ATP: పుట్లూరు మండలం పి. చింతలపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో డ్రిప్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. రామశేఖర్ రెడ్డి అనే రైతు మొక్కజొన్న సాగు కోసం వినియోగించిన పైపులను వేప చెట్టు వద్ద భద్రపరుచుకున్నారు. దుండగులు నిప్పు పెట్టడంతో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న బాలుడిని ట్రాలీ ఆటో బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
SKLM: ఎచ్చెర్లలోని ఉన్న టీటీడీసీ DRDA,SEEDAP సంయుక్తంగా గురువారం ఉపాధి మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ పి. కిరణ్ కుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.18-35 వయస్సు గల నిరుద్యోగులు అర్హులని తెలిపారు. ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: గోపాలపురం గ్రామ దేవత గోకులాంబ అమ్మవారి శతాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, అనపర్తి టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఆకుల రామకృష్ణలతో బుధవారం రాత్రి కలిసి పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. MLA మాట్లాడుతూ..గోపాలపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
NDL: గుంటూరులో శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ CRIF-సేతు బంధన్ పథకం కింద రూ.98 కోట్లతో నిర్మిస్తున్న 4 లేన్ల ROBను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక నేతలు కోరిన అండర్‌పాస్ ప్రతిపాదనపై అంచనాలు సిద్ధం చేస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
W.G: వీరవాసరం(M)లోని ఎం. ఆర్.కె జెడ్పి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకనం నిర్వహణ తీరుపై సమగ్రంగా పరిశీలించి, ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడి వారికి కల్పించిన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. మూల్యాంకన కేంద్రంలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు.
NLR: సమాజంలో సైబర్ నేరస్తుల మోసాలు ఎక్కువగా ఉన్నాయని అప్రమత్తంగా వ్యవహరించాలని సీతారామపురం ఎస్ఐ శ్రీనివాసులు సూచించారు. సీతారామపురం అల్లిక వీధిలో బుధవారం సాయంత్రం ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
KKD: రౌతులపూడి SI వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గుమ్మరేగులలో బుధవారం రాత్రి “పల్లెనిద్ర” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, గృహహింస వంటి అంశాలపై SI అవగాహన కల్పించారు. మహిళలు సెల్ఫ్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ASR: డుంబ్రిగూడలోని పాడి గ్రామంలో ఇళ్లకు ఆనుకుని తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదానికి దారి తీసే పరిస్థితి నెలకొంది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ సరైన రక్షణ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ విద్యార్థులు, వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
E.G: ధవళేశ్వరం హత్య కేసులో మైనర్ నిందితుడికి రాజమండ్రి జువెనైల్ బోర్డు 28 నెలల కమ్యూనిటీ సర్వీస్‌తో పాటు రూ.1500 జరిమానా విధించింది. అక్బర్ ఖాన్‌పై కత్తితో దాడి చేయగా, ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడి వయస్సును పరిగణనలోకి తీసుకొని బోర్డు ఈ తీర్పు ఇచ్చింది. ఘటన సమయంలో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
సత్యసాయి: జిల్లాలో ఈ నెల 9 నుంచి 23 వరకు 8వ పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో తల్లి, బిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార విలువలు, చిన్నారుల మానసిక వికాసం, జంక్ ఫుడ్ అనర్థాలపై చర్చిస్తారని పేర్కొన్నారు.
KRNL: కోసిగి మండలం ఐరన్గల్ కు చెందిన కరికి శ్రీరాములు, మహాదేవి దంపతుల కుమారుడు కరికి భీమ బుధవారం విడుదలైన SSC CGL-2026 ఫలితాల్లో సత్తాచాటారు. దీంతో ఆయన ఆదాయపు పన్ను శాఖలో ఇన్కమ్ ట్యాక్స్ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యి ఔరా అనిపించారు. భీమ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల శ్రమకు ఈ విజయం అంకితమిస్తునట్లు పేర్కొన్నారు.
PPM: సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను ట్రాన్స్పోర్ట్ పోలీస్, R&B అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. మామిడిపల్లి జంక్షన్, గాంధీజీ జంక్షన్, బైపాస్ రోడ్డు కూడలిలో తనిఖీలు చేపట్టారు. స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక అనే బోర్డులు ఏర్పాటు చెయ్యడం, రోడ్డు పక్కన ఉన్న పొదలు తొలగించాలని నిర్ణయించారు.
KRNL: ఆదోనిలోని తిరుమల నగర్లో బాల్యవివాహం జరగబోతోందనే సమాచారం అందడంతో అధికారులు బుధవారం అప్రమత్తమయ్యారు. ఇద్దరు మైనర్లకు పెళ్లి జరుపుతున్నారన్న సమాచారంతో శక్తి టీం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టింది. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం చట్టరీత్యా నేరమని వివరించారు. ఆదేశాలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
KDP: కొండాపురంలోని శాంతినగర్ కాలనీలో జరిగిన ఘర్షణలో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు SI జయరాములు బుధవారం తెలిపారు. SI వివరాల మేరకు.. పాత కక్షలతో శాంతినగర్ కాలనీకి చెందిన రమేష్ మరో ఏడుగురితో కలిసి ఆదే కాలనీకి చెందిన నాగేష్ కుటుంబంపై మంగళవారం రాత్రి దాడి చేశాడు. ఈ ఘటనపై కొండాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.