గుంటూరు: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని AT అగ్రహారం ప్రాంతంలో రహస్యంగా నడుస్తున్న వ్యభిచార దందాను పోలీసులు ఛేదించారు. రెండో లైన్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని SHO సత్యనారాయణ హెచ్చరించారు.
ATP: రాప్తాడు మైనార్టీ కాలనీలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు స్త్రీరక్ష పోర్టల్, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. గృహ హింస, సైబర్ నేరాలు, వేధింపుల నుంచి చట్టపరమైన రక్షణ ఎలా పొందాలో మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
కోనసీమ: ఇంటర్ ఫలితాల్లో పాసర్లపూడికి చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు సాయివర్మ 981 మార్కులతో అద్భుత ప్రతిభ చాటాడు. ఏడాది క్రితం తల్లి పాముకాటుతో మరణించినా, ఆ విషాదాన్ని దిగమింగుకొని ప్రభుత్వ కళాశాలలో చదివి ఈ ఘనత సాధించాడు. గురువారం జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సాయివర్మను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఐఐటీలో చేరాలన్నదే తన ఆశయం అని విద్యార్థి అన్నారు.
గుంటూరు: తెనాలి చెంచుపేటలో ఆన్‌లైన్ ద్వారా అసభ్య వీడియో కాల్స్ నిర్వహిస్తున్న రాకెట్ బయటపడింది. మహిళలను ఉపయోగించి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన మహిళ కుమారుడు పరారీలో ఉండగా గాలింపు కొనసాగుతోంది. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
తిరుపతి SVIMS శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. కొండగుంట నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. డా. ఉషాకళావత్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆమె స్థానంలో నాగరాజును నియమించినట్లు స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్.వీ. కుమార్ తెలిపారు. నిబద్ధతతో పనిచేసి SVIMSకు ఆమె మంచి పేరు తెచ్చారని కొనియాడారు.
CTR: కాణిపాకంలో ఈనెల 19న సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు దేవస్థాన ఆస్థాన మండపంలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
E.G: రాజానగరం నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. ప్రతి బాటిల్‌పై MRP కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్మిట్ రూమ్‌లలో లూజ్ మద్యం అమ్మకాలు, బిల్లులు ఇవ్వకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిండికేట్లపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
VZM: నేడు విజయనగరంలోని MR కాలేజ్లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్స్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీలు సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు అర్హులని పేర్కొన్నారు.
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రహదారుల అభివృద్ధి, పరిశ్రమలకు నీటి సరఫరా లభ్యతపై ప్రత్యేకంగా చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లభించిన ఉద్యోగ అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు.
ఏలూరు 1వ పట్టణానికి చెందిన చింటూ అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగికపై దాడికి పాల్పడినట్లు రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. అలంకరణ పనులు చేసే నిందితుడు, ఏప్రిల్ 2న బాలికను విజయవాడ తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
AKP: ఓటరు జాబితాలను పరిశీలించి తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేయించాలని పాయకరావుపేట పట్టణ పార్టీ అధ్యక్షుడు వై. వరహాల బాబు సూచించారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివరాం పాల్గొన్నారు.
KDP: సిద్దవటం పరిధిలోని లింగంపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 13 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు SI హారిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అక్రమ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో గురువారం దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు.
NLR: కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని గురువారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలో వరిగొండలో పర్యటించిన ఆయన గతంలో ధాన్యం పుట్టి రూ.25 వేలుంటే, గిట్టుబాటు ధర లేక రూ. 16 వేలకు అమ్మి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
VSP: మహిళలు, విద్యార్థినుల భద్రతే పోలీసుల ప్రాధాన్యమని సీఐ తిరుమలరావు అన్నారు. కేజీబీవీ పాఠశాలలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో సైబర్ నేరాలు, ఈవ్‌టీజింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘దిశ’ యాప్ అత్యవసర సమయంలో రక్షణగా పనిచేస్తుందని వివరించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. అనుమానాస్పద ఘటనలను 100/112కు తెలియజేయాలని చెప్పారు.
SKLM: ఇద్దివానిపాలెంలో గురువారం ప్రత్యేక గ్రామసభనిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక అధికారి కె. శ్రీనివాసరావు, సెక్రటరీ పంచాయతీ తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. గ్రామ ప్రజల సమక్షంలో లిస్ట్ను ప్రదర్శించి వివరాలను చూపించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, మార్పుల గురించి చర్చించారు.