• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాకవరపాలెంలో 46,985 మంది ఓటర్లు

AKP: మాకవరపాలెం మండలంలోని 31 పంచాయతీల్లో మొత్తం 46,985 మంది ఓటర్లు ఉన్నారని డిప్యూటీ ఎంపీడీవో మేరీజోన్స్ శుక్రవారం తెలిపారు. వీరిలో 22,875 మంది పురుషులు, 24,110 మంది మహిళలు ఉన్నారు. ఈనెల 15న ఓటర్ల జాబితాలను అన్ని పంచాయతీల్లో ప్రదర్శించామని చెప్పారు. మాకవరపాలెంలో 3,777 మంది ఓటర్లతో అధికం, నారాయణరాజుపేటలో అత్యల్పంగా 466 మంది ఉన్నారని పేర్కొన్నారు.

April 18, 2026 / 08:48 AM IST

‘ఉపాద్యాయుల రుణం తీర్చుకోలేనిది’

VZM: ఒక సాధారణ ఉపాధ్యాయుడినైన నన్ను మూడుసార్లు MLC గా నిలబెట్టి విజయతీరాలకు చేర్చిన ఉపాద్యాయ అధ్యాపకుల రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిదని శాసనమండలి సభ్యులు Dr. గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. తన మూడవసారి MLC గా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా PRTU శ్రీ యశ్వి పాఠశాల సంయుక్తంగా ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కృతజ్ఞతా సభలో గాదె పాల్గొన్నారు.

April 18, 2026 / 08:47 AM IST

బైక్ ఢీకొని వ్యక్తి మృతి

పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం జోగిరాజు పేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉర్రాకుల శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందారు. బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన బైక్‌దారుడు వాహనంతో సహా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 18, 2026 / 08:38 AM IST

నైట్ ప్యాంటుతో ఆఫీసుకొచ్చిన డిజిటల్ అసిస్టెంట్

BPT: నైట్ ప్యాంటుతో విధులకు హాజరైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటుతో విధులకు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.

April 18, 2026 / 08:25 AM IST

మాదకద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల ప్రణాళిక

శ్రీకాకుళం జిల్లాలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడానికి 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని విశాఖ రేంజ్ ఐజీ గోపీ నాథ్ జెట్టి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డితో ఆయన వీసీలో సమీక్ష నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన యువతను తిరిగి సమాజంలో కలపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సంకల్పం క్లబ్బులు ఏర్పాటు చేయాలని అన్నారు.

April 18, 2026 / 08:21 AM IST

ఈ నెల 20,21 ఏఐటీయూసీ మహాసభలు

VZM: కొత్తవలస కోటపాడు రోడ్డులో ఉన్న శ్రీ జయదుర్గభవానీ ఆటో స్టాండ్ వద్ద ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు ఆధ్వర్యంలో ఈనెల 20, 21,12వ, మహాసభ విజయనగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద జరుగుతుందని చెప్పారు. మహాసభలను జయప్రద్ధం చేయాలని ఆయన కోరారు. దానికి సంబంధించి గోడ పత్రికను శుక్రవారం విడుదల చేశారు. ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు.

April 18, 2026 / 08:21 AM IST

PGRSలో విన్నపం.. భీమలమ్మకు క్లాప్ మిత్రగా ఛాన్స్

ASR: ముంచంగిపుట్టు (M) జర్జుల పంచాయతీకి చెందిన ఒంటరి మహిళ వీ.భీమలమ్మకు కలెక్టర్ టీ.నిశాంతి తక్షణ ఉపాధి కల్పించారు. శుక్రవారం జరిగిన PGRSలో తన పేదరికం, పాప చదువు గురించి భీమలమ్మ మొరపెట్టుకోగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆమెకు నెలకు రూ.6వేల వేతనంతో ‘క్లాప్ మిత్ర’గా నియమించారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఉపాధి కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

April 18, 2026 / 08:10 AM IST

పెడనలో పేకాట ఆడుతున్న మహిళలు అరెస్ట్

కృష్ణా: పెడనలో శుక్రవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బషీర్ తెలిపిన వివరాల ప్రకారం.. 19వ వార్డు గృహ సముదాయాల మధ్య నిర్వహిస్తున్న జూదంపై దాడి చేసి నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.47,750 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

April 18, 2026 / 08:08 AM IST

మురుగు నీళ్ల మధ్య జీవనం

PPM: పాలకొండ పట్టణంలోని నీళ్ల ట్యాంకు వీధిలో కాలువలు పూడికతో నిండిపోవడంతో, మురుగు నీరు వీధి రోడ్డు పై ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు కష్టంగా మారడంతో పాటు దోమల పెరుగుదల, దుర్వాసన కారణంగా వ్యాధుల భయం నెలకొంది. స్థానికులు వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

April 18, 2026 / 08:08 AM IST

కాణిపాకం పీఎస్‌పై డీఎస్పీ ఆకస్మిక తనిఖీ

CTR: కాణిపాకం పోలీస్ స్టేషన్‌ను చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

April 18, 2026 / 08:06 AM IST

చెరువులో కుళ్లిన శవం..!

BPT: సంతమాగులూరు మండలం కొప్పరం-సజ్జాపురం రోడ్డుపై ఉన్న చెరువులో కుళ్లిన శవం బయటపడటంతో కలకలం రేగింది. ఎముకలుగా మారిన మృతదేహాన్ని పశువుల కాపరి గమనించి గ్రామస్థులకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 18, 2026 / 08:05 AM IST

‘రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి’

AKP: రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు. మునగపాక మండలం చూచుకొండలో శుక్రవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో రైతులకు పంటల సాగులో శిక్షణ తరగతులు నిర్వహించారు. పచ్చి రొట్ట ఎరువుల సాగుతో భూములు సారవంతం అవుతాయన్నారు.

April 18, 2026 / 08:03 AM IST

రేపు ఏలూరుకి రానున్న ఎంపీ మహేష్

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈ నెల 19న ఏలూరుకి రానున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అయితే ఇటీవల ఎంపీ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఆయన తిరిగి ఏలూరుకి రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

April 18, 2026 / 08:02 AM IST

సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్ల పరిశీలన

E.G: సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి భద్రతా సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు.

April 18, 2026 / 08:01 AM IST

కారు ఢీకొని కాంట్రాక్ట్ ఉద్యోగికి గాయాలు

VZM: బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని కారు ఢీకొన్న ఘటనలో APIIC పంపు హౌస్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగి కెల్లి హరిహరరావు తీవ్రంగా గాయపడ్డారు. స్దానికుల వివరాల ప్రకారం రోడ్డు పక్కన నడుస్తుండగా రామభద్రపురం నుంచి బొబ్బిలి వైపు వస్తున్న కారు ఢీకోటట్టడంతో తలకు బలమైన గాయమైందన్నారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

April 18, 2026 / 08:00 AM IST