ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని పాపా కాలనీలో షేక్ రహీం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో మనస్పర్దాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
KRNL: ప్రజలు ఆధ్యాత్మిక భావనను అలవర్చుకుని భగవంతుని అనుగ్రహం పొందాలని MP బస్తిపాటి నాగరాజు సూచించారు. ఇవాళ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కర్నూలు సిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కోల్స్ చర్చి ఆవరణంలో నిర్వహించిన “రన్ ఫర్ జీసస్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మికత మనసుకు శాంతి, సమాజానికి ఐక్యతను అందిస్తుందన్నారు.
GNTR: తెనాలి నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు CMRF చెక్కులను శనివారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదలకు వీటిని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనను కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు.
KDP: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా వైసీపీ నాయకులు శనివారం పులివెందులలో ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయనకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరమని అన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ELR: పెదపాడు మండలం కలపర్రులోనీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వైసీపీ నేతలు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైన టీటీడీ ప్రతిష్టను మసకబారుస్తూ, అశ్లీల ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న టీటీడీ బోర్డు ఛైర్మెన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
PLD: అచ్చంపేట (మం) కోగంటివారిపాలెం కృష్ణా నదిలో ప్రయాణం చేసే పడవ ఎలాంటి సేఫ్టీలు లేకుండానే ఓవర్ లోడ్‌తో ప్రయాణం చేస్తుందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధంగా ఈ పడవ ప్రయాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఒక్కో పాసింజర్‌కు రూ. 50 చోప్పున పరిమితికి మించి పడవలో ప్రయాణం చేస్తున్నారన్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
PPM: వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు 54 మంది ఛైర్మన్లుగా చేసినప్పటికీ, ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ఆమె పేర్కొన్నారు.
SKLM: నరసన్నపేటలో జోగారావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులను ఇవాళ మాజీ కేంద్ర మంత్రి డా. కిల్లి కృపారాణి దంపతులు, వైసీనీ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ELR: రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ కొరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 60 లక్షల విలువైన ఆరు వాహనాలను పోలీసు వ్యవస్థకు అంకితం చేశారు. వాటినీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 2022 ఏప్రిల్ 4న పాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాను విభజించి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ప్రాధాన్యం గల ఈ జిల్లాలో శ్రీశైలం, మహానంది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
ASR: కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో ప్రతి శుక్రవారం జరిగే వారపు సంతకు సంబంధించి ఈనెల 8న వేలంపాట నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ అభివృద్ధి అధికారిణి రేష్మ ఇవాళ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.5వేల ధరావత్తు చెల్లించాలన్నారు. వేలంపాట కాలపరిమితి 2027 మార్చి 31వ తేదీవరకు ఉంటున్నారు. బుధవారం ఉదయం 11గంటల నుంచి పంచాయతీ కార్యాలయంలో వేలంపాట నిర్వహిస్తామన్నారు.
TPT: ప్రోటోకాల్ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు, దానిని ఎవరూ తస్కరించకూడదని, విస్మరించకూడదని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం నిర్ణయంతో ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను, పార్టీకి, కార్యకర్తలకు న్యాయం చేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
W.G: రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార గ్రహీత చిలుకూరి సూర్యప్రసాద్‌ను జిల్లా డ్వామా పీడీ డాక్టర్ అప్పారావు అభినందించారు. యలమంచిలిలోని సూర్య ప్రసాద్ స్వగృహానికి శనివారం వెళ్ళిన పీడీ శాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు సాధించాలని ఆకాంక్షించారు.
VZM: కొత్తవలస కూడలిలో అన్న క్యాంటీన్ పనులు పూర్తి అయిన ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఇక్కడ ప్రారంభానికి ఇంకా ఖరారు చేయకపోవడంతో పేదలు ఆకలితో ఎదురుచూస్తున్నారు. నాయకులు స్పందించి ప్రారంభానికి నడుం కట్టాలని కోరుతున్నారు.
CTR: టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి BR నాయుడుని వెంటనే తొలగించాలని చిత్తూరు మాజీ MP రెడ్డప్ప డిమాండ్ చేశారు. శనివారం పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు. శ్రీవారి ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్ పాల్గొన్నారు.