• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిగూడెంలో వైసీపీ నేతలతో జగన్ సమీక్ష

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కో ఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అత్యధిక స్థానాలు సాధించాలని పిలుపు నిచ్చారు.

April 8, 2026 / 07:24 PM IST

కలెక్టర్‌ను కలిసిన APUWJ నాయకులు

CTR: కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు రెండవ విడత అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, మీడియాపై దాడుల నివారణపై కాసేపు చర్చించారు.

April 8, 2026 / 07:20 PM IST

వెలవెలబోయిన వారపు సంత

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ప్రతి బుధవారం జరిగే వారపు సంత ఈసారి వెలవెలబోయింది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దగా రాకపోవడంతో వ్యాపారం మందగించింది. ఎండలు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

April 8, 2026 / 07:15 PM IST

‘సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం’

AKP: నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రతివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ తెలిపారు. ఎలమంచిలిలో బుధవారం నిర్వహించిన జనవాణిలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.‌ వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే అర్జీ దారులతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

April 8, 2026 / 07:13 PM IST

ఉచిత పాలిసెట్ కోచింగ్ ప్రారంభం

VZM: సీతం కళాశాలలో ఉచిత పాలిసెట్ (POLYCET) కోచింగ్ తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక విలువైన అవకాశమని డైరెక్టర్ డా మజ్జి శశి భూషణరావు తెలిపారు. పరీక్షలో విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించేందుకు అవసరమైన సమగ్ర శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

April 8, 2026 / 07:12 PM IST

బూత్ లెవల్ అధికారులకు సహకరించాలి: కమిషనర్

NLR: నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సాగుతోందని కమిషనర్ వైఓ.నందన్ తెలిపారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటి సర్వేకు వచ్చే బూత్ లెవల్ అధికారులకు పూర్తి సమాచారం అందించి సహకరించాలని కోరారు.

April 8, 2026 / 07:06 PM IST

విద్యుత్ తీగల దొంగకు మూడేళ్ల జైలు శిక్ష

అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు దొంగిలించిన రాఘవేంద్రకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. 2024లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, 33 విద్యుత్ దొంగతనాల కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

April 8, 2026 / 07:02 PM IST

మూల్యాంకనం పకడ్బందీగా జరగాలి: కలెక్టర్

ATP: పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని కేఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూల్యాంకన ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూల్యాంకన విధానం, రోజువారీ సబ్జెక్టుల కేటాయింపు వంటి వివరాలను ఆరా తీశారు.

April 8, 2026 / 07:02 PM IST

‘మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలి’

PLD: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా బుధవారం ఆదేశించారు. ఈ నిర్మాణ పనుల పురోగతిపై ఆమె అధికారులతో సమీక్షించారు. నాణ్యత పాటిస్తూ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. త్వరలోనే పిడుగురాళ్ల బోధనాసుపత్రి ఓపీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

April 8, 2026 / 07:00 PM IST

ఎన్టీఆర్ కాలనీ వాసులందరికీ ఒకే వార్డుగా బూత్ ఏర్పాటుకు వినతి

NTR: విస్సన్నపేట ఎన్టీఆర్ కాలనీ వాసులందరికీ 18వ వార్డు నందు ఒకే బూతుగా ఓటర్ లిస్టు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో చిన్నరాట్నాలకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. గతంలో ఆ కాలనీవాసులు వివిధ వార్డులలో ఓట్లు ఉన్నాయని, అందువల్ల కాలనీని అభివృద్ధి చేసుకోలేకపోతున్నామన్నారు. కావున సమస్యను పరిష్కరించాలని ఆయనను కోరారు.

April 8, 2026 / 07:00 PM IST

వేమూరులో నీటి కొరతపై అధికారులకు ఫిర్యాదు

BPT: వేమూరులోని అంబేద్కర్ నగర్ కాలనీలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అగస్టిన్ తెలిపారు. బుధవారం జరిగిన PGRSలో జేసీకి ఫిర్యాదు చేశారు. 250 కుటుంబాలకు కేవలం 1-2 ట్యాపుల ద్వారా మాత్రమే నీరు వస్తోందని చెప్పారు. వెంటనే సమస్య పరిష్కరించి తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు.

April 8, 2026 / 07:00 PM IST

టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కార్మికుల నిరసన

ప్రకాశం: టంగుటూరు సమీపంలోని టోల్ ప్లాజా ప్రాంగణంలో ఉన్న ఆఫీస్ ముందు కార్మికులు బుధవారం నిరసనకు దిగారు. టోల్ ప్లాజా మేనేజర్ కిరణకు కార్మికులు మధ్య వీధుల విషయంలో మంగళవారం చిన్న వివాదం తలెత్తింది. దీంతో బుధవారం మేనేజర్ కిరణ్ కక్షతో అక్రమంగా ముగ్గురిని విధుల నుంచి తొలగించారని, వారిని తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు.

April 8, 2026 / 07:00 PM IST

‘కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతం’

GNTR: కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలో ‘మై టీడీపీ యాప్’ టాప్-10 పెర్ఫార్మర్స్‌తో ఆయన భేటీ అయ్యారు. ఉత్తమ కార్యకర్తలను సత్కరించి ఎన్టీఆర్ జ్ఞాపికను బహూకరించారు. మీ పనితీరు వల్లే ఇక్కడి వరకు రాగలిగారని అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు.

April 8, 2026 / 07:00 PM IST

మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ

NLR: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.

April 8, 2026 / 06:50 PM IST

గ్రంథాలయం అకస్మికంగా తనిఖీ

ATP: గుత్తిలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఏపీ గ్రంథాలయ పరిషత్తు సభ్యురాలు పద్మజ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయానికి వస్తున్న పాఠకులపై ఆరా తీశారు. గ్రంథాలయంలో అందుతున్న సదుపాయాలను పాఠకులను అడిగి తెలసుకున్నారు. పాఠకులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని స్థానిక గ్రంథాలయ అధికారి రామాంజనేయులును ఆదేశించారు.

April 8, 2026 / 06:45 PM IST