• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దోషులను శిక్షించాలంటూ తహసిల్దార్‌కు వినతి

PLD: జర్నలిస్టు జగన్ రెడ్డిని హత్య చేసిన దోషులను శిక్షించాలంటూ ఏపీయూడబ్ల్యూజే పెదకూరపాడు ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. మండల అధ్యక్షులు మునుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా రాయగలిగే జర్నలిస్టులను బెదిరింపులు, ప్రాణాలు తీసిన దోషులను శిక్షించాలన్నారు. ఈ మేరకు తహసీల్దార్ ధనలక్ష్మికి వినతి పత్రం అందించారు.

April 29, 2026 / 12:35 PM IST

‘విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి’

NDL: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి కోరారు. మహానంది మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల బృందం బుధవారం పుట్టుపల్లె, అబ్బిపురం గ్రామాల్లో పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని తెలిపారు.

April 29, 2026 / 12:34 PM IST

స్వచ్ఛతే ఆరోగ్యానికి మూలం: ఎంపీడీవో

SS: రొద్దంలో ‘స్వచ్ఛ పధం’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గ్రామంలోచెత్తను తొలగించి డ్రైనేజీలు శుభ్రపరిచారు. ఎంపీడీవో ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దిష్ట ప్రదేశాల్లో వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులను దూరం పెట్టవచ్చని తెలిపారు. స్వచ్ఛతే ఆరోగ్యానికి మూలమని వివరించారు.

April 29, 2026 / 12:30 PM IST

‘ప్రజలకు శుద్ధమైన తాగునీటిని సరఫరా చేయాలి’

ATP: గుంతకల్లులోని S.S ట్యాంకును మున్సిపాలిటీ అధికారులతో కలిసి మండల ఇంఛార్జ్ నారాయణస్వామి పరిశీలించారు. ఇటీవల ట్యాంకు ద్వారా వచ్చే త్రాగునీరు ఎర్రగా కనిపిస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం ఆయన నేపథ్యంలో ట్యాంకు నీటిని పరిశీలించారు. నీటి రంగు మారడాన్ని ఎండల తీవ్రత, శుభ్రపరిచే ప్రక్రియలో ఉపయోగించే క్లోరిన్ అని అధికారులు వారికి వివరించారు.

April 29, 2026 / 12:28 PM IST

ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

CTR: పులిచెర్ల మండల కేంద్రంలో గతేడాది నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం మొదటి వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ ఛైర్మన్ మురళీమోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

April 29, 2026 / 12:22 PM IST

స్వచ్ఛపథం అనేది సామాజిక బాధ్యత: మంత్రి

E.G: నిడదవోలు రూరల్ పరిధిలోని గోపవరం గ్రామంలో బుధవారం జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’గా కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గోపవరం సమీపంలో రోడ్ల ఇరువైపులా ఉన్న చెత్తను ఊడ్చారు. స్వచ్ఛపథం అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇదొక సామాజిక బాధ్యత అన్నారు.

April 29, 2026 / 12:20 PM IST

మార్కాపురంలో ఘరానా చోరీ

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ నగర్‌లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. తిప్పిరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలతో పాటు రూ.25 వేలు నగదు అపహరించారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్ళిన క్రమంలో చోరీ జరిగింది. విషయాన్ని బుధవారం బాధితుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

April 29, 2026 / 12:20 PM IST

అతివేగం.. వాటర్ ట్యాంకర్ బోల్తా

ఏలూరు ఆర్ఆర్ పేట వద్ద వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. నూతనంగా కొనుగోలు చేసిన ట్యాంకర్లను అనుభవం లేని డ్రైవర్ల చేతిలో పెట్టడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే ప్రమాదం రహదారిపై జరిగి ఉంటే నష్టం ఊహించడం కష్టం అని పేర్కొన్నారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టారు.

April 29, 2026 / 12:16 PM IST

తిరుపతిలో ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం

తిరుపతి నగరంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ భరతనాట్యం కళాకారిణి కడియాల వాణి చంద్రను రాయలసీమ రంగస్థలి ఛైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించి, స్మారక చిహ్నాన్ని అందజేశారు.

April 29, 2026 / 12:13 PM IST

లోకేష్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపిన గొట్టిపాటి

BPT: యువగళం పాదయాత్రతో ప్రజల్లో నమ్మకం పెంచిన యువనేత లోకేష్ TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రి గొట్టిపాటి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భరోసానిచ్చిన లోకేష్, నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని చెప్పారు.

April 29, 2026 / 12:13 PM IST

డీజిల్ కొరత ప్రభావం.. కూరగాయల ధరలు భారం

WG: డీజిల్ కొరత, రవాణా ఖర్చుల పెరుగుదల ప్రభావంతో ఆకివీడులో కూరగాయల ధరలు బుధవారం కొండెక్కాయి. పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో వంకాయ రూ. 80, బీరకాయ, బెండ రూ. 70, టమాటా రూ. 60గా విక్రయిస్తున్నారు. ములక్కాడ ఒకటి రూ.10 పలుకుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్నట్లు వినియోగదారులు అరోపిస్తున్నారు.

April 29, 2026 / 12:11 PM IST

బడే హజరత్ తిరణాలకు పోటేత్తిన ముస్లిం సోదరులు

NTR: చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో బడే హజరత్ తిరునాళ్లు ఘనంగా జరిగాయి. కంచికచర్ల మండలం పెండ్యాల నుంచి సుమారు 700 జతల ఎడ్లబండ్లతో ముస్లిం కుటుంబాలు దర్గాకు చేరుకుని సంప్రదాయంగా పండుగ జరుపుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో నందిగామ రూరల్ సీఐ చవాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలు కట్టుదిట్టం చేశారు.

April 29, 2026 / 12:11 PM IST

మంత్రి ఫరూక్‌ను కలిసిన అడ్వకేట్ ప్రసాద్ రెడ్డి

NDL: నంద్యాల మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన అడ్వకేట్ ప్రసాద్ రెడ్డి బుధవారం మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫరూక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధి, న్యాయపరమైన అంశాల్లో తన వంతు సేవలు అందిస్తానని ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి అభినందిస్తూ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

April 29, 2026 / 12:08 PM IST

టీడీపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న వైకుంఠం జ్యోతి

KRNL: టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నాయకులు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ, ఐక్యతతో ముందుకు సాగాలన్నారు.

April 29, 2026 / 12:08 PM IST

రేపే టెన్త్ ఫలితాలు.. జిల్లాలో ఉత్కంతఠ

KKD: 10వ తరగతి పరీక్షా ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. కాకినాడ(D) వ్యాప్తంగా 167 కేంద్రాల్లో 28,921 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిలయినా జీవితం ముగిసిపోదని, ఓటమిని విజయానికి తొలిమెట్టుగా భావించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

April 29, 2026 / 12:00 PM IST