నెల్లూరు జిల్లాలో ఇటీవల పదిమంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు 4వ తేదీన ఎస్పీ అజిత వేజెండ్ల పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. పరిపాలనా కారణాలతో ఈ బదిలీలను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కసారిగా అంతమంది పోలీసులను బదిలీ చేయడం, చివరకు ఆర్డర్స్ రద్దు చేయడంపై చర్చ జరుగుతోంది.
AKP: ముసిడిపాలెం పంచాయతీ ప్రత్యేక అధికారిగా నియమితులైన మండల ఇంజనీరు సోమశేఖర్‌ను టీడీపీ నాయకులు లగుడు శ్రీనివాసరావు, రుత్తల రమణమ్మ, లగుడు గోవిందు సత్కరించారు. ఈ సందర్బంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని కోరగా, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని సోమశేఖర్ హామీ ఇచ్చారు.
సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి బాలకృష్ణకు పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనులపై ఇరువురు కాసేపు చర్చించారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గంలోని 13 చెరువులు, కుంటల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2.45 కోట్లు మంజూరు చేసింది. కట్టలు, తూముల మరమ్మతులు చేపట్టి, వర్షపు నీటిని నిల్వ చేయడమే దీని లక్ష్యం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. దీనివల్ల సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుంది.
SKLM: ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిబంధనలు వర్తిస్తాయి. జిల్లాలో 193 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండగా, 11 మండలాల పరిధిలో 1,565 మెకనైజ్డ్ బోట్లు, 2557 సంప్రదాయ పడవలు ఉన్నాయి. మత్స్యకారులకు రూ. 20 వేలు ప్రభుత్వం అందజేస్తుంది.
AKP: జీడిమామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వై. పాపారావు డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పూత దశలో పొగమంచు ప్రభావం, ప్రస్తుతం వర్షాలతో నష్టాలు పెరిగాయని, ప్రభుత్వం తక్షణం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ELR: బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై గా నూతన బాధ్యతలు స్వీకరించిన పి. చెన్నారావు బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు..
W.G: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, పార్టీ నాయకుల భార్యలను నీచ, నికృష్టమైన భాషతో దూషించడం పట్ల వైసిపి శ్రేణులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తణుకు నరేంద్ర సెంటర్లో రాధాకృష్ణకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే రాధాకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
SKLM: శక్తి యాప్ ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉంటేనే పూర్తి రక్షణ లభిస్తుందని శక్తి టీం సభ్యుడు గిరిధర్ తెలిపారు. బుధవారం కోటబొమ్మాలి మండలం హరిశ్చంద్రపురంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే శక్తి యాప్ ద్వారా రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ యాప్ లేకపోతే ఇబ్బందులలో ఉన్నట్టే అన్నారు
E.G: రాజమండ్రిలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించనున్న ఆర్చ్ నిర్మాణ పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మన సంస్కృతి..సంప్రదాయం ఉట్టిపడేలా సుమారు రూ.20 లక్షలతో ఆలయం వద్ద ఆర్చ్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
E.G: అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం దంత వ్యాధులకు సంబంధించి ఎక్సరే,ఇంట్రా ఓరల్ కెమెరా, తదితర వైద్య పరికరాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యం విద్యా వ్యవసాయం ఉపాధి రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు
కోనసీమ: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు, మానసికొల్లాసానికి దోహదపడతాయని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి శ్రీ రామా రెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్ కోర్టులను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ELR: ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పేర్కొన్నారు. బుధవారం RWS SE త్రినాధ్, DE రామారావు, AE సుబ్రహ్మణ్యం మరియు RWS ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా త్రాగునీటి సరఫరాకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
KDP: చక్రాయపేట మండలం మహాదేవపల్లెకు చెందిన రైతు నరసింహులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మామిడికాయలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తన తోటలోని 172 మామిడి చెట్లను బుధవారం నరికివేశారు.17 ఏళ్లుగా సాగు చేసిన చెట్లకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ASR: మాకవరపాలెం మండలం తామరం సెంటర్‌లో టీడీపీ నాయకుడు కోసూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను బుధవారం ప్రారంభించారు. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికులు, కూలీలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.