• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కడప రైల్వే స్టేషన్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

కడప రైల్వే స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం–కడప ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు స్టేషన్ పరిసరాలు, పార్సెల్ సెంటర్లు, ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రగ్స్ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

April 15, 2026 / 07:20 PM IST

స్వామివారిని దర్శించుకున్న చాగంటి

TPT: తిరుపతి కపిలేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కపిలతీర్థంలో స్నానం చేసి, విఘ్నేశ్వరుడు, కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి దర్శనం చేస్తే శ్రేయస్సు, సంతానం, కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. కాలభైరవ స్వామి, కోటిలింగాలు దర్శనం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని తెలిపారు.

April 15, 2026 / 07:12 PM IST

ఇందిరమ్మ కాలనీ సమస్యల పరిష్కారానికి మంత్రి ఆదేశం

సత్యసాయి: బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘మా ఊరు – మన జెండా’ కార్యక్రమంలో భాగంగా కాలనీని సందర్శించిన మంత్రికి ప్రజలు వీధి దీపాలు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి.. అధికారులతో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని హరీష్ బాబుకు సూచించారు.

April 15, 2026 / 07:10 PM IST

పూడి శ్రీహరి అరెస్టుపై అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం

ATP: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను దారుణంగా కాజేస్తోందని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీహరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

April 15, 2026 / 07:10 PM IST

రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలిచిన మన్యం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన్యం జిల్లా అద్భుతమైన ప్రగతిని కనబరిచిందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కొనియాడారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో ఉన్న జిల్లా, ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 3వ స్థానానికి చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీపడి జిల్లా టాప్-3లో నిలవడం గొప్ప అన్నారు.

April 15, 2026 / 07:03 PM IST

‘పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలి’

VZM: జిల్లాలో రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసి సకాలంలో అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన పాల్గొన్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ జరుగుతుందని చెప్పారు.

April 15, 2026 / 07:00 PM IST

రాష్ట్రంలో ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోంది: గడికోట

అన్నమయ్య: రాయచోటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీనియర్ రిపోర్టర్ పూడి శ్రీహరి అరెస్ట్ అప్రజాస్వామికమని పేర్కొంటూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో భారీ వ్యయాలు చేసి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు.

April 15, 2026 / 07:00 PM IST

‘ఈ నెల 16 నుంచి స్వీయగణన జనాభా లెక్కలు కార్యక్రమం’

W.G: సెన్సెస్-2027లో భాగంగా మే 1 నుంచి 30వ తారీకు వరకు ఇండ్ల గణన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఉండి తహసీల్దార్ కె. నాగార్జున బుధవారం తెలిపారు. ఈ నెల 16 వతేది నుంచి ఏప్రిల్ 30వ వరకు స్వీయ గణన కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులు, కుటుంబ వివరాలను https://se.census.gov.in నమోదు చేసుకోవాలి అన్నారు.

April 15, 2026 / 07:00 PM IST

250 అక్రమ మద్యం బాటిళ్ల స్వాధీనం

KDP: తాళ్ల ప్రొద్దుటూరు పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సుగుమంచిపల్లి చెక్‌పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి 250 క్వార్టర్ బాటిళ్ల కేరళ మాల్ట్ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. చామలూరు గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి వద్ద నుంచి మద్యం పట్టుబడగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 15, 2026 / 07:00 PM IST

టీడీపీ పొలిట్‌బ్యూరోలో లావుకు కీలక బాధ్యత

PLD: నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలుకు టీడీపీలో ప్రాధాన్యం పెరిగింది. పార్టీ అధిష్టానం ఆయనను పొలిట్‌బ్యూరో ఎక్స్ అఫిషియో మెంబర్‌గా నియమించింది. ఇప్పటికే ఈ విభాగంలో లోకేష్, పల్లా శ్రీనివాసరావు సభ్యులుగా ఉన్నారు. తాజాగా లావు శ్రీ కృష్ణ దేవరాయలు కూడా ఈ జాబితాలో చేరారు.

April 15, 2026 / 06:58 PM IST

ఫలితాలు.. జిల్లా టాపర్లు వీరే..!

సత్యసాయి: జిల్లా ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 67 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు జిల్లా విద్యాధికారి చెన్నకేశవ ప్రసాద్ తెలిపారు. హిందూపురం ప్రభుత్వ కళాశాల విద్యార్థిని జయశ్రీ (494/500), కదిరి విద్యార్థిని ఎస్. చాందిని (991/1000) జిల్లా టాపర్లుగా నిలిచారని తెలిపారు.

April 15, 2026 / 06:50 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

ATP: రాప్తాడు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె స్వయంగా భోజనాన్ని పరిశీలించి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారధి పాల్గొన్నారు.

April 15, 2026 / 06:50 PM IST

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

ASR: గ్రామస్థాయిలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశించారు. పాడేరులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత, సామాజిక అవగాహనపై చర్చించారు. మహిళలపై వేధింపులు, గృహహింస తదితర సంఘటనలు జరిగిన వెంటనే స్పందించాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ సహకరించాలన్నారు.

April 15, 2026 / 06:45 PM IST

‘ఫెయిల్ అయిన విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు’

AKP: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళనకు గురికావద్దని పాయకరావుపేట సీఐ అప్పన్న విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయన్నారు. మీ కుటుంబానికి సమాజానికి మీరు ఎంతో అవసరం అన్నారు. పరీక్ష ఫెయిల్ అయితే మళ్లీ రాసే అవకాశం ఉంటుంది, కానీ ప్రాణం పోతే తిరిగి రాదన్నారు.

April 15, 2026 / 06:42 PM IST

స్పోర్ట్స్ హాస్టల్ తరలింపుపై వివాదం

కర్నూలులోని శాయి స్పోర్ట్స్ హాస్టల్‌ను తిరుపతికి తరలించాలనే యత్నాలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి భరత్ స్పందించాలని డిమాండ్ చేశారు. కర్నూలును స్పోర్ట్స్ సిటీగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం హాస్టల్ పరిరక్షణపై తీసుకున్న చర్యలు వెల్లడించాలని కోరారు.

April 15, 2026 / 06:40 PM IST