GNTR: జన గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించాలని కలెక్టర్ CM.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
కృష్ణా: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని ఇవాళ మోపిదేవిలో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
PPM: మహిళా సంఘాల అభివృద్ధికి VAOలు కీలక పాత్ర పోషించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు.ఈ మేరకు ఆమె సోమవారం సాలూరులో సాలూరు, మక్కువ, పాచిపెంట VAOలకు సెల్ ఫోన్లు అందజేసారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలని వారి ఉన్నతికి స్త్రీ నిధి రుణాలను అందజేసినట్లు తెలిపారు.
ATP: పెద్దపప్పూరు మండలంలోని దర్మాపురం, అమ్మలదిన్నె, ముచ్చుకోట గ్రామాల్లో సోమవారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, ఈఓ సుబ్రమణ్యం కౌలు భూముల వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఆలయానికి సంబంధించిన భూములకు వేలంపాట నిర్వహించగా రూ.7,37,500 ఆలయానికి ఆదాయం వచ్చిందన్నారు.
SKLM: అరసవల్లిలోని జరిగే అసిరి తల్లి సిరి మాను ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి స్థానిక మున్సిపల్ మైదానంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి, MLA శంకర్‌తో కలిసి ఉత్సవ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
VZM: గ్రామదేవత పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని DSP ఆర్. గోపాలరావు సూచించారు. సోమవారం సాయంత్రం పాత బొబ్బిలి గ్రామ పెద్దలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్సవాల్లో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.
మార్కాపురం జిల్లా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సురక్ష చర్యలపై ప్రజలకు వివరించారు. అనంతరం మాక్‌డ్రిల్ నిర్వహించి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలో వివరించారు. రోగులను ఎలా సురక్షితంగా బయటకు తరలించాలనే అంశాలపై ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు.
PLD: నరసరావుపేటలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త హన్నుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన ఎస్పీ కార్యాలయానికి సమీపంలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివవరాలు తెలియాల్సి ఉంది.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో పోలీసుల పాత్ర ఎంతైనా ఉందని టీడీపీ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా డీఐజీ కోయా ప్రవీణ్న్ను ఆలయ అర్చకులు కలిసి ముత్యాల తలంబ్రాలు అందజేశారు. భక్తుల సేవలో తమ బాధ్యతలను నిర్వహించడం గర్వంగా భావిస్తున్నామని డీఐజీ పేర్కొన్నారు.
మార్కాపురం జిల్లా రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కనిగిరి మున్సిపల్ కార్మికులు ఇవాళ తెల్లవారుజాము నుంచే తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రిటైర్మెంట్, మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆప్కాస్‌లో చేర్చాలని, పెరిగిన వార్డులకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా నాయకులు PV.కేశవరావు పాల్గొన్నారు.
నెల్లూరు: బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈనెల 26న నెల్లూరు వస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి తెలిపారు. నెల్లూరులో మాట్లాడుతూ.. యాదవ భవన్లో ఈనెల 26న బీసీ సంక్షేమ సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
KDP: బి. కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. మున్నెల్లి చిన్న గురయ్య కుమారుడు(3) నీళ్ల బకెట్లో పడి మృతి చెందాడు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. ఘటరపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సత్యసాయి: ధర్మవరం YCP సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పథకం, హార్టికల్చర్ పనులలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని కలెక్టరుకు వివరించారు. క్షేత్రస్థాయిలో పనులు జరగకపోయినా జరిగినట్లు చూపిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
W.G: జిల్లాలో వరి కోతల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వర్షాల ముప్పు ఉన్నందున రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో 50% గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
CTR: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు రాయితీపై పంపిణీ చేసేందుకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు వ్యవసాయ శాఖ జేడీ మురళీ తెలిపారు. ఈ సీజన్లో 88,095 ఎకరాల్లో వేరుశనగ సాగు కానున్నట్లు అంచనా వేశామన్నారు. మే రెండో వారంలో విత్తనాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.