి.జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రతో కలిసి బలిజిపేట మండల పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు.

April 6, 2026 / 07:53 AM IST

మార్కెట్ యార్డుకు రూ. 3.98 లక్షల ఆదాయం

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వారపు సంత ద్వారా మొత్తం రూ. 3,98,200 ఆదాయం సమకూరింది. ఇందులో గొర్రెలు, మేకల సంత నుంచి రూ. 2,49,300 లభించగా, పశువుల సంత నుంచి రూ. 1,48,900 రాబడి వచ్చినట్లు యార్డు ఇంఛార్జ్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు తరలివచ్చనట్లు ఆయన పేర్కొన్నారు.

April 6, 2026 / 07:50 AM IST

అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు

కాకినాడ: పెద్దాపురంలో తొమ్మిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పట్టణానికి చెందిన 30 ఏళ్ల యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదైంది. బాలిక బయట ఆడుతుండగా.. చేయిపట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 07:48 AM IST