• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వేగుళ్ల

కోనసీమ: ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఇటీవల హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 86 మందికి రూ.42.14 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు అయ్యాయి . ఆ చెక్కులను శనివారం మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు అందజేశారు

April 5, 2026 / 08:09 AM IST

ఆరోగ్య సేవల్లో జిల్లాకు 16వ స్థానం

ప్రకాశం: 2026 ఫిబ్రవరిలో PHC పనితీరుకు ప్రభుత్వం ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో జిల్లాకు 16వ స్థానం దక్కింది. జిల్లాలో 39 PHCలు ఉండగా A గ్రేడ్లో 3, B గ్రేడ్లో 22, C గ్రేడ్లో 11, D గ్రేడ్ 3 సాధించాయి. OP, IP సేవలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న PHCల రికార్డుల ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు తెలుస్తోంది.

April 5, 2026 / 08:08 AM IST

పార్లమెంట్‌లో నెల్లూరు యువతి ప్రసంగం

NLR: నెల్లూరుకు చెందిన జేపీ సంజన ఏప్రిల్ 14న పార్లమెంట్‌లో జరిగే అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రసంగించనున్నారు. ‘మై భారత్’ ద్వారా దేశవ్యాప్తంగా ఎంపికైన 12 మందిలో ఈమె ఒకరు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీల్లో సత్తా చాటి ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు.

April 5, 2026 / 08:00 AM IST

నేడు ఒంటిమిట్ట కోదండ రామయ్యకు పుష్పయాగం

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో ఇవాళ రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.

April 5, 2026 / 08:00 AM IST

డెంగ్యూ లక్షణాలపై తప్పనిసరి పరీక్షలు: DMHO

KRNL: డెంగ్యూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని DMHO డా. కామేశ్వర ప్రసాద్ సూచించారు. ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో జరిగిన మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 65 పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎస్ఆర్ఎస్ టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు.

April 5, 2026 / 08:00 AM IST

మార్కెట్‌లో పడిపోతున్న చీనీ ధరలు

ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ ధరలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు రోజులుగా టన్నుపై రూ.1000 చొప్పున ధర క్షీణిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం జరిగిన విక్రయాల్లో టన్ను గరిష్ఠ ధర రూ.21 వేలు పలకగా, కనిష్ఠం రూ.8 వేలకు పడిపోయింది. మార్కెట్ యార్డుకు 990 టన్నుల దిగుమతి వచ్చినట్లు కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు.

April 5, 2026 / 08:00 AM IST

పాలకొల్లులో ఈస్టర్ పండుగ వేడుకలు

W.G: పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం బరియల్ గ్రౌండ్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈస్టర్ పండుగ వేడుకలను క్రైస్తవ సోదరీ సోదరీమణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద దీపాలు వెలిగించి పూలతో ప్రత్యేకంగా అలంకరించి వారి పూర్వీకులకు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

April 5, 2026 / 08:00 AM IST

చింతలపూడి నియోజకవర్గ బడ్జెట్ పై సమావేశం

ELR: చింతలపూడి నియోజవర్గానికి కేటాయించిన బడ్జెట్‌పై స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం నియోజకవర్గంలోని కూటమి నాయకులతో చర్చించారు. ప్రభుత్వం మండలాల వారీగా ఇచ్చిన కేటాయింపులకు అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు రూపొందించుకొని పూర్తిస్థాయిలో సద్వినియోగం జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 08:00 AM IST

ఉయ్యాలవాడలో పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

NDL: ఉయ్యాలవాడ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు శనివారం తెలిపారు. సర్పంచుల పదవీకాలం ఈనెల 2తో ముగియడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్ ప్రసాద్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో నాగలక్ష్మమ్మ, పశువైద్యాధికారి సాయిబాబాలను కలెక్టర్ నియమించినట్టు ఆయన వెల్లడించారు.

April 5, 2026 / 08:00 AM IST

యువకుడిపై 15 మంది దుండగుల దాడి

అన్నమయ్య: మదనపల్లెలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఎస్టేట్ సమీపంలోని దాము వైన్స్‌లో మద్యం తాగేందుకు వెళ్లిన శివసాయి(28) అనే యువకుడిపై సుమారు 15 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. మద్యం షాపు వద్ద జరిగిన చిన్న వివాదం కారణంగా ఆగ్రహించిన దుండగులు బీరు బాటిళ్లతో శివసాయి తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు.

April 5, 2026 / 07:46 AM IST

ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సాయంత్రం 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించి గరుడ పటాన్ని అవతనం చేశారు.బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధి పొందుతారని ఐతిహ్యం. సకల శ్రేయస్సులు కలుగుతాయని విశ్వాసం.

April 5, 2026 / 07:40 AM IST

‘గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించండి’

KRNL: ఈనెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి గ్రామాల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. విలేజ్ అర్బన్ సెంటర్లలో ప్రచారం చేపట్టాలని సూచించారు.

April 5, 2026 / 07:40 AM IST

విశాఖలో ఈరోజు మాసం ధరలు ఎంతంటే..!

VSP: విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చికెన్ ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ లైవ్ రూ.145, స్కిన్తో రూ.260, స్కిన్ లెస్ రూ. 270, శోంఠాం రూ.300లకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1000కు, డజన్ గుడ్లు రూ.55లకు అమ్మకాలు చేపట్టారు. అప్పుఘర్, ఎంవీపీ, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో తాజా చాపల కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు.

April 5, 2026 / 07:37 AM IST

ఘోరం.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

E.G: రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి పెనుముచ్చి మంగరాజు (45) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

April 5, 2026 / 07:33 AM IST

మట్టి దోపిడిని అడ్డుకోవాలని గ్రామస్తుల డిమాండ్

బాపట్ల: పెదగాదెలవర్రులోని చెరువులో అక్రమంగా మట్టి తవ్వి విక్రయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వారం రోజులుగా ట్రక్కుల ద్వారా మట్టి తరలింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఒక్కో లోడు రూ.800 నుంచి 1000 వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల దోపిడి పెరుగుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

April 5, 2026 / 07:31 AM IST