• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

VZM: గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని నెలివాడలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జనార్దనరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుడి వద్ద నుంచి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

April 10, 2026 / 08:13 AM IST

ఆహార తయారీ పరిశ్రమకు ప్రోత్సాహం

PPM: అమరావతిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో గడ్డం శేఖర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా పార్వతీపురంలో 200 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఈవో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల సేకరణ చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

April 10, 2026 / 08:12 AM IST

‘బాల్యవివాహాలను నిర్మూలించాలి’

AKP: బాల్యవివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయని స్త్రీ శిశు సంక్షేమ మహిళాభివృద్ధి శాఖ పీడీ సూర్యలక్ష్మి అన్నారు. పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గురువారం అనకాపల్లి వైఎంవీఏ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బాల్య వివాహాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. అలాగే, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.

April 10, 2026 / 08:11 AM IST

అధిక మోతాదులో టాబ్లెట్లు మింగి మహిళ మృతి

ఏలూరు రూరల్ మండలం బాలాజీ నగర్‌కు చెందిన సిరిగోలి భవాని (42) గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో అధిక మోతాదులో మానసిక వ్యాధి టాబ్లెట్లను మింగింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా గురువారం రాత్రి మృతి చెందింది. ఆమె కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.

April 10, 2026 / 08:10 AM IST

ఆస్తి పన్నుపై 50% వడ్డీ మాఫీ: కమిషనర్

NDL: నగర పంచాయతీ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నుల చెల్లింపులకు 50 శాతం వడ్డీ మాఫీతో రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ హరిప్రసాద్ గురువారం తెలిపారు. ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ అందిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వెల్లడించారు.

April 10, 2026 / 08:03 AM IST

‘అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది’

W.G: పోడూరు మండలం పెనుమదంలో రూ.4 కోట్ల 49 లక్షలతో పలు 17 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులును ఎదుర్కొంటూ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. మేలుచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

April 10, 2026 / 07:56 AM IST

అకడమిక్ ఆడిట్‌లో డిగ్రీ కళాశాలకు ‘A’ గ్రేడ్

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. రికార్డుల నిర్వహణ, బోధన విధానాల ఆధారంగా కళాశాలకు ‘A’ గ్రేడ్ లభించినట్లు ప్రిన్సిపల్ శశికళ గురువారం వివరించారు. నాక్‌లో మెరుగైన గ్రేడ్ సాధనకు ఇది దోహదపడుతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

April 10, 2026 / 07:54 AM IST

‘అంబేద్కర్ జయంతి శాంతియుతంగా జరుపుకోవాలి’

కోనసీమ: ఏప్రిల్ 14న జరగబోయే అంబేద్కర్ జయంతిని శాంతియుతంగా జరుపుకోవాలని రావులపాలెం సీఐ శేఖర్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావులపాలెంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో గురువారం సాయంత్రం తహసీల్దార్ ముక్తీశ్వరరావు అధ్యక్షతన అంబేద్కర్ జయంతి కమిటీ సభ్యులతో రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించారు. జయంతి సజావుగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. 

April 10, 2026 / 07:51 AM IST

రెండు నెలలకోసారి జిల్లాకు వస్తా: పవన్ కళ్యాణ్

KKD: ప్రతి రెండు నెలలకు ఒక సారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా పరిధిలోని ఏ ఒక్క రోడ్డుపై గుంతలు ఉండకూడదని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు.

April 10, 2026 / 07:45 AM IST

కొవ్వూరు డంపింగ్ యార్డులో మంటలు

E:G: కొవ్వూరులో పాత రైల్వే బ్రిడ్జి సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న డంపింగ్ యార్డులో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెత్తకు తరచూ నిప్పు పెట్టడం వల్లే మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ కార్మికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

April 10, 2026 / 07:42 AM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షల మూల్యాంకనం పూర్తి

సత్యసాయి: జిల్లాలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారంతో పూర్తయ్యిందని డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 1,09,708 పత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదు ప్రక్రియ పగడ్బందీగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మూల్యాంకనం పూర్తయిన అనంతరం, త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

April 10, 2026 / 07:36 AM IST

నగర సుందరీకరణే లక్ష్యం: కేంద్ర మంత్రి

శ్రీకాకుళం నగర సుందరీకరణే లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన గురువారం సాయంత్రం శ్రీకాకుళంలో పర్యటించారు. సీఎం చంద్రబాబు సంకల్పించిన ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ లక్ష్య సాధనలో భాగంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

April 10, 2026 / 07:35 AM IST

వాహన తనిఖీలు.. 227 కేసులు నమోదు

KDP: జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 227 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 49,565ల జరిమానా వసూలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

April 10, 2026 / 07:31 AM IST

సోలార్ ప్యానెల్స్‌ను ప్రారంభించిన మంత్రి

BPT: అద్దంకి మండలం వేలమూరిపాడులో సోలార్ ప్యానెల్స్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. అద్దంకి నియోజకవర్గంలో 6 వేల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల విలువైన యూనిట్లు అందించనున్నారు. రైతులకు కూడా ‘పీఎం కుసుమ్ పథకం’ ద్వారా త్వరలో 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని మంత్రి తెలిపారు. బీసీలకు రూ.98 వేలు, ఓసీలకు రూ.78 వేలు సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు.

April 10, 2026 / 07:30 AM IST

అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన రామకుప్పం కుర్రాడు

CTR: రామకుప్పం (M) వీర్నమలకు చెందిన జ్యోతి-శివలింగం దంపతుల కుమారుడు నవీన్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ టోర్నీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అద్భుత విజయాన్ని సాధించాడు. నేపాల్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో నవీన్ ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. దీంతో పలువురు అతన్ని అభినందించారు.

April 10, 2026 / 07:16 AM IST