PPM: కురుపాం నియోజకవర్గంలోని పదవీకాలం పూర్తి అయిన సర్పంచులను డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలి అన్నారు.
CTR: అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి నారా లోకేష్ , చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సహా కూటమి ఎంపీల బృందం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భేటీలో అమరావతి విశిష్టతపై వివరించే బుక్‌లెట్‌ను మంత్రి లోకేష్ సమర్పించారు. రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు విజన్‌ను, భూములు ఇచ్చిన రైతులను అభినందించారు.
VZM: సమగ్రశిక్ష ఉద్యోగుల సంక్షేమం కోసం తమ వంతు సహకారాన్ని అందజేయాలని ఉద్యోగుల సంఘం నాయకులు ఆరికతోట రామకృష్ణ, పి. సింహాచలం తెలియజేశారు. ఇవాళ నెల్లిమర్లలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్రశిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమం నిధిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.
KRNL: ఆదోనిలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకుడు శ్రీకాంత్ సబ్ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా బలవంతపు చేరికలు చేపడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
E.G: ఈ నెల 26, 27, 28 తేదీలలో తిరుపతిలో జరిగే AITUC రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, 26న జరిగే కార్మిక ప్రదర్శనకు పెద్ద ఎత్తున కార్మికులు తరలిరావాలని CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. సోమవారం రాజమండ్రిలో మేస్త్రీల సమావేశం యూనియన్ అధ్యక్షుడు కె. రాంబాబు అధ్యక్షతన జరిగింది. మే డే వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.
ATP: ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌ను మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కలిశారు. అనంతపురంలోని ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. గతంలో నిలిచిపోయిన FCRA లైసెన్స్ పునరుద్ధరణ కోసం వారు చేసిన కృషిని మాంచో ఫెర్రర్ గుర్తుచేసుకున్నారు. జిల్లాలో సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించారు.
సత్యసాయి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారి అంతరాలయ దర్శనం ఈ నెల 15 నుంచి పునఃప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 6:45 గంటల వరకు భక్తులకు ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
KDP: నగరంలోని ఎర్రముక్కపల్లి–విశ్వనాధపురం మధ్య పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సీఎం పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన లభించింది. రెండు సంవత్సరాలుగా పనులు పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బ్రిడ్జిని పూర్తి చేయాలని సాధన కమిటీ డిమాండ్ చేశారు.
ATP: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈ నెల 20న నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకుడు చౌలం మల్లికార్జున పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. రక్తదానం చేసే వారికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
NLR: కొండాపురం మండల కేంద్రంలో ఉన్న లైబ్రరీ రెండేళ్ల నుంచి మూసివేశారు. దీని వలన విశ్రాంత ఉద్యోగులకు, పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుందని సోమవారం బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేస్తూ.. గతంలో ఎంతో ఉపయోగంగా ఉండే లైబ్రరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రెసిడెంట్ కరుటూరి శ్రీరామమూర్తి, పంచాయతీ ప్రత్యేక అధికారితో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పారదర్శకంగా కొనుగోలు జరుగుతాయని హామీ ఇచ్చారు.
కోనసీమ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేసే ప్రభుత్వం అని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం నేదునూరు సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం రైతులకు ఉచితంగా విత్తనాలు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ నగర్ 7వ లైన్‌లో సీసీ రోడ్డు, డ్రైన్స్ నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
PLD: వినుకొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్ తెలిపారు. మున్సిపల్ ఆఫీసులోని 1వ సచివాలయం, ఓబయ్య కాలనీలోని సచివాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆధార్ కార్డు నమోదు, మార్పులు చేయించుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
KDP: మాజీ సీఎం వైఎస్ జగన్ మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు జగన్‌కు మావిగన్ గుర్తుకు రాలేదా, అమరావతి చట్టబద్దత ఓర్వలేకే మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.