• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రతి ఒక్కరూ ఫెర్రర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి: బల్లా పల్లవి

ATP: ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని అనంతపురంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. సమాజ సేవకు అంకితమైన ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

April 9, 2026 / 03:00 PM IST

వేటపాలెంలో పోషణ పక్వాడ కార్యక్రమం

BPT: వేటపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న పోషణ పక్వాడ 8వ ఎడిషన్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ టీ. ప్రియాంక మాట్లాడుతూ.. శిశువు జననం నుంచి తొలి ఆరు సంవత్సరాల లోపు మెదడు అభివృద్ధిని గరిష్ట స్థాయికి పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.

April 9, 2026 / 02:35 PM IST

‘భూ హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం’

ATP: రాయదుర్గం మండలం డీ.కొండాపురం గ్రామంలో రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పంపిణీ చేశారు. రైతుల భూ హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలు పారదర్శకతకు ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి రైతుకు చట్టబద్ధమైన రక్షణ అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

April 9, 2026 / 02:30 PM IST

‘దేవస్థానం కబ్జా భూమిని విడిపించాలి’

KRNL: మంత్రాలయం మండలం సూగురు గ్రామంలోని శ్రీ వీరలింగేశ్వర స్వామి, ఆసమండేశ్వర స్వామి దేవాలయ భూమిని కబ్జాదారుల నుంచి విడిపించాలని గురువారం హిందూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవస్థాన కమిటీ సభ్యులు గురుమూర్తి, జనార్ధన్ PSలో వినతి పత్రం అందజేశారు.

April 9, 2026 / 02:29 PM IST

తణుకులో ‘చేంజ్ మేకర్స్’.. 350 కిలోల ప్లాస్టిక్ సేకరణ

W.G: తణుకులో ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ అధికారులు గురువారం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థల నుంచి సుమారు 350 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

April 9, 2026 / 02:28 PM IST

వాణిజ్య సముదాయం ప్రారంభం

కృష్ణా: మచిలీపట్నంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో వాణిజ్య సముదాయం గురువారం ఏర్పాటు చేశారు. 15 శాతం స్త్రీ, శిశు సంక్షేమ నిధుల నుంచి రూ.2 కోట్లతో నిర్మించిన ఈ సముదాయాన్ని చైర్‌పర్సన్ ఉప్పల హారిక, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి సాధించి కుటుంబాలను బలోపేతం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని హారిక తెలిపారు.

April 9, 2026 / 02:27 PM IST

రుద్రవరం తహశీల్దార్‌గా నాగవీణ బాధ్యతల స్వీకరణ

NDL: రుద్రవరం మండల నూతన తహశీల్దార్ నాగవీణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ధోని ఆల్ ఫ్రైడ్ నంద్యాల కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నియమితులైన నాగవీణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజా సేవలో ముందుంటానన్నారు.

April 9, 2026 / 02:26 PM IST

సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: కలిదిండి మండలం సంతోషపురంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అలాగే సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 02:25 PM IST

న్యాయవాది దారుణ హత్య.. ఐదుగురు నిందితుల అరెస్ట్

అన్నమయ్య: కేవీ పల్లి మండలం పరిధిలో పాత కక్షలు, గ్రామ ఆధిపత్య పోరుతో న్యాయవాది పూజారి యల్లయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. నిందితులు ముందస్తు పథకం ప్రకారం ట్రాక్టర్లతో దారిని దిగ్బంధించి, ఇంటిపై దాడి చేసి బండరాళ్లతో హత్య చేసినట్లు వెల్లడించారు.

April 9, 2026 / 02:24 PM IST

బద్వేలులో ఉరి వేసుకొని మహిళ మృతి

KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త మున్సిపల్ ఆఫీస్ సమీపంలో అమిలిపోగు అమ్ములు అనే మహిళ ఉరి వేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకుంది. మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై బాధిత మహిళ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 02:23 PM IST

డుంబ్రిగుడలో పోషణ పక్వవాడ కార్యక్రమం

ASR: డుంబ్రిగుడ పీహెచ్‌సీలో పోషణ పక్వవాడ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈనెల 8 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్‌ సీడీపీవో ఎస్తేరు రాణి, తెలిపారు. గర్భిణీలు చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. అలాగే, గర్భిణీలు కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

April 9, 2026 / 02:23 PM IST

కొత్త బురుజుకు 30 టాయిలెట్ల మంజూరు: కలెక్టర్

NDL: డోన్ మండల పరిధిలోని కొత్త బురుజు గ్రామ అభివృద్ధిలో భాగంగా మహిళలకు 30 టాయిలెట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డితో పాటు కలెక్టర్ తాగునీటి పైప్‌లైన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని మహిళలు తెలపడంతో కలెక్టర్ స్పందించి వెంటనే నిర్మిస్తామన్నారు.

April 9, 2026 / 02:23 PM IST

‘ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలి’

PPM: వైసీపీ మహిళా పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కురుపాం నియోజకవర్గ నేతలు చినమేరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమినేతలకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందన్నారు.

April 9, 2026 / 02:15 PM IST

‘ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలి’

AKP: ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడానికి పంచాయతీ ప్రత్యేక అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ సూచించారు. ఇటీవల పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులతో ఎమ్మెల్యే ఎలమంచిలిలో ఇవాళ సమావేశం నిర్వహించారు. త్వరలో అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తానని ఈలోగా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

April 9, 2026 / 02:13 PM IST

సీఎం చంద్రబాబుతో బీజేపీ చీఫ్ భేటీ

VSP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కలిశారు. విశాఖ‌కు చెందిన మాధ‌వ్‌.. న‌గ‌ర స‌మ‌స్య‌ల‌తో పాటు హోం గార్డుల‌ బదిలీలు, వృద్ధులకు ఆరోగ్య కార్డుల వినియోగంపై సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

April 9, 2026 / 02:11 PM IST