• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పోలీసులను ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఇక సహించబోమని వైసీపీ నేత వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో కలిసి అడిషనల్ ఎస్పీ నాయుడుకు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే అబద్ధ ప్రచారాలను వెంటనే అరికట్టాలని వారు ఎస్పీని కోరినట్లు తెలిపారు.

April 16, 2026 / 07:27 AM IST

పేదరికాన్ని జయించి.. ఇంటర్‌లో రాణించి

NLR: ఇంటర్ ఫలితాల్లో దివ్యాంగురాలు దీవి భవాని పూజిత బుధవారం ఫలితాల్లో సత్తా చాటింది. పేదరికాన్ని అధిగమించి నెల్లూరు కేఏసీ ప్రభుత్వ కళాశాల నుంచి హెచ్ఈసీ ప్రథమ సంవత్సరంలో 488/500 మార్కులు సాధించింది. తండ్రి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. సివిల్స్ లక్ష్యంగా చదువుతానని విద్యార్థి తెలిపింది. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమని ఈ విద్యార్థిని నిరూపించింది.

April 16, 2026 / 07:21 AM IST

పెద్దవడుగూరు మండలంలో చీనీ చెట్ల దగ్ధం

ATP:పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామ రైతు చాకలి బాలరాజుకు చెందిన చీనీ తోట మంటల్లో కాలి పోయింది. బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు తోట సమీపంలోని ఎండు గడ్డికి నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. దీంతో మూడేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న వంద చీనీ చెట్లు, డ్రిప్పు పరికరాలు కాలిపోయాయి. దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిలిందన్నారు.

April 16, 2026 / 07:20 AM IST

జనగణన స్వీయ నమోదుకు సర్వం సిద్ధం: కలెక్టర్

కడప జిల్లాలో 2027 జనగణన సన్నాహాలు పూర్తయ్యాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు పోర్టల్, యాప్ ద్వారా ప్రజలు ‘స్వీయ గణన’ చేసుకోవచ్చన్నారు. మే 1 నుంచి 30 వరకు అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారని ఆయన చెప్పారు. ప్రజలంతా వ్యక్తిగత వివరాల గోప్యత గురించి భయపడకుండా కచ్చితమైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.

April 16, 2026 / 07:12 AM IST

పేలుడు బాధితులకు రూ.5 లక్షల పరిహారం

సత్యసాయి: కదిరి రూరల్ కుమ్మరమండ్లపల్లి పేలుడు ఘటనలో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారికి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించి అండగా నిలిచారు.

April 16, 2026 / 07:09 AM IST

‘బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి’

TPT: నాగలాపురం మండలంలోని శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో మే 1 నుంచి 9 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని జేఈఓ వీరబద్రం ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు, క్యూలైన్లు, అన్నప్రసాదం వంటి ఏర్పాట్లు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

April 16, 2026 / 07:05 AM IST

మే 12న ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

KKD: ఇంటర్‌ మీడియట్- 2026 పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లాలోని ఫస్ట్ ఇయర్‌లో 77 శాతం, సెకండ్ ఇయర్‌లో 81 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా విభాగం అధికారి వి. కేశవరావు పేర్కొన్నారు. కాకినాడ కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. మే 12న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

April 16, 2026 / 07:02 AM IST

సాంకేతికతతో నేరాలకు చెక్: ఎస్పీ

ELR: నేర నియంత్రణలో సాంకేతికతను ఆయుధంగా మలుచుకోవాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలీసు సిబ్బందికి సూచించారు. బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లల గుర్తింపు, గుర్తుతెలియని మృతదేహాల ఆచూకీ కోసం ఆధునిక సాఫ్ట్‌వేర్ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.

April 16, 2026 / 06:53 AM IST

రౌడీషీటర్ అరెస్ట్:. ఏడు రోజుల రిమాండ్

ATP: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్ షేక్ షమీర్‌ను అనంతపురం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఇతను తిరిగి దాడులకు తెగబడటంతో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిబంధనలు మీరినందుకు జడ్జి ఏడు రోజుల రిమాండ్ విధించడంతో నిందితుడిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.

April 16, 2026 / 06:51 AM IST

మీ ఊరి లైబ్రరీ సెస్ ఎంతో తెలుసా?

NLR: జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్ బకాయిలపై బుధవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఛైర్ పర్సన్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు కార్పొరేషన్ రూ.10 కోట్లు, కావలి 50 లక్షలు, గూడూరు, నాయుడుపేట చెరో 40 లక్షలు, ఆత్మకూరు 30 లక్షలు, వెంకటగిరి 35 లక్షలు, బుచ్చి 20 లక్షలు, అల్లూరు 7 లక్షల చొప్పున బకాయిలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ ఆదేశించారు.

April 16, 2026 / 06:50 AM IST

జిల్లాలో 10.26 లక్షల ఓట్లు

CTR: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 623 పంచాయతీల్లోని 5,914 వార్డుల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నట్టు డీపీవో సుధాకర్ రావు పేర్కొన్నారు. అందులో పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది, ఇతరులు 27 మంది ఉన్నారని వెల్లడించారు.

April 16, 2026 / 06:40 AM IST

‘అధికారులు అలసత్వం లేకుండా పని చేయాలి’

PPM: పీఎం జన్ మన్‌లో అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ అన్నారు. బుధవారం భామిని మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అలసత్వం వహించకుండా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్పెషల్‌ ఆఫీసర్స్‌, సెక్రెటరీలు పాల్గొన్నారు.

April 16, 2026 / 06:39 AM IST

వాహనాల తనిఖీలు.. 226 కేసులు నమోదు

కడప జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని SP నచికేత్ హెచ్చరించారు. బైకర్లు హెల్మెట్, కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ వాడాలన్నారు. బుధవారం తనిఖీల్లో నిబంధనలు పాటించని వారిపై 226 కేసులు నమోదు చేసి, రూ.59,325ల జరిమానా విధించినట్లు వెల్లడించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని SP స్పష్టం చేశారు.

April 16, 2026 / 06:39 AM IST

కర్నూలులో అండర్-16 బాలుర క్రికెట్ ఎంపికలు

KRNL: ఈనెల 19వ తేదీన కర్నూలు స్టేడియంలోని క్రికెట్ నెట్స్‌లో అండర్-16 బాలుర విభాగంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు కర్నూలు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ బుధవారం తెలిపారు. 2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన వెల్లడించారు.

April 16, 2026 / 06:32 AM IST

మహానందీశ్వర స్వామి వారి అభిషేకం

కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం త్రయోదశి సందర్భంగా ప్రదోషకాలంలో మహానందీశ్వర స్వామి వారి అభిషేకం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు వైదికంగా పూజలు నిర్వహించగా భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు.

April 16, 2026 / 06:30 AM IST