• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సునీత ప్రత్యేక పూజలు

ATP: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జ్ఞానప్రసూనాంబికా దేవి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహు-కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

April 11, 2026 / 07:11 AM IST

ఎన్‌సీసీ పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి పట్టణంలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులకు సీ-సర్టిఫికెట్ పరీక్షల శిక్షణ కోసం ఎస్ఎల్ఆర్ డమ్మీ గన్లు, యూనిఫామ్స్ అందజేశారు. కూటమి నాయకులతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై ఎమ్మెల్యే చర్చించారు.

April 11, 2026 / 07:10 AM IST

గుంటూరు: నేడు భారీ ఊరేగింపు

గుంటూరు: శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వార్ల ఊరేగింపు నేడు జరగనుంది. ఉత్సవ విగ్రహాలతో శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు అరండల్‌పేటలో ఆలయ కమిటీ సభ్యులు భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నారు. దేవాలయం నుంచి నిడుముక్కల వరకు ప్రదర్శన ఉండగా, గోశాల నూతన భవనం ప్రారంభోత్సవంలో భక్తులు పాల్గొనాలని కోరారు.

April 11, 2026 / 07:01 AM IST

‘సత్పలితాలిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు’

VZM: రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లీనికిలు సత్ఫలితాలను ఇస్తున్నాయని బొండపల్లి MRO రాజేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మండలంలో 29 వినతులు వచ్చాయని,వీటిలో ఇంకా 4 సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు రెవెన్యూ సమస్యలపై స్థానిక MRO కార్యాలయంలో వినతులు అన్ని రోజుల్లో ఇవ్వవచ్చన్నారు.

April 11, 2026 / 07:00 AM IST

‘విద్యార్థులు 9:30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి’

సత్యసాయి: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని జిల్లా కన్వీనర్ జమున బాయి తెలిపారు. విద్యార్థులు ఉదయం 9:30 గంటలకే హాల్‌టికెట్, ఆధార్ కార్డుతో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

April 11, 2026 / 06:49 AM IST

‘ప్రభుత్వ పాఠశాలలోనే చదివించండి’

ప్రకాశం: సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 11, 2026 / 06:47 AM IST

దొంగతనం కేసు ఛేదించిన సీఐకు పురస్కారం

NDL: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దొంగతనం కేసును ఛేదించిన ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణకు ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రతిభా పురస్కారం శుక్రవారం అందజేశారు. నిందితులను గుర్తించి స్వామివారి నగలను రికవరీ చేయడంపై ప్రశంసించారు. కేసులో కృషిచేసిన పోలీస్ సిబ్బందిని కూడా అభినందించి అవార్డులు ప్రదానం చేశారు.

April 11, 2026 / 06:45 AM IST

గన్నవరం విమానాశ్రయాన్ని బైపాస్‌కు నేరుగా అనుసంధానం

కృష్ణా: విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు గన్నవరం విమానాశ్రయాన్ని బైపాస్‌కు నేరుగా అనుసంధానం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం చినఅవుటపల్లి, గొల్లపూడి మార్గాలే ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెదురుపావులూరు–కేసరపల్లి మార్గాన్ని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తే 20 నిమిషాల్లో చేరుకోవచ్చని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.

April 11, 2026 / 06:45 AM IST

కేజీబీవీ ప్రవేశాల గడువు పొడిగింపు

ATP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 7 నుంచి 10, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

April 11, 2026 / 06:44 AM IST

గుంటూరు జిల్లా ఎస్‌బీ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్

గుంటూరు జిల్లా ఎస్‌బీ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు డీఎస్పీలకు పోస్టింగులు కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. బదిలీలు, కొత్త పోస్టింగ్‌లలో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

April 11, 2026 / 06:41 AM IST

గరివిడిలో నేడు విద్యుత్ అంతరాయం

VZM: గరివిడి మండల పరిధిలో 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ పరిధిలో కందిపేట ఫీడర్‌ నిర్వహణ పనుల నిమిత్తతం శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదని EE త్రినాథ్‌రావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు కందిపేట, కేఎల్‌ పురం, ఏనుగువలస, బాగువలస గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

April 11, 2026 / 06:34 AM IST

వృద్ధుడిపై దాడి చేసిన వ్యక్తికి రిమాండ్

WG: నరసాపురంలో వృద్ధుడిపై దాడికి పాల్పడిన బావిశెట్టి జ్యోతి బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న సైకిల్‌పై వెళ్తున్న పళ్ల సూర్యనారాయణను అడ్డుకున్న నిందితుడు, కూల్ డ్రింక్ బాటిల్తో దాడికి యత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో టౌన్ ఎస్సై ముత్యాలరావు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి నిందితుడికి రిమాండ్ విధించారు.

April 11, 2026 / 06:33 AM IST

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిద్రించిన కలెక్టర్.

ప్రకాశం: దర్శి మండలం పోతవరంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిద్రించారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామంలో సాయంత్రం నుంచి గ్రామస్తుల సమస్యలను విన్నారు. కలెక్టర్‌గా కాకుండా వారిలో ఒకరుగా కలిసిపోయి గ్రామ సమస్యలతో పాటు గ్రామస్తుల వ్యక్తిగత సమస్యలను విన్నారు. న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

April 11, 2026 / 06:33 AM IST

‘జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలి’

PLD: జాతీయ రహదారి 167AG పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కాంట్రాక్టరుకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిని పరిశీలించారు. పిడుగురాళ్ల – సత్తెనపల్లి – పేరేచర్ల రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

April 11, 2026 / 06:29 AM IST

ఉత్తరంలో బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమం

VSP: ఉత్తర నియోజకవర్గంలో అసెంబ్లీ బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవీణ, రాము, నజీర్, ఉషా కిరణ్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

April 11, 2026 / 06:26 AM IST