గుంటూరు: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న బాలుడిని ట్రాలీ ఆటో బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
SKLM: ఎచ్చెర్లలోని ఉన్న టీటీడీసీ DRDA,SEEDAP సంయుక్తంగా గురువారం ఉపాధి మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ పి. కిరణ్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.18-35 వయస్సు గల నిరుద్యోగులు అర్హులని తెలిపారు. ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NDL: గుంటూరులో శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ CRIF-సేతు బంధన్ పథకం కింద రూ.98 కోట్లతో నిర్మిస్తున్న 4 లేన్ల ROBను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక నేతలు కోరిన అండర్‌పాస్ ప్రతిపాదనపై అంచనాలు సిద్ధం చేస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
NLR: సమాజంలో సైబర్ నేరస్తుల మోసాలు ఎక్కువగా ఉన్నాయని అప్రమత్తంగా వ్యవహరించాలని సీతారామపురం ఎస్ఐ శ్రీనివాసులు సూచించారు. సీతారామపురం అల్లిక వీధిలో బుధవారం సాయంత్రం ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
KKD: రౌతులపూడి SI వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుమ్మరేగులలో బుధవారం రాత్రి “పల్లెనిద్ర” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, గృహహింస వంటి అంశాలపై SI అవగాహన కల్పించారు. మహిళలు సెల్ఫ్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ASR: డుంబ్రిగూడలోని పాడి గ్రామంలో ఇళ్లకు ఆనుకుని తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదానికి దారి తీసే పరిస్థితి నెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ సరైన రక్షణ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ విద్యార్థులు, వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
E.G: ధవళేశ్వరం హత్య కేసులో మైనర్ నిందితుడికి రాజమండ్రి జువెనైల్ బోర్డు 28 నెలల కమ్యూనిటీ సర్వీస్‌తో పాటు రూ.1500 జరిమానా విధించింది. అక్బర్ ఖాన్‌పై కత్తితో దాడి చేయగా, ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడి వయస్సును పరిగణనలోకి తీసుకొని బోర్డు ఈ తీర్పు ఇచ్చింది. ఘటన సమయంలో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
సత్యసాయి: జిల్లాలో ఈ నెల 9 నుంచి 23 వరకు 8వ పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో తల్లి, బిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలు, చిన్నారుల మానసిక వికాసం, జంక్ ఫుడ్ అనర్థాలపై చర్చిస్తారని పేర్కొన్నారు.
KRNL: కోసిగి మండలం ఐరన్గల్ కు చెందిన కరికి శ్రీరాములు, మహాదేవి దంపతుల కుమారుడు కరికి భీమ బుధవారం విడుదలైన SSC CGL-2026 ఫలితాల్లో సత్తాచాటారు. దీంతో ఆయన ఆదాయపు పన్ను శాఖలో ఇన్‌కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యి ఔరా అనిపించారు. భీమ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల శ్రమకు ఈ విజయం అంకితమిస్తునట్లు పేర్కొన్నారు.
KRNL: ఆదోనిలోని తిరుమల నగర్‌లో బాల్యవివాహం జరగబోతోందనే సమాచారం అందడంతో అధికారులు బుధవారం అప్రమత్తమయ్యారు. ఇద్దరు మైనర్లకు పెళ్లి జరుపుతున్నారన్న సమాచారంతో శక్తి టీం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టింది. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం చట్టరీత్యా నేరమని వివరించారు. ఆదేశాలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
KDP: కొండాపురంలోని శాంతినగర్ కాలనీలో జరిగిన ఘర్షణలో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు SI జయరాములు బుధవారం తెలిపారు. SI వివరాల మేరకు.. పాత కక్షలతో శాంతినగర్ కాలనీకి చెందిన రమేష్ మరో ఏడుగురితో కలిసి ఆదే కాలనీకి చెందిన నాగేష్ కుటుంబంపై మంగళవారం రాత్రి దాడి చేశాడు. ఈ ఘటనపై కొండాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
W.G: ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు గురువారం వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు విజయరామరాజు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరిగే ఈ ఆందోళనలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తామని తెలిపారు.
PPM: మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా మహిళా సంఘాల సభ్యులు పొదుపు, అప్పు నిల్వలు వారివారి మొబైల్లలో తెలుసుకోవచ్చని వెలుగు సీసీ పి.రామకృష్ణ రావు సూచించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పాచిపెంట మండలం పణుకువలసలో మహిళా సంఘాల సభ్యులకు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పొదుపులో ఉన్న అమౌంట్‌ను డిపాజిట్ చేసుకోవాలని, అప్పులు సకాలంలో చెల్లించాలని కోరారు.
SKLM: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా జలధార -జల హారతి 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా అధికారులతో మాట్లాడారు. ప్రజలను, నీటి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలన్నారు.
E.G: రాజమండ్రి మహిళా కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి ఎన్. శ్రీలక్ష్మి బుధవారం సందర్శించి ఖైదీల సదుపాయాలను పరిశీలించారు. న్యాయవాదులు లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని, బెయిల్ లేదా అప్పీలు దాఖలుకు సంస్థ సహకరిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఆహార నాణ్యతపై ఆరా తీస్తూ, ఖైదీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.