• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సచివాలయాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

విశాఖ: అడవివరం పరిధిలోని 523, 524, 528 సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.

April 6, 2026 / 01:22 PM IST

జాతీయ మహిళా హాకీ జట్టు కోచ్‌గా రవికుమార్

అనకాపల్లి: జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల జాతీయస్థాయి హాకీ పోటీలకు కోచ్‌గా ఎలమంచిలికి చెందిన హాకీ ప్లేయర్ ఈపు రవికుమార్ వ్యవహరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ సోమవారం తెలిపారు. ఆయన కడప జిల్లా పులివెందులలో ఖేలో హాకీ కోచ్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రవికుమార్ ఆధ్వర్యంలో మహిళా హాకీ జట్టు సత్తా చాటుతున్నట్లు తెలిపారు.

April 6, 2026 / 01:21 PM IST

గాయపడిన పోలీసులను హోంమంత్రి పరామర్శ

GNTR: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ పరామర్శించారు. మంగళగిరి NRI ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని ఆమె కలిసి ధైర్యం చెప్పారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మెరుగైన చికిత్స అందించాలన్నారు.

April 6, 2026 / 01:19 PM IST

పాడేరులో ‘తలాష్’ స్టేట్ లెవెల్ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

అల్లూరి: పాడేరులోని నన్నయ వర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించే ‘తలాష్’ స్టేట్ లెవెల్ ఫెస్ట్ పోస్టర్‌ను ఇవాళ పడేరులో జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇది అద్భుత వేదికని ఆయన అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ డా.మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 01:18 PM IST

కొత్త కార్యదర్శుల బాధ్యతల స్వీకరణ

BPT: కర్లపాలెం మండలం యాజలి గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిగా జి.అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి బదిలీపై వచ్చిన ఆయన తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవోలను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఏట్రవారిపాలెం గ్రేడ్-2 కార్యదర్శిగా ఎం.చలపతి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముత్తుకూరు మండలం పంటపాలెం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.

April 6, 2026 / 01:17 PM IST

కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌.. అర్జీల స్వీకరణ

PLD: జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వివరించగా, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

April 6, 2026 / 01:12 PM IST

తలుపులు పగలగొట్టి మరీ చోరీ

ప్రకాశం: సంతమాగులూరులో హైస్కూల్ వెనకవైపు ఉన్న కర్ణ నాగిరెడ్డి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న కొద్దిపాటి బంగారన్ని తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. ఇంటియజమాని వైజాగ్‌లో నివాసం ఉంటారని స్థానికులు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉంటుందని, ఎప్పుడో వచ్చి వెళ్తుంటారని అన్నారు.

April 6, 2026 / 01:12 PM IST

‘పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’

అల్లూరి: బీజేపీ సిద్ధాంతాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీఏసీఎస్ డైరెక్టర్ రీమల చంద్రరావు, గిరిజన మోర్చా జిల్లా నేత అరిమెల రాజు కార్యకర్తలకు సూచించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం (మన ఊరు మన జెండా) సందర్భంగా సోమవారం కొయ్యూరు మండలంలోని రత్నంపేట గ్రామంలో బీజేపీ జెండాను ఎగురవేశారు. దేశసేవ, సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బీజేపీని స్థాపించారన్నారు.

April 6, 2026 / 01:12 PM IST

ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

ELR: కొయ్యలగూడెం మండలం సీతంపేటలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా యూవ మోర్చా నాయకులు పెనుమర్తి సురేష్ బాబు, మండల కిసాన్ మోర్చా రామినా రమేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాలం నరేష్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర నిధులు పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే బీజేపీ లక్ష్యం అన్నారు.

April 6, 2026 / 01:10 PM IST

శుభ్రత పనుల నాణ్యతపై కఠిన ఆదేశాలు

కడప నగరపాలక సంస్థ కమిషనర్ చంద్ర ఇవాళ మార్నింగ్ విజిట్‌లో భాగంగా 12వ, 14వ డివిజన్లలో పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ప్రాంతాల్లో జరుగుతున్న శుభ్రత కార్యక్రమాలను సమగ్రంగా పరిశీలించి, పనుల నాణ్యతపై శానిటేషన్ అధికారులు నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణకు ఆదేశించారు.

April 6, 2026 / 01:10 PM IST

అనుమానాస్పదంగా యువకుడి మృతి

విశాఖ: మధురవాడ ఐటీ సెజ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి మృతదేహన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన యువకుడు మణికంఠ (34)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 01:08 PM IST

జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్

ATP: అనంతపురం జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన 15వ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బంగారు పతకాలు, పట్టాలను అందజేశారు. విద్యా రంగంలో జేఎన్టీయూ అందిస్తున్న సేవలను కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

April 6, 2026 / 01:07 PM IST

జాతీయ స్థాయి పోటీలకు కృష్ణగిరి విద్యార్థిని ఎంపిక

KRNL: కృష్ణగిరిలోని KGBV విద్యార్థిని గొల్ల వర్షిత జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. గత నెల గన్నవరంలో జరిగిన అండర్-14 విభాగం నుంచి ఆమె రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచినట్లు ఇవాళ ప్రిన్సిపల్ స్రవంతి తెలిపారు. దీంతో ఈ నెలలో ఒడిశాలో జరిగే జాతీయ పోటీల్లో వర్షిత పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థిని వర్షితని ఉపాధ్యాయులు అభినందించారు.

April 6, 2026 / 01:00 PM IST

వీరభద్రుని సన్నిధిలో నిత్య అన్నప్రసాదం

అన్నమయ్య: రాయచోటిలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వర్గాలు ఇవాళ తెలిపారు. భక్తులందరూ ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ వెల్లడించారు.

April 6, 2026 / 12:56 PM IST

అమరావతిపై వైసీపీ నేత విమర్శలు

PLD: సత్తెనపల్లిలో వైసీపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని పేరుతో ఒక సామాజిక వర్గానికి ఆర్థిక లాభం చేకూర్చే విధంగా 54వేల ఎకరాల భూములు సేకరించారని ఆరోపించారు. చట్ట సవరణ వల్ల ఆమోదం తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.

April 6, 2026 / 12:54 PM IST