WG: ఇటీవల జరిగిన తెలుగుదేశం మహానాడు తీర్మానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలను ఎప్పుడూ గౌరవించే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు రాష్ట్రంలోని ఉన్న మహిళలు అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
అన్నమయ్య: మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో శనివారం ‘డ్రగ్ డిటెక్షన్’ కిట్లతో అనుమానితులపై తనిఖీలు నిర్వహించగా.. పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 112 లేదా ఈగల్ సెల్ 1972కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ELR: జంగారెడ్డిగూడెం శివారు పెరంపేట రోడ్డులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను యథేచ్ఛగా పారబోస్తున్నారు. దీంతో వెలువడుతున్న తీవ్ర దుర్వాసన వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం అటువైపుగా వెళ్లలేని విధంగా పరిస్థితులు ఉండటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యర్థాలను పారబోస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
BPT: సంతమాగులూరు శాఖా గ్రంధాలయం నందు ఆదివారం 27వ రోజు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం జరిగినది. ఈ మేరకు విద్యుత్ శాఖ లైన్మెన్ ఎస్. హరి గోపాల్ “టీవీ వద్దు-పుస్తకం ముద్దు” అనే కాన్సెప్ట్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల ఆటలు ఆడటం జరిగినది. ఈ కార్యక్రమంలో 17 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
KDP: వీర బ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న ఇళ్లు గత వర్షాకాలంలో కూలిన విషయం తెలిసిందే. అప్పుడు SM ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ వెంటనే స్వామి నివాస గృహాన్ని పునర్నిర్మించాలని కలెక్టరుకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటికి దాదాపు 8 నెలలు అవుతున్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టక పోవటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
SKLM: జి.సిగడాం, రణస్థలం మండలంలో శ్రీ అసిరితల్లి అమ్మవారి ఆలయ పునఃప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ATP: బెంగళూరులో ఐ కంప్లీట్ నాచురల్ సంస్థ నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల బాడీ బిల్డింగ్ పోటీలలో తాడిపత్రికి చెందిన సాయి మూడవ స్థానం సాధించారు. మొత్తం 143 మంది పాల్గొన్న ఈ పోటీలలో సాయి అద్భుత ప్రతిభ కనబరిచారు. సాయి విజయం పట్ల తాడిపత్రి ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మరింత రాణించాలని ఆకాంక్షించారు.
NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ఇషాక్ బాషా సంఘటన స్థలానికి చేరుకొని ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు.
మన్యం: మక్కువ మండలంలోని నగుళ్ళ కొండ అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఆదివారం ఉదయం అటవీశాఖ అధికారులు తెలిపారు. గజరాజుల కదలికలను ట్రాకర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, ఏనుగులకు దగ్గరగా వెళ్లరాదని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
NTR: తిరువూరు మండల ప్రజలకు మహిళా ఎస్సై గౌరేశ్వరి కీలక సూచనలు చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలపై అసభ్య ప్రవర్తన, వేధింపులు, అనుచితంగా తాకడం, భయపెట్టడం వంటి చర్యలు పోక్సో చట్టం కింద తీవ్రమైన నేరాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచి, వారు చెప్పే సమస్యలకు వెంటనే స్పందించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే 112కు కాల్ చేయాలన్నారు.
కడపలోని స్థానిక యువతులు కవిత (బ్యూటిషన్)లక్ష్మి (వెటర్నరీ స్టూడెంట్)తమ సొంత ఖర్చులతో ఆదివారం రోడ్డుపై కొత్తగా వేసిన స్పీడ్ బ్రేకర్‌కు తెల్లని రంగులు వేశారు. రాత్రివేళ వాహనదారులు గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భావించి, ఈ ఉదయం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జీబ్రా లైన్లు వేశారు. వీరి సామాజిక స్పృహను స్థానికులు అభినందిస్తున్నారు.
WG: భీమవరం మార్కెట్ వివరాల ప్రకారం.. కిలో బ్రాయిలర్ చికెన్ ధర ₹260 నుంచి ₹280 వరకు పలుకుతుండగా, లేయర్ (ఫారం) కోడి మాంసం ధర కిలో రూ. 240 నుంచి రూ. 260 కి చేరింది. ఇక ఆదివారం డిమాండ్ ఎక్కువగా ఉండే మటన్ ధర కిలో ఏకంగా రూ.1000గా కొనసాగుతోంది. చేపల విషయానికి వస్తే, వాటి రకాన్ని బట్టి కిలో రూ.150 నుంచి 180 వరకు విక్రయిస్తున్నట్లు స్థానిక వ్యాపార వర్గాలు తెలిపాయి.
అల్లూరి: జలపాతాలు, నదులు, గెడ్డలు, చెరువులు వద్ద విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని జీ.మాడుగుల సీఐ లక్ష్మణరావు సూచించారు. ఆదివారం కొత్తపల్లి జలపాతాన్ని శనివారం ఎస్సై సాయిరామ్ పడాల్‌తో సందర్శించారు. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. జలపాతాల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కోనసీమ: మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా టీడీపీ ద్వారా అన్ని ఎన్నికల్లో మహిళలకు 33 శాతం అవకాశాలు ఇస్తామని పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ ఇటీవల ప్రకటించడం పట్ల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించారన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
GNTR: తెనాలిలో అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారంటూ ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. ఇంటి నుంచి వెళ్లగొట్టారని, ముఖ్య పత్రాలు తీసుకురావడానికి వెళ్లినప్పుడు తనపై దాడికి యత్నించారని ఆరోపించింది. ప్రాణహాని ఉందని, పోలీసు రక్షణ కల్పించి కట్న వేధింపులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరింది.