• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వాండ్రంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

W.G: ఉండి మండలం వాండ్రం గ్రామంలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి MRPS ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు పసల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిమ్నజాతుల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నతుడు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కనపాల ఏసు, శ్రీను, నరసన్న, పల్లియ్య, మోహన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 12:00 PM IST

అద్దంకి బజార్‌లో దొంగతనం.. షోరూంలో నగదు మాయం

బాపట్ల: అద్దంకి ప్రధాన బజార్‌లోని ఫ్యాషన్ షోరూంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి టేబుల్ డ్రాయర్‌లో ఉన్న నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఘటన జరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. సీఐ సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

April 5, 2026 / 11:56 AM IST

ప్రొద్దుటూరు ఎమ్మెల్యేను కలిసిన విద్యుత్ శాఖ SE

KDP: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిని ఆయన స్వగ్రామం కామనూరులో ఇవాళ కడప సర్కిల్ విద్యుత్ శాఖ SE శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై MLAకి వివరించారు. కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఈఈ రమణారెడ్డి పాల్గొన్నారు.

April 5, 2026 / 11:50 AM IST

నూజివీడులో ‘రేపు మీకోసం’ కార్యక్రమం

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. మునిసిపల్ ప్రత్యేక అధికారి, సబ్ కలెక్టర్ వినూత్న ఇవాళ మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

April 5, 2026 / 11:45 AM IST

ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి

కోనసీమ: స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి బీజేపీ ఆధ్వర్యంలో మండపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ స్దానిక 8వ వార్డులో ఉన్న జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోన మాట్లాడుతూ.. బీహార్‌లో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి బాబూజీగా ప్రసిద్దిగాంచారని పేర్కొన్నారు.

April 5, 2026 / 11:40 AM IST

జగన్ వ్యాఖ్యలు విడ్డూరం: కోటంరెడ్డి

 మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర, జాతీయ మీడియా అవినీతిమయం అయిపోయిందని అనడం విడ్డూరంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేధావులైన మీడియా ప్రతినిధులకు అవినీతి మరకలు అంటించడం జగన్ మనస్థత్వానికి నిదర్శనమని, అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని ఆయన ప్రశ్నించారు.

April 5, 2026 / 11:38 AM IST

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ

KKD: పిఠాపురం పాదగయ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (POLYCET) అభ్యర్థులకు ఆదివారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కె. మాణిక్యరావు శనివారం తెలిపారు. ఈ నెల 25న జరిగే పరీక్షకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

April 5, 2026 / 11:33 AM IST

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికుల హక్కులు, రైతుల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానేతగా ఆయనను నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

April 5, 2026 / 11:30 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న చర్యలు

KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత డ్రైవర్లను ఆపి ముఖం కడిగించి మేల్కొలిపి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచిస్తున్నారు. నిద్రమత్తు వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. లారీలు, బస్సులు, కార్లు వంటి వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

April 5, 2026 / 11:30 AM IST

మల్కాపురం పంచాయతీ ప్రత్యేక అధికారిగా డిప్యూటీ ఎంపీడీవో

ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఏలూరు రూరల్ మండల డిప్యూటీ ఎంపీడీవో చింతమనేని విష్ణు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించిన ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు.

April 5, 2026 / 11:30 AM IST

‘ప్రేమ త్యాగం విలువలను గుర్తు చేసేదే ఈస్టర్’

EG: క్రీస్తు పునరుత్థాన పర్వదినమైన పవిత్ర ఈస్టర్ సందర్భంగా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ సేవా కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం పాల్గొన్నారు. పునరుత్థానాన్ని స్మరించుకుంటూ, సమాధుల తోట వద్ద నివాళులర్పించారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు బట్టర్ మిల్క్, బ్రెడ్ పంపిణీ చేశారు. ప్రేమ, త్యాగం విలువలను గుర్తు చేస్తుందన్నారు. 

April 5, 2026 / 11:30 AM IST

ట్రాఫిక్ సమస్య.. ఇబ్బంది పడ్డ వాహన చోదకులు

W.G: ఈస్టర్ పర్వదిన సందర్బంగా పాలకొల్లు దొడ్డిపట్ల రోడ్‌లోని Y జంక్షన్ వద్దనున్న సమాధులతోట వద్ద ఆదివారం తెల్లవారుజామున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సమాధుల తోట వద్దకు శంభుని పేట, పెదపేట, మార్కుపేట, యాళ్ళవాని గరువుకు చెందిన క్రైస్తవ విశ్వాసులు, బంధు మిత్రులు వచ్చి సమాధుల వద్ద ప్రార్ధనలు చేశారు.

April 5, 2026 / 11:30 AM IST

తిరుపతిలో స్విమ్స్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

TPT: తిరుపతి స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం MRCలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ఫారం కోసం అధికారిక వెబ్‌సైట్ svimstpt.ap.nic.inను సందర్శించాలని కోరారు.

April 5, 2026 / 11:27 AM IST

ఘనంగా క్రీస్తు పునరుత్థాన ర్యాలీ

VZM: జమ్మూ పడాలపేటలో ఉన్న బేతని మిషన్ చర్చి ఆధ్వర్యంలో క్రీస్తు పునరుత్థాన ర్యాలీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాస్టర్ డా. పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పడాలపేట, నారాయణపురం, బీసీ కాలనీ, జమ్మూ, ఆనందపురం కాలనీ, సింగపూర్ సిటీ ప్రాంతాల మీదుగా కొనసాగింది. అనేక మంది క్రైస్తవులు ర్యాలీ సందర్భంగా స్తోత్ర గీతాలు పాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

April 5, 2026 / 11:24 AM IST

జగ్జీవన్ రామ్ కృషి మరువలేనిది: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజావేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాల మేరకు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలో అసమానతల నిర్మూలనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని టిడిపి సీనియర్ నాయకుడు చౌలం మల్లికార్జున పేర్కొన్నారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

April 5, 2026 / 11:20 AM IST