NTR: జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో 60 రోజుల హుండీ ఆదాయం రూ. 91.95 లక్షలు నమోదైంది. హుండీ లెక్కింపులో 25 గ్రాముల మిశ్రమ బంగారం, 380 గ్రాముల మిశ్రమ వెండి లభించాయి. అలాగే అమెరికా, లండన్, బ్రెజిల్, లిబియా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ELR: జలధార- జలహారతి పనులపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాల్వలు, చెరువుల్లో కనీసం 2 అడుగుల మేర పూడికతీత చేపట్టాలని పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. జూన్ 15 లోపు మంజూరైన పనులన్నింటినీ పూర్తి చేసి ఫోటోలు అప్లోడ్ చేయాలన్నారు.
VZM: గజపతినగరం మండలంలోని మరుపల్లి, ములకల గుమడాం గ్రామాల్లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు శనివారం ఉపాధి కూలీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళ సాధికారత, సైబర్ నేరాలు, గంజాయి నియంత్రణ మహిళా చట్టాలపై గజపతినగరం CI ఎస్.సన్యాసినాయుడు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో SI కిరణ్ కుమార్ నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
W.G: పోలీసు విభాగంలో సుదీర్ఘ కాలం పాటు చిత్తశుద్ధితో సేవలందించి పదవీ విరమణ పొందిన 11 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఘనంగా సన్మానించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. పాలకోడేరు (M) గొల్లలకోడేరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి జ్ఞాపికలను అందజేశారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
CTR: చిత్తూరు సాయుధ దళ కార్యాలయంలో ఆధునిక సదుపాయాలతో నవీకరించిన జిమ్‌ను ఎస్పీ తుషార్ శనివారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరిక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ, విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించేందుకు ఈ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.
తూ.గో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శనివారం రాజమండ్రిలోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 125 మంది అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకాగా 49 మంది ఎంపిక అయ్యారని వివరించారు.
W.G: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇటువంటి పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతాబాయి హెచ్చరించారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.
KRNL: తుంగభద్ర నదిలో శనివారం ఈతకు వెళ్లి ఐదురుగు గల్లంతయ్యారు. సత్యనారాయణ స్వామి పూజకు హాజరైన బంధువులు పూజ అనంతరం నదికి వెళ్లారు. నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదానికి గురయ్యారు. గల్లంతైన వారిలో హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర, సతీశ్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర(25), ధను(23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) ఉన్నారు.
ELR: జిల్లాలో మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు విజయవంతంగా ముగిశాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వర్చువల్ విధానంలో క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించబడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆమె స్వామివారిని ప్రార్థించారు.
NTR: జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన 14 మంది పోలీసు అధికారులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను శాలువాలతో సత్కరించారు. సుదీర్ఘకాలం ప్రజాసేవ చేసిన వారి సేవలను డీసీపీ కొనియాడారు.
NDL: చాగలమర్రిలో TDP కార్యకర్తలకు అండగా ఉంటానని ఆళ్లగడ్డ నియోజకవర్గం సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ అన్నారు. మండలంలోని చిన్న వంగలి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి నరేంద్ర రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం భార్గవ్ రామ్ చిన్న వంగలి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
BPT: చీరాల రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో చోరీకి పాల్పడిన నిందితుడిని చీరాల జీఆర్పీ పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుడు సందీపన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసు,సెల్ఫోన్‌తో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, దర్యాప్తు ద్వారా కేసును త్వరగా ఛేదించినట్లు పోలీసు చెప్పుకొచ్చారు.
SKLM: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జూన్ 2 న ప్రభుత్వ డీఎల్‌టీసీ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. సుధ శనివారం తెలిపారు. ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని, మొత్తం 240 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VSP: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖకి రూ.1,500 కోట్ల విలువైన మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన దిశా సమావేశంలో మాట్లాడారు. మధురవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల తాగునీటి సరఫరా,సెమీ బల్క్ వాటర్ సప్లై అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.