• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఫేషియల్ విధానంపై గ్రామస్థుల నిరసన

ASR: ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం డుంబ్రిగూడ మండలం అధ్యక్షుడు పాంగి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని లోగిలి గ్రామంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఫేషియల్ విధానం వల్ల మారుమూల ప్రాంతాలలో గిరిజన శ్రామికులు అనేక అవస్థలు పడుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ విధానం వల్ల సమస్య తప్ప ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

April 28, 2026 / 06:11 PM IST

జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డికి నివాళులు అర్పించిన జడ్పీ ఛైర్మన్

CTR: వీకోటలో హత్యకు గురైన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు మంగళవారం పరామర్శించారు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

April 28, 2026 / 06:08 PM IST

గంజాయి అమ్మే వారి సమాచారం తెలిపితే రూ.10 వేలు

మార్కాపురంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సీఐ అల్తాఫ్ హుస్సేన్ గంజాయి సమాచారానికి రూ.10 వేల బహుమతి ప్రకటించారు. సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యువత భవిష్యత్తు కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 28, 2026 / 06:06 PM IST

గంగ జాతరకు పక్కా ఏర్పాట్లు: కమిషనర్

TPT: తిరుపతిలో నిర్వహించనున్న తాతయ్యగుంట గంగజాతరకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేసి విజయవంతం చేయాలని ఇంఛార్జ్ కమిషనర్ శారదా దేవి అధికారులకు ఆదేశించారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ, సీసీ కెమెరాలు, మొబైల్ టాయిలెట్స్, అగ్నిమాపక చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో శుభ్రత, చెత్త తొలగించాలన్నారు.

April 28, 2026 / 06:06 PM IST

సంతగుడిపాడు స్వర్ణ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ

PLD: సంతగుడిపాడు గ్రామంలోని స్వర్ణ సచివాలయాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరు, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణతో పాటు ప్రజలకు అందుతున్న సేవలను సమగ్రంగా సమీక్షించారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.

April 28, 2026 / 06:03 PM IST

‘ప్రాజెక్టుల భూసేకరణ త్వరగా పూర్తిచేసి అప్పగించాలి’

VZM: జిల్లాలో కొనసాగుతున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజిల్ అంశం సద్దుమనిగే వరకు రెవిన్యూ అధికారులు బంకుల వద్ద పర్యవేక్షించాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశించారు. స్టాక్ ఉండగానే ఇండెంట్ పెట్టేలా చూడాలన్నారు.

April 28, 2026 / 06:02 PM IST

కారు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

KKD: ముమ్మిడివరానికి చెందిన రాజులపూడి అనిల్ మంగళవారం కాకినాడ నుంచి యానాం వెళ్తుండగా వై జంక్షన్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. గుర్తుతెలియని కారు అనిల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరంగి ఎస్సై సత్యనారాయణ రెడ్డి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

April 28, 2026 / 06:00 PM IST

క్రికెట్ పోటీలను ప్రారంభించిన రామేశ్వర్ రెడ్డి

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు చీమ స్థాయి క్రికెట్ పోటీలను టిడిపి మండల అధ్యక్షుడు మూల రామేశ్వర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, క్రీడాకారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

April 28, 2026 / 06:00 PM IST

జిల్లాలో ఇంధన సరఫరా పూర్తిగా సాధారణం: కలెక్టర్

తూ.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌తో పాటు దేవరపల్లి & గౌరీపట్నంలో కలెక్టర్, జిల్లా ఎస్పీతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇంధన సరఫరాపై ఎటువంటి అపోహలు అవసరం లేదని తెలిపారు.

April 28, 2026 / 06:00 PM IST

‘విలేఖరి హత్య నిందితులను శిక్షించాలి’

కోనసీమ: చిత్తూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను APWJF, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించాయి. రావులపాలెం సీఐ శేఖర్ బాబుకు వినతిపత్రం అందజేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. విలేఖరి సుబ్రహ్మణ్యంపై దాడిని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

April 28, 2026 / 06:00 PM IST

ఆక్వా, రైతాంగానికి డీజిల్ కొరత లేదు: కలెక్టర్

W.G: జిల్లాలో డీజిల్ సరఫరా పరిస్థితి సాధారణంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆక్వా, వ్యవసాయ రంగ రైతులు అవసరానికి మించి డీజిల్ కొనుగోలు చేయవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. జిల్లాలో ఎటువంటి డీజిల్ కొరత లేదని, అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత స్టాక్ అందుబాటులో ఉందన్నారు. మంగళవారం భీమవరంలో పలు పెట్రోల్ బంకులను పరిశీలించి యాజమాన్యాలకు సూచన చేశారు.

April 28, 2026 / 06:00 PM IST

60 మంది లబ్ధిదారులకు ఉచిత వాహనాలు

అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా 60 మంది దివ్యాంగులకు రూ.60 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటర్లు ఉచితంగా పంపిణీ చేశారు. జీవనోపాధి మెరుగుదలకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని, దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు.

April 28, 2026 / 06:00 PM IST

వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభం

VZM: గజపతినగరం శాఖ గ్రంథాలయంలో మంగళవారం గ్రంథాలయ అధికారి యజ్జల స్వప్న ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవిలో కొంత సమయాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని సూచించారు. వేసవి విజ్ఞాన శిబిరాలు నెల రోజులపాటు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

April 28, 2026 / 06:00 PM IST

పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన జేసీ

PPM: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఇంధన కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులతో పాటు, సమీప గ్రామీణ ప్రాంతాల బంకులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బంకుల్లో ఉన్న నిల్వల రిజిస్టర్లను తనిఖీ చేసి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

April 28, 2026 / 05:47 PM IST

సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం

NTR: తిరువూరులో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హై కోర్ట్ జడ్జి చీకటి మానవేంద్ర రాయ్‌ను బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జనార్ధన రావు, కృష్ణా రెడ్డి కలసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటరెడ్డి, హేమంత్ కుమార్, నవీన్ తదితరులు ఉన్నారు.

April 28, 2026 / 05:43 PM IST