GNTR: రాష్ట్ర రాజధానిలోని SRM యూనివర్సిటీలో మంగళవారం జరగనున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం ఆయన SRM తదితర ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
NDL: నంద్యాల కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ జి.రాజకుమారి అర్జీలు స్వీకరించారు. PGRS అర్జీలు రీ-ఓపెన్ కాకూడదని, అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని ఉపాధి హామీ (MGNREGS) పనులను ఎంపీడీఓ వీరభద్రచారి సోమవారం ఫీల్డ్ అసిస్టెంట్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. అలాగే కూలీలతో మాట్లాడి, హాజరు నమోదు విధానం, పనుల అమలు తీరు గురించి వివరాలు తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా, సమయానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
VSP: రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ పోటీలలో విశాఖపట్నం జట్టు తొలిసారిగా పాల్గొని కేవలం 6 సెకన్ల తేడాతో నాలుగో స్థానం సాధించింది. పరిమిత వనరులు, సరైన ప్రాక్టీస్ లేకపోయినా సీనియర్ జట్లతో సమానంగా పోటీపడి ప్రతిభ చూపింది. కోచ్ వి. దాసారావు మాట్లాడుతూ.. సరైన సదుపాయాలు కల్పిస్తే క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధిస్తారని తెలిపారు.
కృష్ణా: మోపిదేవిలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ సకలేశ్వర స్వామి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా టీడీపీ రైతు నేత గవిని శివరామకృష్ణ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్, టీడీపీ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్ ఆయనను సత్కరించారు. డైరెక్టర్లుగా ఏడుకొండలు, నాగమణి, నాగరాజు, సుధారాణి, వెంకట సుబ్బారావు, సీతామహాలక్ష్మి, బేబీ బాధ్యతలు చేపట్టారు.
CTR: చౌడేపల్లెలోని ప్రసిద్ధ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 21 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 27న స్వామివారి కళ్యాణోత్సవం, 28న రథోత్సవం నిర్వహిస్తారు. రోజూ వాహన సేవలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేశ్ చంద్ర 12వ డివిజన్‌లో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుధ్య పనులను పరిశీలించారు. జీవీపీ పాయింట్ల తొలగింపుకు చర్యలు తీసుకుని, క్లాప్ ఆటోల ద్వారా చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక డ్రైవ్‌తో ప్రాంతాన్ని శుభ్రపరచి మొక్కలు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ ప్రజలకు సూచించారు.
NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టి కోట గ్రామంలో ఇటీవల టీడీపీ కార్యకర్త మహమ్మద్ రఫీ అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతుడు మహమ్మద్ రఫీకి పార్టీలో సభ్యత్వం కార్డు ఉండడంతో అతనికి పార్టీ రూ.లక్ష చెక్కును మంజూరు చేసింది. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇవాళ నాయకుడు రామేశ్వర్ రెడ్డి మృతుని అన్న హాజీకి చెక్కును అందజేశారు.
SKLM: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన భారతీయ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ అని తెలిపారు. 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
PPM: జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 4 ప్రధాన కేంద్రాల పరిధిలో ప్రజలకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందచామని, పార్వతీపురం, పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సాలూరు కేంద్రాల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
NLR: రాపూరు మండలం గుండవోలులో ప్రమాదకరంగా కరెంట్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. విద్యుత్ వైర్లు ఇళ్లకు అతి సమీపంలో ఉన్నందున వాటిని ఇళ్లకు దూరంగా మార్చారు. చెప్పిన వెంటనే చర్యలు తీసుకోవడంతో గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
TPT: గూడూరు పట్టణం బనిగి సాహెబ్ పేటలో సోమవారం గూడూరు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని 10 మోటార్ సైకిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడి ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ తనిఖీల్లో గూడూరు ఒకటో పట్టణ, రెండో పట్టణ సీఐలు పాల్గొన్నారు.
ATP: గుత్తి మండలం నాగసముద్రం క్రాస్ వద్ద సోమవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని జిల్లా కేంద్రానికి తరలించారు. గుత్తి నుంచి అబ్బే దొడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కృష్ణా: జాతీయ రహదారిపై పాల వ్యాన్ ప్రమాదానికి గురైంది. సోమవారం కృష్ణా మిల్క్ యూనియన్ పాల వ్యాన్ చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు రామానగరంలో జాతీయ రహదారి-216పై పల్టీ కొట్టింది. ఉదయం నాగాయలంకలో పాల ప్యాకెట్లు సరఫరా చేసి తిరిగి మచిలీపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
ELR: ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామములో రావి శ్రీలలిత మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇవాళ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాతలు సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని నిర్వహణ కొరకు పాఠశాల సిబ్బందిలో ఒకరిని నియమించాలన్నారు.