• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘డ్రగ్స్ వాడకం జాతీయ భద్రతకు ముప్పు’

GNTR: వడ్లమూడి వర్సిటీలో డ్రగ్స్‌పై అవగాహనకు ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఏపీ ఈగల్ ఐజీపీ రవికృష్ణ సోమవారం పాల్గొన్నారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని ఆయన హెచ్చరించారు. వీటికి పెట్టే ఖర్చు ఉగ్రవాదులకు చేరుతోందన్నారు. నార్కో టెర్రరిజంపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 14, 2026 / 08:00 AM IST

దారుణం.. చిన్నారిపై వృద్ధుడి అకృత్యం

ATP: కళ్యాణదుర్గం మండలంలో ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన తమ్మప్ప(65) అనే వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైంది. తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లిన సమయంలో నిందితుడు చిన్నారులను టీవీ చూసేందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అకృత్యానికి పాల్పడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

April 14, 2026 / 07:53 AM IST

‘వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి’

AKP: వైసీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం సబ్బవరం మండలం గొటివాడలో పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు పి. సురేష్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పాల్గొన్నారు.

April 14, 2026 / 07:42 AM IST

భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

EG: ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా’ కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల నిర్వహణ, భూగర్భ జలాల పెంపుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి దీనిపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో, ఏర్పాట్లన్నీ పక్కాగా పూర్తి చేయాలని సూచించారు.

April 14, 2026 / 07:36 AM IST

‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి’

VSP: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సోమలింగం పాలెం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సాయిబాబా, స్కూల్ కమిటీ ఛైర్మన్ నాగ విశ్వేశ్వరరావు సోమవారం విజ్ఞప్తి చేశారు. జడ్పీ హైస్కూల్ పరిధిలో వారు ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు.

April 14, 2026 / 07:36 AM IST

‘ఈ నెల 22 జరిగే మేగా కోలాటానికి విద్యార్థులను సన్నద్ధం చేయాలి’

PPM: జిల్లా కేంద్రంలో ఈ నెల 22 న నిర్వహించబోతున్న మెగా కోలాటం గిన్నిస్‌ బుక్‌ ప్రదర్శనకు విద్యార్థులను సన్నద్ధం చెయ్యాలని బలిజిపిట MEO-1సామల సింహాచలం సూచించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని హైస్కూల్‌ HMలు, PD లతో గూగుల్‌ మీట్‌ ద్వారా రెండో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి స్కూల్‌ నుండి 50 మంది విద్యార్థులతో ఒక టీంను తయారు చేయాలన్నారు.

April 14, 2026 / 07:35 AM IST

PGRS సమర్థవంతమైన వేదిక.. జిల్లా కలెక్టర్

ASR: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పిజిఆర్ఎస్ సమర్థవంతమైన వేదికగా పనిచేస్తోందని కలెక్టర్ టీ. నిషాంతి పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా పిజిఆర్ఎస్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

April 14, 2026 / 07:35 AM IST

జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలి’

AKP: ఎస్. రాయవరం మండలం తిమ్మాపురం మేజర్ పంచాయతీలో అసంపూర్తిగా ఉన్న జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలని మాజీ సర్పంచ్ కర్రి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ పరిధిలో 2021లో మొదలైన జీవన్ మిషన్ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు.

April 14, 2026 / 07:29 AM IST

‘పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి’

VZM: దాడితల్లి, సరే పోలమ్మ తల్లి అమ్మవారి పండుగలు నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పారిశుద్య పనులు చేపట్టాలని బొబ్బిలి మునిసిపల్ కమీషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. సోమవారం ఆమె కార్యాలయంలో శానిటరీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… ప్రతి వార్డులో విజిబుల్‌ క్లినింగ్నెస్‌ ఉండేలా కాలువలు శుభ్రం చేయాలన్నారు.

April 14, 2026 / 07:28 AM IST

PGRSలో ఫేక్ డాక్యుమెంట్లతో భూ కబ్జా ఆరోపణలు

అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో భూ కబ్జా ఆరోపణలు వెలుగుచూశాయి. బి.కొత్తకోట గట్టుకు చెందిన గౌష్ ఖాన్ పేరుతో ఉన్న భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, మొటుకుపల్లి శివ అక్రమంగా స్వాధీనం చేసుకుని చదును చేస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరినట్లు బాధితులు తెలిపారు.

April 14, 2026 / 07:28 AM IST

మంగళవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, బయట ATGH వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 72,724 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 31,786 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

April 14, 2026 / 07:27 AM IST

పుట్టపర్తిలో ఆకట్టుకున్న నాటక ప్రదర్శన

సత్యసాయి: తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళనాడు సాయి యువత ‘త్యాగతిన్ శిఖరంగాళ్’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. సంఘం కాలం నాటి పారి, పేగన్ వంటి ఏడుగురు గొప్ప దాతల త్యాగనిరతిని ఈ నాటకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. మూగజీవాలు, ప్రకృతి పట్ల వారు చూపిన కరుణను కళ్ళకు కట్టినట్లు చూపారు.

April 14, 2026 / 07:27 AM IST

మంత్రాలయంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఎస్సై మల్లికార్జున సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నిషేధిత వస్తువుల రవాణాపై హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి, సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలకు జరిమానా విధించామన్నారు.

April 14, 2026 / 07:27 AM IST

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గియడమే లక్ష్యం: ఎస్పీ

NLR: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల సోమవారం తెలిపారు. బస్సుల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్‌ను పరిశీలిస్తున్నామని, హైవేలపై బ్లాక్ స్పాట్స్‌ను ఇప్పటికే సరిదిద్దామని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాల మరణాల రేటు 20% తగ్గిందని ఆమె పేర్కొన్నారు.

April 14, 2026 / 07:27 AM IST

డీ. పోలవరంలో పోలీసులు పల్లె నిద్ర

KKD: తుని మండలం డీ. పోలవరంలో సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు పెంచేందుకే ఈ కార్యక్రమని ఆయన పేర్కొన్నారు.

April 14, 2026 / 07:24 AM IST