• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు శ్రీ మంచాలమ్మ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ళు

KDP: కమలాపురం మండలంలోని చదిపిరాళ్ల గొల్లపల్లె గ్రామాల మధ్యన వెలసిన మంచాలమ్మ పాలేటి గంగమ్మ తిరునాళ్ళు మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉదయం అమ్మవారికి పూజలు, అభిషేకాలు, ప్రధాన కలశ స్థాపన, అఖండ దీపారాధన నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, అమ్మవారి కృపకు పాత్రులు కాగలరన్నారు.

April 28, 2026 / 08:29 AM IST

పోలీసు ప్రజావాణికి 72 ఫిర్యాదులు

CTR: పలమనేరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుషార్, చిత్తూరు సాయుధ దళం కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 72 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. భూతగాదాలు 19, నగదు లావాదేవీలు 12, కుటుంబ సమస్యలు 11 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. వీటిని పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

April 28, 2026 / 08:25 AM IST

వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

BPT: బల్లికురవ మండలం ముక్తేవ్వరం గ్రామానికి చెందిన రజని అనే వివాహిత ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయారు. ఆమె సోదరుడు రామకోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు సోమవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్పర్థల కారణంగా ఆమె పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం.

April 28, 2026 / 08:18 AM IST

పెట్రోలు బంకులు మూత పడకుండా చూడాలి: MLA

VZM: ఇంధనం కోసం పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చీపురుపల్లి MLA కళా వెంకటరావు సూచించారు. సోమవారం తమ నివాసంలో RDO సుధారాణి, DSP రాఘవులుతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్‌ బంకుల్లో ఇంధన కొరత తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బంకులు మూతపడకుండా చూడాలని, ఈ విషయంలో CM సీరియస్‌గా ఉన్నారని అన్నారు.

April 28, 2026 / 08:15 AM IST

గడువు ముగిస్తే రాయితీలు వర్తించదు: కమిషనర్

KKD: పిఠాపురంలో ఇంటి, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించేందుకు మరో రెండు రోజులే సమయం ఉందని కమిషనర్ కనకారావు సోమవారం తెలిపారు. ఈ నెల 30 లోపు పన్ను చెల్లిస్తే పాత బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ, ప్రస్తుత పన్నుపై 5% రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు ముగిస్తే రాయితీలు వర్తించవన్నారు.

April 28, 2026 / 08:15 AM IST

ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి: ఎస్సై

NDL: ఉయ్యాలవాడలో జరుగుతున్న గంగ జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్సై రామిరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. ఇవాళ, రేపు గ్రామానికి నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల కోసం 4 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. ఆళ్లగడ్డ నుంచి ఉయ్యాలవాడ మీదుగా JMD, KKL వెళ్లే వాహనదారులు దొర్నిపాడు మీదుగా వెళ్లాలన్నారు.

April 28, 2026 / 08:12 AM IST

జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా క్షితిజ్ ఆదిత్య శర్మ

తూ.గో: జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా శ్రీక్షితిజ్ ఆదిత్య శర్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి విధులకు రిపోర్ట్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా అందాలని, ప్రజలకు జవాబుదారితనం, పారదర్శకతతో సేవలందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆయనకు దిశానిర్దేశం చేశారు.

April 28, 2026 / 08:11 AM IST

విశాఖలో ఎగిసిపడుతున్న నిమ్మకాయ ధరలు

VSP: విశాఖ రైతు బజారులో కూరగాయల ధరలు మంగళవారం స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. టమాటా రూ.37, ఉల్లిపాయ రూ.17, బంగాళదుంప రూ.12గా ఉన్నాయి. వంకాయ రూ.30, మిర్చి రూ.28, కాకరకాయ రూ.48, మునగకాడలు రూ.42 పలుకుతున్నాయి. ఇతర కూరగాయలు సాధారణంగా లభిస్తుండగా, నిమ్మకాయ ధర మాత్రం రూ.180కు చేరి వినియోగదారులను ఆశ్చర్యపరుస్తోంది.

April 28, 2026 / 08:10 AM IST

వడదెబ్బతో 18 పొట్టేళ్లు మృతి

సత్యసాయి: కదిరి మండలం చిగురుమంతాండ పంచాయతీ పరిధిలోని చిగురుమామి తండాలో విషాదం చోటుచేసుకుంది. బి. రవి నాయక్‌కు చెందిన 18 పొట్టేళ్లు ఒక్కసారిగా మృతి చెందాయి. తీవ్ర ఎండలు, వడదెబ్బతో పాటు మందు ప్రభావం కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనతో రైతు కుటుంబంలో దుఃఖం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 28, 2026 / 08:07 AM IST

త్వరలో తిరుమలలో బిగ్ క్యాంటీన్ల ప్రారంభం

TPT: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేసి భక్తులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరి ఆదేశించారు. నిర్ణయించిన ధరలకే ఆహారం విక్రయించాలని, సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

April 28, 2026 / 08:05 AM IST

తాడిపత్రిలో పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు

ATP: తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృత తనిఖీలు నిర్వహించారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డితో కలిసి కడప-అనంతపురం ప్రధాన రహదారిపై వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో పాటు ప్రయాణికుల వివరాలను ఆరా తీశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.

April 28, 2026 / 08:04 AM IST

ఈనెల 30న మున్సిపాలిటీలో వేలం

CTR: పలమనేరు మున్సిపాలిటీలోని చేపల చెరువులు, మాంస దుకాణాలకు ఏడాది పాటు లీజు వసూలుకు ఈనెల 30న వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11గంటలకు వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు మున్సిపల్ కార్యాలయంలో నిబంధనల మేరకు వేలంలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.

April 28, 2026 / 08:03 AM IST

ఘనంగా సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

ELR: లింగపాలెం మండలం రంగాపురంలోని చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ భూనీల సహిత సత్యనారాయణ వారి ఆలయంలో 62వ బ్రహ్మోత్సవాలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో విశ్వక్ సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

April 28, 2026 / 07:56 AM IST

విశాఖ చేరుకున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

VSP: విశాఖలో నేడు జరగనున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబుతో కలిసి అశ్వినీ వైష్ణవ్ పాల్గొంటారు.

April 28, 2026 / 07:56 AM IST

నేడు డోన్‌లో మాజీ మంత్రి ప్రెస్ మీట్

NDL: కృత్రిమ ఇంధన కొరత అంశంపై ఇవాళ ఉ. 10 గంటలకు డోన్ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులపై బుగ్గన మాట్లాడతారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.

April 28, 2026 / 07:54 AM IST