• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్‌లో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నిర్వహించిన నవగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

April 26, 2026 / 04:49 PM IST

మైనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కమిషనర్

కర్నూలు నగర శివార్లలోని గార్గేయపురం డంప్‌యార్డులో కొనసాగుతున్న బయోమైనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదివారం మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. పనులు ముగిసిన వెంటనే ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నగర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు.

April 26, 2026 / 04:46 PM IST

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

W.G: నరసాపురం పట్టణంలోని వై ఎన్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన గవర్నింగ్ బాడీ ఎన్నికల్లో ఆదివారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకున్నారు. విద్యాసంస్థల అభివృద్ధికి గవర్నింగ్ బాడీ ఎన్నికలు ఎంతో కీలకమని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి నాయకత్వం ఎంపిక కావడం ద్వారా కళాశాల మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.

April 26, 2026 / 04:43 PM IST

వైవీయూ అధికారులపై AIBSU ఆందోళన

KDP: ఎడ్సెట్-27 పరీక్షలు,కౌన్సెలింగ్ జరగకముందే BED కాలేజీలు అక్రమ అడ్మిషన్లు చేస్తున్నాయని AIBSU AP అధ్యక్షుడు జగన్ రాథోడ్ ఆరోపించారు.YVU అధికారుల అవినీతికి నిరసనగా ఆదివారం కడపలోని వేమన విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ఆందోళన చేపట్టారు. అధికారుల అండతో ఇతర రాష్ట్రాల వారికి రూ.70 వేల నుంచి లక్షకు సీట్లు అమ్ముకుంటూ జిల్లా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు.

April 26, 2026 / 04:40 PM IST

ఆర్టీసీ బస్టాండ్‌లో వ్యాపారిపై దాడి

KRNL: మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్లో వ్యాపారిపై దాడి జరిగింది. టెండర్ ద్వారా షాప్ నిర్వహిస్తున్న పూర్ణచంద్ర వద్దకు రవి అనే వ్యక్తి చేరుకుని, షాప్ తెరవవద్దని బెదిరించినట్లు పూర్ణ చంద్ర తెలిపారు. అనంతరం తనపై దాడి చేసి, షాప్‌లోని వస్తువులను ధ్వంసం చేసి తాళం వేసి వెళ్లిపోయినట్లు బాధితుడు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

April 26, 2026 / 04:37 PM IST

జనగణన–2027 అవగాహనకు 5కే రన్

GNTR: మంగళగిరిలో జనగణన–2027పై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. మంగళగిరిలోని లోన్ హలో ఇడ్లీ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు రన్ జరిగింది. కమిషనర్ అలీమ్ బాషా మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి జనగణన కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

April 26, 2026 / 04:33 PM IST

వేలంలో అనంతపురం క్రికెటర్‌కు భారీ ధర

ATP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్ 5 వేలంలో అనంతపురం క్రికెటర్ గిరినాథ్ రెడ్డి భారీ ధరకు అమ్ముడయ్యారు. గిరినాథ్ రెడ్డిని సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు 8 లక్షల రూపాయలకు దక్కించుకుంది. అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరినాథ్ రెడ్డి ఏపీఎల్ వేలంలో మంచి ధర పలకడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 26, 2026 / 04:32 PM IST

ఇందిరానగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు

VSP: జీవీఎంసీ 48వ వార్డు ఇందిరానగర్-4లో దొంగతనాల నివారణకు ప్రజలు, దాతల సహకారంతో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ వాటిని ప్రారంభించి, నేరాల నియంత్రణకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. వార్డు అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

April 26, 2026 / 04:24 PM IST

భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల క్షేత్రం

NDL: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. క్యూ లైన్లోని భక్తులకు సిబ్బంది అల్పాహారం అందించారు.

April 26, 2026 / 04:23 PM IST

జనగణనపై అధికారులతో స్థానికుల 5కే రన్

NLR: కందుకూరు పట్టణంలో ఆదివారం జనగణనపై అవగాహన కోసం 5కే రన్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ హిమవంశీ, అధికారులు పాల్గొని ప్రజలకు జనగణనపై అవగాహన కల్పించారు. మే 1 నుంచి గృహ గణన ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ గణనకు అవకాశం ఉందన్నారు. ప్రజలు పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి సహకరించాలని అధికారులు కోరారు.

April 26, 2026 / 04:21 PM IST

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి JC

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ఆదివారం ఉదయం 5 గంటల నుంచే కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు వంటి ప్రాంతాలను పర్యటించి, శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ్య కార్మికులకు కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించి, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు.

April 26, 2026 / 04:15 PM IST

గుబ్బల మంగమ్మ భక్తులకి ముఖ్య గమనిక

ELR: శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సందర్శించే భక్తులను అటవీ పర్యావరణాన్ని పరిరక్షించమని కోరుతూ, తెలంగాణ, ఏపీ అటవీ శాఖ ఒక ప్రకటన జారీ చేశారు. అడవి అంటే కేవలం చెట్లు మాత్రమే కాదు, అది 220కి పైగా పక్షి జాతులకు, 40 విభిన్న వన్యప్రాణుల జాతులకు, లెక్కలేనన్ని చిన్న జీవులకు నిలయం అన్నారు. సందర్శకులు అడవిలోకి ప్లాస్టిక్ తీసుకురావడం, చెత్త పాడవేయడం వద్దన్నారు.

April 26, 2026 / 04:14 PM IST

ఎండలతో నిమ్మకాయ ధరలకు రెక్కలు

NDL: వేసవి ఎండలు తీవ్రంగా పెరగడంతో నిమ్మకాయ ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఒక్క నిమ్మకాయ రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. పంట దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగాయని ఆదివారం వ్యాపారులు తెలిపారు. అయితే అధిక ధరలతో కొనుగోళ్లు తగ్గిపోవడంతో అమ్మకాలు లేక నిమ్మకాయలు ఎండిపోతూ.. నష్టాలు వస్తున్నాయని చిరు వ్యాపారులు వాపోతున్నారు.

April 26, 2026 / 04:10 PM IST

ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల స్కేటింగ్

KRNL: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సెన్సస్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5కే రన్‌లో విద్యార్థుల స్కేటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు వేగంగా స్కేటింగ్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించగా, పాల్గొన్న వారిని ఆకట్టుకున్నారు. సెన్సస్ ప్రాముఖ్యతపై నినాదాలు చేస్తూ ముందుకు సాగిన విద్యార్థులను అధికారులు అభినందించారు.

April 26, 2026 / 04:09 PM IST

రమ్య ఇన్‌‌స్టిట్యూట్ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి ర్యాంక్

PLD: నరసరావుపేట రమ్య టైపు ఇన్‌‌స్టిట్యూట్ విద్యార్థిని షేక్ ఫాతిమా రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది. SBTET ఫిబ్రవరి 2026 టైప్‌రైటింగ్ తెలుగు హయ్యర్ గ్రేడ్ పరీక్షల్లో ఆమె 3వ ర్యాంక్ పొందింది. గుంటూరులో జరిగిన సత్కార కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉషారాణి, HOD శంకరరావు మెడల్ ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మహబూబ్ సుభాని పాల్గొన్నారు.

April 26, 2026 / 04:08 PM IST