• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమం

TPT: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో నరసింహులు సంబంధిత అధికారులతో కలిసి మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బ్యానర్‌ను ఆవిష్కరించారు. మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.

April 20, 2026 / 10:00 PM IST

నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

ATP: ఆయా శాఖల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి హౌసింగ్, ఉపాధి హామీ, జలధార, జనగణన తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎంఏవై అర్బన్ కింద 17,239 ఇళ్లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు.

April 20, 2026 / 10:00 PM IST

సెన్సస్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

CTR: వేదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పురుషోత్తం, తహసీల్దార్ బాబు ఆధ్వర్యంలో 2027 జనాభా లెక్కల రెండో బ్యాచ్ ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ప్రారంభమైంది. అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

April 20, 2026 / 10:00 PM IST

గాయపడిన కానిస్టేబుళ్లను పరామర్శించిన ఎస్పీ

కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన కానిస్టేబుళ్లు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. మంగళగిరి NRI ఆసుపత్రిలో వారికి చికిత్స అందగా, జిల్లా SP వి. విద్యాసాగర్ నాయుడు వెళ్లి పరామర్శించారు. వైద్యుల కృషి, సిబ్బంది ధైర్యం, కుటుంబాల మద్దతుతో కోలుకున్నారని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

April 20, 2026 / 09:47 PM IST

కనిగిరి నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం

ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి పామూరు, నెల్లూరు మీదుగా తిరుపతికి ప్రతిరోజు సాయంత్రం 06.00 గంటలకు ఎక్స్‌ప్రెస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షయానా బేగం తెలిపారు. ఈ బస్సు సాయంత్రం 6 కనిగిరిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 1 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తిరుపతిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు కనిగిరికి చేరుకుంటుందన్నారు.

April 20, 2026 / 09:46 PM IST

రేపు సంతమాగులూరుకు మంత్రి గొట్టిపాటి

BPT: సంతమాగులూరులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొప్పరం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం 10:30 గంటలకు కొమ్మాలపాడులో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయం తెలిపింది.

April 20, 2026 / 09:38 PM IST

రైతులకు కోసిగి ఏవో కీలక సూచన

KRNL: కోసిగి మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ కార్యాలయంలో సోమవారం రైతులకు కీలక సూచనలు చేశారు. విత్తనాలను తప్పనిసరిగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని, కొనుగోలు సమయంలో రసీదు తీసుకోవాలని సూచించారు. పంట కాలం ముగిసే వరకు బిల్లులను భద్రపరుచుకోవడం వల్ల మొలక సమస్యలు లేదా పంట ఎదుగుదల లోపాలు తలెత్తినప్పుడు చర్యలు ఉంటాయన్నారు.

April 20, 2026 / 09:35 PM IST

మహిళ కంట్లో కారం కొట్టి గొలుసు దొంగతనం

GNTR: తెనాలిలో మహిళ కంట్లో కారం కొట్టి ఇద్దరు మహిళలు గొలుసు అపహరించారు. పట్టణ నాజరుపేటకు చెందిన భూలక్ష్మి టైలరింగ్‌ పని చేస్తుంది. నాజరుపేటకే చెందిన మంజుల, శ్రీలత ఆమె వద్దకు వెళ్లి తమకు జాకెట్లు కుట్టాలని మాట్లాడుతూ.. భూలక్ష్మి కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు.

April 20, 2026 / 09:35 PM IST

అధికార యంత్రాంగానికి నంద్యాల కలెక్టర్ హెచ్చరిక

NDL: ఈ వారంలో పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సంక్షేమ పథకాల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలని ఈ మేరకు కలెక్టర్ ఆదేశించారు.

April 20, 2026 / 09:30 PM IST

సత్తెనపల్లిలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

PLD: సత్తెనపల్లి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించగా, మహిళలకు చీరలు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 20, 2026 / 09:24 PM IST

పార్వతీపురంలో డ్రగ్స్ పై ర్యాలీ

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ‘అభ్యుదయం 2.0’ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే 100 రోజుల్లో జిల్లాను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని పోలీసులు తెలిపారు.

April 20, 2026 / 09:22 PM IST

పుత్తూరులో పోలీస్ ఫుట్ పెట్రోలింగ్

TPT: పుత్తూరు పట్టణంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్సైలు నాగేంద్రబాబు, వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. గంజాయి, జూదం, బెట్టింగ్, దొంగతనాలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టినట్లు తెలిపారు. బస్టాండ్, స్కూల్స్, కాలేజీలు, పార్కుల వద్ద పర్యవేక్షణ పెంచారు.

April 20, 2026 / 09:00 PM IST

డిప్యూటీ సీఎం పేరిట నకిలీ లేఖలు.. కలెక్టర్ హెచ్చరిక

W.G: కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. డిప్యూటీ సీఎం పేరిట నకిలీ సిఫార్సు లేఖలు సృష్టిస్తూ, దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో దళారులు చేసే మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కలెక్టర్ హెచ్చరించారు.

April 20, 2026 / 08:55 PM IST

భీమేశ్వర స్వామి దేవస్థాన రథశాలకు శంకుస్థాపన

W.G: భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన రథశాలకు MLA పులపర్తి రామాంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి ఏటా శివరాత్రికి జరిగే రథోత్సవానికి చిహ్నమైన రథానికి ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, మెంటే పార్ధసారధి, ఆలయ EO, కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 20, 2026 / 08:51 PM IST

మహిళా భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

జిల్లాలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ముద్దనూరు సీఐ నగేష్ చింతకుంట గ్రామంలో మహిళలకు అవగాహన కల్పించారు. శక్తి యాప్ వినియోగం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై వివరాలు తెలియజేస్తూ, సైబర్ నేరాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శక్తి యాప్ వినియోగం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లో పోలీస్ సహాయం అందుతుందన్నారు.

April 20, 2026 / 08:51 PM IST