• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళ మిస్సింగ్.. తల్లిదండ్రులకు అప్పగింత

GNTR: ఒడిశాకు చెందిన మహిళ ఫిరంగిపురం వచ్చి తిరిగి వెళ్తూ తప్పిపోయింది. ఈ నెల 20న తల్లిదండ్రులు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఫిరంగిపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించి మహిళను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

April 26, 2026 / 01:05 PM IST

ఒడిశా పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం

మన్యం: సాలూరు నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పద కోటియా గిరిజన గ్రామాల్లో ఒడిశా పోలీసుల తీరుపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగణన లెక్కలకు సహకరించలేదనే నెపంతో ఎగువశింబి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

April 26, 2026 / 01:03 PM IST

సోనో స్కాన్స్ కేంద్రాన్ని ప్రారంభించిన వైసీపీ నేత

NDL: డోన్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనో స్కాన్స్ కేంద్రాన్ని ఆదివారం వైసీపీ యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు సకాలంలో స్కానింగ్ సేవలు అందించాలని నిర్వాహకులకు బుగ్గన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 26, 2026 / 01:02 PM IST

5K రన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

KRNL: సెన్సెస్-2027పై అవగాహన కల్పిస్తూ ఆదివారం కర్నూలులో 5కే రన్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రన్ సాగింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి, జనగణనకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

April 26, 2026 / 01:01 PM IST

జనసేన నాయకుడు రంగారావు మృతి

E.G: కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పీకే రంగారావు మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన రంగారావు సేవలను నేతలు స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

April 26, 2026 / 12:59 PM IST

పొదల్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

NLR: చేజర్ల మండలంలోని చిత్తలూరు, రెడ్డి గుంట వాగు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గాలిపాలెం నుంచి చేజర్లకు వెళుతున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కారు ముందు భాగం దెబ్బతినింది.

April 26, 2026 / 12:55 PM IST

ఆలూరులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం

KRNL: సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇవాళ ఆలూరులో దళిత నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా ఈరన్న క్యాంప్‌లో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

April 26, 2026 / 12:51 PM IST

హనీట్రాప్‌ కేసులో ముమ్మర విచారణ

ATP: హనీట్రాప్‌ కేసులో పోలీసు ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరు సీఐలు, పలువురు సిబ్బందిని వీఆర్‌కు పంపగా, తాజాగా రాప్తాడు సీఐ డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. ఎస్పీ జగదీశ్‌ పర్యవేక్షణలో ఏఎస్పీ, ట్రైనీ ఐపీఎస్‌ అధికారుల బృందం విచారణ జరుపుతోంది. ప్రధాన నిందితురాలు రంగమ్మను కస్టడీకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.

April 26, 2026 / 12:50 PM IST

రాజమండ్రిలో రమేష్ కిడ్నీ హాస్పిటల్ ప్రారంభం

E.G: రాజమండ్రి పాత సోమలమ్మ అమ్మవారి ఆలయం రోడ్డులో నూతనంగా నిర్మించిన రమేష్ కిడ్నీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. యాజమాన్యం ఆహ్వానం మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

April 26, 2026 / 12:47 PM IST

వార్త తెలిసిన వెంటనే వైద్యాధికారి విచారణకు ఆదేశం

మన్యం: సికెడి (క్రానికల్ కిడ్నీ డిసీజ్)పై వైద్య సిబ్బంది నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న ఓ పత్రికలో వచ్చిన ‘ఏ తలుపు తట్టిన మృత్యు ఘోషే’ వార్తకు ఆయన పై విధంగా స్పందించారు. వార్త తెలిసిన వెంటనే జియ్యమ్మవలస ఆరోగ్య వైద్యాధికారిని విచారణ చేసి రిపోర్ట్ పంపాలని ఆదేశించారు.

April 26, 2026 / 12:47 PM IST

ఆదోనిలో సెన్సెస్ స్వీయ గణనపై 5కే రన్

KRNL: ఆదోనిలో సెన్సెస్ స్వీయ గణనపై అవగాహన కల్పించేందుకు ఆదివారం 5కే రన్ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రన్ సాగింది. మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 150 మంది మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజల్లో స్వీయ గణనపై చైతన్యం పెంచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

April 26, 2026 / 12:43 PM IST

సీఎంను కలిసిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు

కృష్ణా: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సీఎం చంద్రబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కోటి పైన సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని, టీడీపీకి కార్యకర్తలే బలమని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబు నాగేంద్రప్రసాద్‌కు సూచించినట్లు ఆయన తెలిపారు.

April 26, 2026 / 12:43 PM IST

మాజీ ముఖ్యమంత్రికి పలువురి నివాళి

GNTR: ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి చెందారు. ఈ మేరకు హైదరాబాదులోని ఆయన నివాసంలో చిత్రపటానికి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్ హెని క్రిస్టినా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దపల్లి నాగరాజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.

April 26, 2026 / 12:41 PM IST

భక్తిశ్రద్ధలతో శ్రీ వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు

ATP: గుత్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారి జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేణుగోపాలస్వామి ఆలయం నుండి అమ్మవారి ఆలయం వరకు 108 మంది మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి కలశములతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు.

April 26, 2026 / 12:38 PM IST

గొల్లల మామిడాడలో ప్రసిద్ధ సూర్యనారాయణ ఆలయం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడలో ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 170 అడుగుల ఎత్తైన గోపురంతో 16 ఎకరాల కొబ్బరి తోట మధ్యలో కొలువై ఉంది. దీనిని ‘కోనసీమ కోణార్క్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి వారు తన భార్యలతో పూజించబడతారు. ఈ ఆలయాన్ని సుమారు 100 ఏళ్ల క్రితం జమీందారులు నిర్మించారు. ప్రతి ఆదివారం విశేష పూజలు జరుగుతాయి.

April 26, 2026 / 12:36 PM IST