NTR: విజయవాడ శ్రీనగర్ రెండవ లైన్‌కు చెందిన లక్ష్మి ఇంటింటికి తిరుగుతూ, వాటర్ క్యాన్స్ సరఫరా చేయడానికి అద్దె బండితో కిరాయి కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి, రూ.35,000/ విలువచేసే రిక్షా బండిని లక్ష్మికి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
మార్కాపురం: రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూప్ టాప్‌ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శనివారం మార్కాపురం మండలం పెద్ద యాచవరంలో పీఎం సూర్య ఘర్ సోలార్ రూట్ టాప్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
GNTR: తెనాలి పురపాలక సంఘ పరిధిలో గాంధీ పార్కు ఓల్డ్ ట్యాంక్ వద్ద షట్టర్ లీక్ ఏర్పడిన కారణంగా ఆదివారం పలు వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. 7వ వార్డుకు సగభాగం & 10,11 వార్డులకు పూర్తిగా మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. పట్టణ పరిధిలో 7, 10, 11 వార్డు ప్రజలు దీనిని గమనించాలని కోరారు.
ATP: గుంతకల్లులో శనివారం ‘స్టాప్ మైనర్ డ్రైవింగ్’ కార్యక్రమం నిర్వహించారు. తనిఖీల్లో పట్టుబడిన 68 మంది మైనర్ల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, 18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.
BPT: మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతిని వేటపాలెం జడ్పీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్స్, స్టూడెంట్స్ పూలతో ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వ సాధనకి కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని ఇంఛార్జ్ హెచ్ఎం యూ.వేణుగోపాల్ కొనియాడారు. స్త్రీ విద్య, ఉన్నతి కోసం ఆయన చేసిన కృషిని టీచర్స్ కీర్తించారు.
కృష్ణా: పామర్రు టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చదువే సమాజం మార్పుకు ఏకైక ఆయుధమని నమ్మిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమానీ ఘనంగా నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పులా మాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘ సంస్కర్త, మహిళా విద్య, కుల నిర్మూలన కోసం పోరాడిన పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించారన్నారు. దళితులు, బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేశారని అన్నారు.
TPT: శనివారం పురస్కరించుకుని తిరుపతి జిల్లా నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వాదాలు అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవను కళ్లారా తిలకించి తరించారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి.
E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS & రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 13న యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలే జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.
KDP: ఖాజీపేటలో శుక్రవారం మైనర్ బాలికను వెంకటేశ్ అనే యువకుడు గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు నిందితుడిని పట్టుకొని జైలుకు తరలిస్తున్న సమయంలో నిందితుడు పోలీసులపై తిరుగుబాటు చేసి పారిపోతున్న సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడి మోకాలి కింది భాగంలో ఎముక విరిగింది. దానికి నేడు రిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి వైద్యం అందించారు.
ELR: ఏలూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు శనివారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. సీ.పీ.స్ రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న డీ.ఏలు, సరెండర్ లీవ్ జీతం మంజూరు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికి 11వ పీ.ఆర్.సీ స్కేల్ ప్రకారం 100% గ్రాస్ జీతం అమలు చేయాలన్నారు.
NTR: చందర్లపాడు మండలం కొడవటికల్లులో రూ.45 లక్షల వ్యయంతో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని భూమి పూజ చేశారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించడం ద్వారా వ్యవసాయ రంగం ఇంకా ఎదగాలని ఆమె కోరారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రఘురాం పాల్గొన్నారు.
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో మధ్యాహ్నం నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు తరలివచ్చారు. నిర్ణీత సమయానికి బస్సులు రాక పోవడంతో గంటల తరబడి పడిగాపులు కాశారు. ఎప్పటికో ఒకటి అర బస్సు వచ్చినప్పటికీ ఎక్కేందుకు వీలు లేక చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు.
VSP: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించే వరకు పోరాటం ఆగదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పడాల గోవింద్ హెచ్చరించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే దీక్ష 1838వ రోజుకు చేరిందని తెలిపారు. కేంద్రంపై కార్పొరేట్ అనుకూల విధానాల ఆరోపణలు చేశారు. ప్లాంట్‌కు గనులు, ప్యాకేజీ, కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.