• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అగ్రహారంలో వ్యభిచార గృహంపై దాడి

గుంటూరు: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని AT అగ్రహారం ప్రాంతంలో రహస్యంగా నడుస్తున్న వ్యభిచార దందాను పోలీసులు ఛేదించారు. రెండో లైన్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని SHO సత్యనారాయణ హెచ్చరించారు.

April 17, 2026 / 08:40 AM IST

మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన

ATP: రాప్తాడు మైనార్టీ కాలనీలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు స్త్రీరక్ష పోర్టల్, శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. గృహ హింస, సైబర్ నేరాలు, వేధింపుల నుంచి చట్టపరమైన రక్షణ ఎలా పొందాలో మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

April 17, 2026 / 08:36 AM IST

అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

E.G: రాజమండ్రి నగరంలోని మల్లయ్యపేట సబ్ స్టేషన్ పరిధిలో RDSS పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE నక్కపల్లి శామ్యూల్ గురువారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆనంద్ నగర్, పేపర్ మిల్ క్వార్టర్స్, రామకృష్ణ నగర్, ఇందిరానగర్, శానిటోరియం,వెంకటాపురం తదితర ప్రాంతాల్లో కోత ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. 

April 17, 2026 / 08:31 AM IST

కన్నీటిని దిగమింగి.. విజయానికి చేరిన సాయి వర్మ

కోనసీమ: ఇంటర్ ఫలితాల్లో పాసర్లపూడికి చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు సాయివర్మ 981 మార్కులతో అద్భుత ప్రతిభ చాటాడు. ఏడాది క్రితం తల్లి పాముకాటుతో మరణించినా, ఆ విషాదాన్ని దిగమింగుకొని ప్రభుత్వ కళాశాలలో చదివి ఈ ఘనత సాధించాడు. గురువారం జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సాయివర్మను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఐఐటీలో చేరాలన్నదే తన ఆశయం అని విద్యార్థి అన్నారు.

April 17, 2026 / 08:30 AM IST

వినుకొండలో నేడు ప్రజా దర్బార్: జీవీ ఆంజనేయులు

పల్నాడు: వినుకొండ పట్టణం కొత్తపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల వినతులను నేరుగా స్వీకరించనున్నారు. ప్రజలు తమ సమస్యలు, విజ్ఞప్తులను తెలియజేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యాలయం కోరింది.

April 17, 2026 / 08:29 AM IST

చైన్ స్నాచింగ్ పై అవగాహన కల్పించిన ఎస్సై

VZM: చైన్‌ స్నాచింగ్‌ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని వంగర ఎస్సై షేక్ శంకర్ సూచించారు. గురువారం సాయంత్రం స్దానిక‌ మడ్డువలస జంక్షన్‌ వద్ద వైన్‌ స్నాచింగ్‌, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలు బహిరంగంగా ధరించకుండా జాగ్రత్త వహించాలన్నారు.

April 17, 2026 / 08:22 AM IST

కడప జిల్లాకు రానున్న YS జగన్..?

KDP: ఖాజీపేటలోని అగ్రహారానికి చెందిన కీర్తన ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల 19 మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఈ పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అలాగే అలంఖాన్ పల్లెలో పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

April 17, 2026 / 08:20 AM IST

తెనాలిలో న్యూడ్ కాల్స్ రాకెట్ బట్టబయలు

గుంటూరు: తెనాలి చెంచుపేటలో ఆన్‌లైన్ ద్వారా అసభ్య వీడియో కాల్స్ నిర్వహిస్తున్న రాకెట్ బయటపడింది. మహిళలను ఉపయోగించి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన మహిళ కుమారుడు పరారీలో ఉండగా గాలింపు కొనసాగుతోంది. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.

April 17, 2026 / 08:15 AM IST

స్విమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ నియామకం

తిరుపతి SVIMS శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్‌గా కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. కొండగుంట నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. డా. ఉషాకళావత్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆమె స్థానంలో నాగరాజును నియమించినట్లు స్విమ్స్ డైరెక్టర్ డా.ఆర్.వీ. కుమార్ తెలిపారు. నిబద్ధతతో పనిచేసి SVIMSకు ఆమె మంచి పేరు తెచ్చారని కొనియాడారు.

April 17, 2026 / 08:12 AM IST

ఈనెల 19న సామూహిక అక్షరాభ్యాసం

CTR: కాణిపాకంలో ఈనెల 19న సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు దేవస్థాన ఆస్థాన మండపంలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

April 17, 2026 / 08:11 AM IST

రాజానగరంలో మద్యం ‘ధరల’ దోపిడి

E.G: రాజానగరం నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. ప్రతి బాటిల్‌పై MRP కంటే రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్మిట్ రూమ్‌లలో లూజ్ మద్యం అమ్మకాలు, బిల్లులు ఇవ్వకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిండికేట్లపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

April 17, 2026 / 08:09 AM IST

నేడే విజయనగరంలో మినీ జాబ్ మేళా…

VZM: నేడు విజయనగరంలోని MR కాలేజ్లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్స్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీలు సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. 10వ తరగతి, డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణులై, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్ళు అర్హులని పేర్కొన్నారు.

April 17, 2026 / 08:01 AM IST

ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రహదారుల అభివృద్ధి, పరిశ్రమలకు నీటి సరఫరా లభ్యతపై ప్రత్యేకంగా చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లభించిన ఉద్యోగ అవకాశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు.

April 17, 2026 / 08:00 AM IST

మైనర్ బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

ఏలూరు 1వ పట్టణానికి చెందిన చింటూ అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగికపై దాడికి పాల్పడినట్లు రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. అలంకరణ పనులు చేసే నిందితుడు, ఏప్రిల్ 2న బాలికను విజయవాడ తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

April 17, 2026 / 07:52 AM IST

‘ఓటరు జాబితాలను పరిశీలించాలి’

AKP: ఓటరు జాబితాలను పరిశీలించి తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేయించాలని పాయకరావుపేట పట్టణ పార్టీ అధ్యక్షుడు వై. వరహాల బాబు సూచించారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు. అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివరాం పాల్గొన్నారు.

April 17, 2026 / 07:48 AM IST