• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కార్డన్ అండ్ సెర్చ్ .. 10 బైకులు స్వాధీనం

KDP: చిన్నచౌకు పరిధిలోని వైఎస్సార్ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అనుమానితుల సమాచారాన్ని 112కు ఇవ్వాలని సూచించారు.

April 5, 2026 / 03:13 PM IST

బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

అన్నమయ్య: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని తెలిపారు.

April 5, 2026 / 03:05 PM IST

ముద్దలపురంలో నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం

ATP: కూడేరు మండలం ముద్దలపురం వద్ద 16 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో MP అంబికా లక్ష్మీనారాయణ, MLA దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

April 5, 2026 / 03:00 PM IST

జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు

BPT: బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా వేమూరు నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించారు. వేమూరు మండలం జంపని, వేమూరు గ్రామాలతో పాటు కొల్లూరు మండలంలోని కొల్లూరు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి స్మరించారు.

April 5, 2026 / 03:00 PM IST

బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

E.G: ద్వారకాతిరుమల మండలం మలసానిగుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.

April 5, 2026 / 03:00 PM IST

ఉయ్యూరులో ఈస్టర్ సందర్బంగా మజ్జిగ పంపిణీ

కృష్ణా: రాష్ట్ర ప్రజలందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలను మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉయ్యూరులో పట్టణ వ్యాప్తంగా క్రిస్టియన్స్ యునైటెడ్ ఫెలోషిప్ 8 చోట్ల ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. బైబిల్లో యేసుక్రీస్తు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ఖురాన్‌లో అల్లాహ్ గాని పరులకు సహాయపడుతూ, పదిమందికి మంచి చేయాలని చెప్పి ఉన్నారని అన్నారు.

April 5, 2026 / 03:00 PM IST

తప్పుడు ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు

NLR: తనపై సోషల్ మీడియా గ్రూపుల్లో అసత్య పోస్టులు వేసి ప్రచారం చేస్తున్నారని నెల్లూరుకు చెందిన ఓ ప్రముఖ పత్రిక బ్యూర్ ఇంఛార్జ్ మస్తాన్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. అభ్యంతరకరంగా నిరాధారమైన పోస్టులతో తన ప్రతిష్ఠతకు భంగం కలిగించారని వారిపై చర్యలు తీసుకోవాలని వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 5, 2026 / 03:00 PM IST

బాబు జగ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే నివాళి

NDL: కుల రహిత సమాజం కోసం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఆదివారం నందికొట్కూరులోని ఎంపీడీవో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.

April 5, 2026 / 02:50 PM IST

మామిడితోటలో వ్యక్తి అనుమానాస్పద మృతి

CTR: పాకాల(మం) పులితివారిపల్లెలో ఓ వ్యక్తి మృతి స్థానికంగా కలకలం రేపింది. ఓ మామిడి తోటలో చలమచర్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించి ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాకాల సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 5, 2026 / 02:50 PM IST

రౌడీ షీటర్లకు సీఐ కౌన్సెలింగ్

KNL: ఆదోనిలో రౌడీ షీటర్లపై పోలీసుల కఠిన వైఖరి కొనసాగుతోంది. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదివారం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలు కాపాడటంలో సహకరించాలని, పోలీసుల పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.

April 5, 2026 / 02:48 PM IST

అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితభావం

KDP: ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు.

April 5, 2026 / 02:44 PM IST

పెరుమాలపల్లిలో చెంగారెడ్డి సంస్మరణ సభ

TPT: మాజీ టీటీడీ డిప్యూటీ ఈవో అంచపరెడ్డి చెంగారెడ్డి పెద్దకర్మ కార్యక్రమం పెరుమాలపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొని చెంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

April 5, 2026 / 02:43 PM IST

స్వాతంత్ర యోధుడికి బెల్లంకొండలో నివాళులు

PLD: బెల్లంకొండలో బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కరణ కర్త మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్ రామ్ అని MRPS మండల నేతలు అన్నారు. ఆయన సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు రాణించాలని కోరారు

April 5, 2026 / 02:42 PM IST

సీఎం పర్యటన నేపథ్యంలో జేసీ నివాసంలో కీలక భేటీ

ATP: యాడికి మండలంలో రేపు CM చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసంలో టీడీపీ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై వారు చర్చించారు.

April 5, 2026 / 02:30 PM IST

జై అమరావతి అంటూ నినదించిన ఎమ్మెల్యే

NTR: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. రంగవల్లులతో ప్రాంగణం కళకళలాడగా “జై అమరావతి” నినాదాలు మార్మోగాయి. రాజధాని అభివృద్ధి ప్రజల ఆకాంక్ష అని, సీఎం నాయకత్వంలో వేగంగా ముందుకు సాగుతుందని సౌమ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 02:30 PM IST