NDL: కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీల్ పొరాణ్ సూచించారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 36 మందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. నంద్యాల ఏఎస్పీ ఎం.జావళి పాల్గొన్నారు.
KRNL: డయాగ్నొస్టిక్ బ్లాక్‌లో రోగుల మెరుగైన సేవలను వైద్యులు అందించాలని కర్నూలు GGH సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలోని తన కార్యాలయంలో డయాగ్నొస్టిక్ వైద్యులతో సమీక్ష చేశారు. డయాగ్నొస్టిక్ బ్లాక్‌లో శాంపిల్ సేకరణ, శాంపిల్ నమూనా, రిపోర్ట్స్ ప్రదేశంలో జనాలు భారీగా గుమిగూడటం, క్యూ లేకపోవడం గుర్తించామన్నారు.
ATP: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జ్ఞానప్రసూనాంబికా దేవి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహు-కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
సత్యసాయి: కదిరి పట్టణంలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులకు సీ-సర్టిఫికెట్ పరీక్షల శిక్షణ కోసం ఎస్ఎల్ఆర్ డమ్మీ గన్లు, యూనిఫామ్స్ అందజేశారు. కూటమి నాయకులతో కలిసి జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై ఎమ్మెల్యే చర్చించారు.
NLR: 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు సంతానోత్పత్తి పెరిగే సమయం కావడంతో ఈ సమయంలో వేట నిషేధించినట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో శనివారం నుంచి చేపల వేట ఆగిపోనుంది. సముద్ర జలాలలో యాంత్రిక పడవలు ద్వారా చేపల వేట సాగించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.
గుంటూరు: శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వార్ల ఊరేగింపు నేడు జరగనుంది. ఉత్సవ విగ్రహాలతో శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు అరండల్‌పేటలో ఆలయ కమిటీ సభ్యులు భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నారు. దేవాలయం నుంచి నిడుముక్కల వరకు ప్రదర్శన ఉండగా, గోశాల నూతన భవనం ప్రారంభోత్సవంలో భక్తులు పాల్గొనాలని కోరారు.
VZM: రెవెన్యూ సమస్యలు పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లీనికిలు సత్ఫలితాలను ఇస్తున్నాయని బొండపల్లి MRO రాజేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మండలంలో 29 వినతులు వచ్చాయని,వీటిలో ఇంకా 4 సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అన్నారు. ఈ మేరకు రెవెన్యూ సమస్యలపై స్థానిక MRO కార్యాలయంలో వినతులు అన్ని రోజుల్లో ఇవ్వవచ్చన్నారు.
సత్యసాయి: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని జిల్లా కన్వీనర్ జమున బాయి తెలిపారు. విద్యార్థులు ఉదయం 9:30 గంటలకే హాల్‌టికెట్, ఆధార్ కార్డుతో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ప్రకాశం: సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
NDL: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ దొంగతనం కేసును ఛేదించిన ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణకు ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రతిభా పురస్కారం శుక్రవారం అందజేశారు. నిందితులను గుర్తించి స్వామివారి నగలను రికవరీ చేయడంపై ప్రశంసించారు. కేసులో కృషిచేసిన పోలీస్ సిబ్బందిని కూడా అభినందించి అవార్డులు ప్రదానం చేశారు.
కృష్ణా: విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు గన్నవరం విమానాశ్రయాన్ని బైపాస్‌కు నేరుగా అనుసంధానం చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం చినఅవుటపల్లి, గొల్లపూడి మార్గాలే ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెదురుపావులూరు–కేసరపల్లి మార్గాన్ని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేస్తే 20 నిమిషాల్లో చేరుకోవచ్చని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
ATP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 7 నుంచి 10, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు అర్హులైన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
గుంటూరు జిల్లా ఎస్‌బీ డీఎస్పీగా అలహరి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు డీఎస్పీలకు పోస్టింగులు కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. బదిలీలు, కొత్త పోస్టింగ్‌లలో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
VZM: గరివిడి మండల పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో కందిపేట ఫీడర్ నిర్వహణ పనుల నిమిత్తతం శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదని EE త్రినాథ్‌రావు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు కందిపేట, కేఎల్ పురం, ఏనుగువలస, బాగువలస గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
WG: నరసాపురంలో వృద్ధుడిపై దాడికి పాల్పడిన బావిశెట్టి జ్యోతి బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8న సైకిల్‌పై వెళ్తున్న పళ్ల సూర్యనారాయణను అడ్డుకున్న నిందితుడు, కూల్ డ్రింక్ బాటిల్తో దాడికి యత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో టౌన్ ఎస్సై ముత్యాలరావు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి నిందితుడికి రిమాండ్ విధించారు.