• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మందుల కాల్చివేతపై స్పందించిన అధికారులు

KRNL: పెద్దకడబూరు PHCలో మందుల కాల్చివేతపై అధికారులు స్పందించారు. ఆదోని డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి ఇవాళ స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. మందుల కాల్చివేత ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆసుపత్రిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

April 10, 2026 / 03:14 PM IST

పాలమంగళంలో చలివేంద్రం ఏర్పాటు

TPT: నారాయణవనం మండలంలో ఎండలు పెరిగాయి. ఈనేపథ్యంలో పాలమంగళం దక్షిణ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ అభివృద్ధి అధికారి ఆనంద్ కోరారు.

April 10, 2026 / 03:08 PM IST

ప్రజలను తెలిపిన సమస్యను పరిష్కరిస్తాం: ఛైర్ పర్సన్

NLR: బుచ్చి పట్టణం ఖాజా నగర్ 7 వార్డులో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి పర్యటించారు. ధ్వంసమైన డ్రైనేజీ, అమృత్ 2.0 పథకం కింద పైప్ లైన్ ఏర్పాటుకు రోడ్లను గుంతల మయం చేసి పూడ్చలేదని ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

April 10, 2026 / 03:07 PM IST

ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డ్: కమిషనర్

W.G: జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లలో తణుకు మున్సిపాలిటీ 81 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. మొత్తం రూ.16.46 కోట్లకు గాను రూ.13.34 కోట్లు వసూలయ్యాయని, పాలకొల్లు రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

April 10, 2026 / 02:52 PM IST

స్మశాన వాటికను పరిశీలించిన కమిషనర్

KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ ఫోన్- ఇన్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. 6వ డివిజన్‌లోని స్మశాన వాటికను పరిశీలించారు. రోడ్డుపైనే అంత్యక్రియల ముందు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు గుర్తించి, స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఇకపై స్మశాన వాటిక లోపలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

April 10, 2026 / 02:47 PM IST

యంగన్నపల్లిలో ఉపాధి హామీ పనుల తనిఖీ

ATP: గుత్తి మండలం యంగన్నపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను ఇవాళ ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ తనిఖీ చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఫేస్ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ యాప్ ద్వారా గ్రామాల్లో ఉపాధి హామీ పనులలో అవినీతిని అరికట్టవచ్చన్నారు.

April 10, 2026 / 02:40 PM IST

శ్రీకాళహస్తి గుడి ఉద్యోగిపై ఛైర్మన్ ఆగ్రహం

TPT: శ్రీకాళహస్తి గుడికి అనుబంధంగా ఉన్న కైలాస సదన్, గంగా సదన్ వసతి గృహాలను ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గురువారం సందర్శించారు. భక్తులకు అందుతున్న సేవలు, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

April 10, 2026 / 02:40 PM IST

చిలువూరులో డ్రైన్ వాల్ పనులకు శ్రీకారం

GNTR: మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రి లోకేష్ చొరవతో దుగ్గిరాల మండలం చిలువూరు–తుమ్మపూడి గ్రామాల మధ్య డ్రైన్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రూ.1.20 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి నిధుల ద్వారా మంజూరయ్యాయని నేతలు తెలిపారు.

April 10, 2026 / 02:37 PM IST

సూళ్లూరుపేట పోలీసులకు వైసీపీ నాయకుల ఫిర్యాదు

TPT: ఓ పత్రికాధినేత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సూళ్లూరుపేట పోలీసులకు వైసీపీ నాయకులు ఫిర్యా దు చేశారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పించలని డిమాండ్ చేశారు. జర్నలిజం పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్సై అజయ్ కుమార్‌ను కోరారు.

April 10, 2026 / 02:36 PM IST

ఆగస్టు నాటికి స్టేడియం పనులు పూర్తి: కేంద్ర మంత్రి

SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ పరిశీలించారు. కోడిరామ్మూర్తి స్టేడియం పనులను సమీక్షిస్తూ.. స్టేడియం సివిల్ పనులను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రూ.2.6 కోట్లతో ఆధునిక క్రీడా పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేసామన్నారు.

April 10, 2026 / 02:34 PM IST

జాతరకు అదనపు బస్సుల ఏర్పాటు కోసం వినతి

KRNL: గూడూరు పట్టణంలో ఈనెల 13న జరిగే శ్రీ తిమ్మగురుడు స్వామి జాతర నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సు సర్వీసులు నడపాలని APSRTC కర్నూలు రీజనల్ మేనేజర్‌కు, గూడూరు పట్టణ అధ్యక్షులు కె. రామాంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్ ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ఉన్న సర్వీసులకు అదనంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.

April 10, 2026 / 02:33 PM IST

ఏబీఎన్ రాధాకృష్ణపై అమలాపురం పోలీసులకు ఫిర్యాదు

కోనసీమ: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం వైసీపీ ఇంఛార్జి పినిపే శ్రీకాంత్ నేతృత్వంలో పట్టణ పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేసి, చట్టపరంగా శిక్షించాలని కోరారు.

April 10, 2026 / 02:30 PM IST

జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

PLD: మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు బుల్ల రాజారావు పిలుపు మేరకు శుక్రవారం క్రోసూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర హానర్బల్ ఛైర్మన్ సేవరత్న గార్లపాటి దాసు జ్యోతిరావు పూలే గురించి మాట్లాడారు.

April 10, 2026 / 02:28 PM IST

బిగ్ బాస్ విజేత కళ్యాణ్‌కు సత్కారం

VSP: బిగ్ బాస్ సీజన్-9 విజేత కళ్యాణ్ పడాల ఇవాళ నగరంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు నివాసంలో కళ్యాణ్‌ను ఘనంగా సత్కరించి, శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపుకు ప్రజల ఆదరాభిమానాలే కారణమని కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

April 10, 2026 / 02:25 PM IST

సర్వసిద్ధి రమణ మాస్టారు విగ్రహ ఆవిష్కరణ

VZM: బొబ్బిలి, గొల్లపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ సర్వసిద్ధి రమణ మాస్టారు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) ఇవాళ బొబ్బిలిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రమణ మాస్టారు ఒక గొప్ప సామాజిక కార్యకర్తగా గొల్లపల్లి గ్రామానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.

April 10, 2026 / 02:21 PM IST