ఎన్టీఆర్: గుంటూరులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను, నందిగామ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వర కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాలకృష్ణ నియమితులైన సందర్భంగా ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
SKLM: తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ PACS డైరెక్టర్ పైడి మురళీ మోహన్ తీవ్ర ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.
BPT: సంతమాగులూరు మండలంలోని కొప్పరం రెవిన్యూ సజ్జాపురంలో గురువారం రీ సర్వే ప్రారంభించారు. ఉదయం ఫీల్డ్‌లోకి వెళ్లి భూములను పరిశీలించారు. మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు పారదర్శకంగా రీ సర్వే నిర్వహించిన భూములను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేస్తామని తెలిపారు. రీ సర్వే నిర్వహించే భూముల యజమానులకు నోటీసులు ఇచ్చామని వారు అన్నారు.
KKD: సీతారామపురంలో పంపన రాజు అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తన భార్య అక్రమ సంబంధం, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు, పోలీసుల వేధింపులే కారణమని ఆరోపించాడు. భార్య పెట్టిన కేసుల వల్ల మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
VSP: నంద్యాలలో ఏప్రిల్ 17 నుంచి 19 వరకు సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ తెలిపారు. ఈమేరకు గురువారం జగదంబ సీఐటీయూ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. విశాఖ నుంచి 60 మంది ప్రతినిధులు హాజరవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 650 మంది పాల్గొంటారని పేర్కొన్నారు.
GNTR: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేష్ ఎంపిక కావడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తెలిపారు. లోకేష్‌కు రాష్ట్ర గమనాన్ని మార్చే సామర్థ్యం ఉందని అన్నారు. యువ నాయకుడిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
GNTR: మంత్రి లోకేశ్ చొరవతో పెదవడ్లపూడిలో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం రూ.93.90 లక్షలతో మూడు డొంక రోడ్ల నిర్మాణానికి ఏఎంసీ ఛైర్మన్ కిరణ్‌చంద్ గురువారం శంకుస్థాపన చేశారు. గద్దెరు బీడు, నంబూరు లాకులు, మొండి గేట్ వద్ద వీటిని నిర్మిస్తున్నారు. ఈ రోడ్లతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు సులభంగా తరలించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
KDP: ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆరోగ్యం, ఆదాయం, దిగుబడి ఉంటుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇవాళ పులివెందుల పట్టణంలోని స్థానిక ఏపీ కార్ల్‌లో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకృతి మార్పులకు అనుగుణంగా పంటల సాగు, జీవామృతం, ఘనజీవామృతం, కషాయాల తయారీపై అవగాహన కల్పించారు.
రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు ‘గోల్డెన్ అవర్’లో అత్యవసర ఉచిత వైద్య చికిత్సను అందించి ప్రాణాలను కాపాడాలనే ఉన్నత లక్ష్యంతో PM-RAHAT పథకంపై ప.గో.జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పథకం అమలులో కీలకమైన eDAR అప్లికేషన్ వినియోగంపై జిల్లా పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం పల సూచనలు అందజేశారు.
ELR: జంగారెడ్డిగూడెం శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి శేఖర్ ఇవాళ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనను కలిసి పలు వినతులు సమర్పించారు. పట్టణం గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్నందున, గ్రంథాలయాన్ని గ్రేడ్-1కు పెంచాలని కోరారు. భవనానికి మరమ్మతులు, రంగులు వేయడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు.
BPT: చిన్నగంజాం మండలంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వాణిశ్రీ తల్లులకు పిల్లల ఆరోగ్యంపై సూచనలు ఇచ్చారు. జంక్ ఫుడ్ వల్ల వచ్చే సమస్యలను వివరించి, స్వచ్ఛమైన పోషకాహారం అందించాలని, చిన్నప్పటి నుంచే సరైన ఆహార అలవాట్లు పెంచాలని అవగాహన కల్పించారు.
KRNL: మంత్రాలయం–చిలకలడోణ రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఇవాళ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను కోరారు. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ATP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని శింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన ‘సాగునీటి ప్రాజెక్టులు-సమాలోచన’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతోనే ప్రాంతీయ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
సత్యసాయి: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అమరావతిలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఏడీసీసీబీ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టినందుకు నేతలు హర్షం వ్యక్తం చేశారు.
కాకినాడలో సెన్సస్-2027 స్వీయ నమోదు ప్రక్రియను గురువారం అధికారికంగా ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ NVV సత్యనారాయణ యాప్ ద్వారా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేత కుటుంబ వివరాలు నమోదు చేయించారు. ఈ నెలాఖరు వరకు https://census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.