• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాబు జగజ్జివన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ELR: బాబు జగ్జివన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఈరోజు పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో బాబు జగజ్జీవన్ రామ్ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం ఆయన పోరాడారన్నారు.

April 5, 2026 / 05:38 PM IST

పోలేరమ్మ ఆలయానికి భారీగా భక్తులు

ప్రకాశం: జరుగుమల్లి మండలంలో కామేపల్లిలో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం ఆదివారం కిక్కిరిసింది అమ్మవారి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. భక్తుల రాకతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

April 5, 2026 / 05:32 PM IST

యువకుడు స్వయంగా కాలు నరికేసుకున్న ఘటన

అన్నమయ్య: మదనపల్లె మాదినకొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మరో వ్యక్తితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక శ్రీరాములు (35) అనే యువకుడు మద్యం సేవించి అడవిలో తన ఎడమ కాలును కొడవలితో నరికేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా,పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 5, 2026 / 05:31 PM IST

‘మన రాజధాని-మన అమరావతి’

VZM: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంపై ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె తన నివాసం వద్ద స్వయంగా “మన రాజధాని – మన అమరావతి”అని ముగ్గులు వేసిమద్దతు తెలిపారు. కేంద్ర నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి అని కొనియాడారు.

April 5, 2026 / 05:22 PM IST

ఎంట్రీ పాస్ ఉన్నవారికే ప్రవేశం

ATP: రేపు జరగనున్న అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవానికి ఎంట్రీ పాస్ ఉన్నవారికే ప్రవేశం కల్పిస్తామని, మొబైల్ ఫోన్లు అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. భద్రత దృష్ట్యా 12 ఏళ్ల లోపు పిల్లలకు ఆడిటోరియంలోకి అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ వేడుకలో 40,782 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వీసీ సుదర్శన్ రావు తెలిపారు.

April 5, 2026 / 05:20 PM IST

రైతులు, కార్మికులకు అన్యాయం: AIKMS జాతీయ కార్యదర్శి

GNTR: కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులు, కార్మికులకు నష్టదాయకమని AIKMS జాతీయ కార్యదర్శి బి. భాస్కర్ అన్నారు. గుంటూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

April 5, 2026 / 05:15 PM IST

భీమడోలులో ఉచిత మెగా వైద్య శిబిరం

ELR: భీమడోలు మానస స్కూల్ నందు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ.. వైద్యం అనేది వ్యాపారం కాకుండా మానవతా దృక్పథంతో చూడాల్సిన రంగమన్నారు.

April 5, 2026 / 05:15 PM IST

మదనపల్లెలో వైన్ షాపులపై సిపిఐ ఆందోళన

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో వైన్ షాపుల కారణంగా క్రైమ్ పెరుగుతోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే. మురళి ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వైన్ షాపులు నడుస్తున్నాయని, 24 గంటల పాటు దొడ్డిదారిన మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.

April 5, 2026 / 05:14 PM IST

మున్సిపాలిటీ ముస్తాబుకు డిమాండ్

పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్య పనులు 24/7 నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రోడ్లు-కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రత్యేక అధికారి పాలనలో పట్టణాన్ని ముస్తాబు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

April 5, 2026 / 05:11 PM IST

రేపు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’

VSP: విద్యుత్ సమస్యల వేగవంత పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ ప్రతి సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తోందని ఇమ్మడి పృథ్వి తేజ్ తెలిపారు. సోమవారం ఉదయం 10.30-11.30 వరకు విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.  వినియోగదారులు 8688400499కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.

April 5, 2026 / 05:11 PM IST

నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ

ASR: జిల్లా నూతన కలెక్టర్‌గా టి.నిశాంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక పూజలతో కార్యాలయంలో ప్రవేశించి సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించారు. ఐటీడీఏ పీవో శ్రీపూజతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేశారు.

April 5, 2026 / 05:11 PM IST

తండ్రిని హతమార్చిన కుమారుడు..!

SKLM: కన్న కొడుకే తండ్రిని హత్య చేసిన ఘటన మందస మండలం లోహరిబంద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మీనారాయణ(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులకు డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో కోపంతో తండ్రిని కొట్టగా తలకు తీవ్ర గాయాలై మరణించాడు. దీనిపై ఎస్సై కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేశారు.

April 5, 2026 / 05:11 PM IST

మంత్రిని కలిసిన ఎంపీ నాగరాజు

KRNL: ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, బీసీ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల వసతి సదుపాయాల మెరుగుపై చర్చించారు. ఎంపీ సూచనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

April 5, 2026 / 05:10 PM IST

భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు

NDL: మహానంది ఆలయంలో వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లతో పాటు భక్తుల కాళ్లు కాలకుండా కొబ్బరి పీచుతో తయారు చేసిన మ్యాట్లు వేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు చేపట్టామని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేసవికాలం ముగిసే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని పేర్కొన్నారు.

April 5, 2026 / 05:04 PM IST

ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఇన్‌ఛార్జ్

W.G: పెంటపాడు మండలం కే.పెంటపాడు గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ రఘురాం నాయుడు హాజరయ్యారు. అనంతరం పదమరు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో దోడిగర్ల చంద్రయ్య, బేతాళ అనిల్ కుమార్, చీకటిమిల్లి రాజీవ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 05:01 PM IST