SS: గోరంట్లలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జెండా ఆవిష్కరణ చేశారు. సీఐటీయూ నాయకుడు రమేశ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, వేతన భద్రత, సామాజిక న్యాయం కోసం సీఐటీయూ పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగించేలా ఉన్నాయని విమర్శిస్తూ, వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.
TPT: వీకోటలో గాలీ వాన బీభత్సం సృష్టించగా వృక్షాలతో పాటు ట్రాన్స్ ఫార్మర్స్ నేలకొరిగాయి. పట్టణంలోని టాక్సీ స్టాండ్ సమీపంలో ఓ వృక్షం కారుపై పడగా క్రేన్ సహాయంతో తొలగించారు. అలాగే పట్టణ మెయిన్ రోడ్డులో ట్రాన్స్ ఫార్మర్ గాలి తాకిడికి నేలకొరిగింది. ఇదిలా ఉండగా బలమైన గాలుల ధాటికి మండలంలోని ఓ బొప్పాయి తోట ధ్వంసమైంది.
విజయనగరం జిల్లా గజపతినగరం సర్కిల్ పరిధిలోగల బోడసింగిపేట గ్రామంలో శనివారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమం గజపతినగరం సీఐ ఎస్. సన్యాసినాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఎటువంటి అనుమతి పత్రాలు లేని 18 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రజల చేత ఎస్సై మహేష్ ప్రతిజ్ఞ చేయించారు.
KRNL: చిప్పగిరి మండలం బంటనహళ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న స్మశానం రోడ్డు పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏఈ సోమప్ప ఇవాళ ఆకస్మికంగా పనుల స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి పనుల పురోగతి, నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లులు మంజూరు చేయబోమని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు.
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు కోడిగుంటపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించిన సీఆర్సీ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.
ప్రకాశం: పొదిలి పొగాకు కేంద్రంలో శనివారము ధరలు మరింత దిగజారిపోయాయి. వ్యాపారులు మొక్కుబడిగా కొనుగోలు చేస్తూ అన్నిటికి నోబిడ్ వేస్తుండడంతో ఒకే రోజు భారీగా పొగాకు బేళ్లను వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. రోజురోజుకు దిగజారిపోతున్న పొగాకు ధరలపై, వ్యాపారుల తీరుపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
అనకాపల్లి: అచ్యుతాపురం మండలం పూడిమడకలో సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 250 మందికి బీపీ, షుగర్, కంటి, దంత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్మికుల హక్కుల పోరాటంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకర్రావు తెలిపారు.
PLD: గ్రామాలలో మంచినీటి చెరువులను నింపుకోవాల్సిందిగా 14వ డీసీ సంఘం చైర్మన్ వడ్లమూడి అప్పారావు కోరారు. తాగునీటి అవసరాల నిమిత్తం జల వనరుల శాఖ శనివారం నుంచి నీరు విడుదల చేస్తోందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీల సహకారంతో తాగునీరు చెరువులను నింపుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచనల మేరకు తాగునీటి సమస్య లేకుండా చూస్తామని పేర్కొన్నారు.
PPM: పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద చేపడుతున్న ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ పనులను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి శనివారం పరిశీలించారు. వర్షాకాలానికి ముందుగానే చెరువులు, కాలువల్లో పూడిక తొలగింపు పనులు వేగంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు నీటి నిల్వలు, మురుగు ప్రవాహం సక్రమంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
అల్లూరి: జీ.మాడుగుల జీసీసీ, సివిల్ సప్లయ్ ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేసే కళాసీలపై కక్ష సాధింపు సరికాదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పండుబాబు అన్నారు. జీసీసీ గోదాంలో డీఈవోగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి వైఖరిపై కళాశీలతో శనివారం గోదాం ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశీలకు రావాల్సిన బిల్లులు ఇంతవరకు పెట్టలేదన్నారు. ప్రశ్నిస్తే కులం పేరుతో వేధిస్తున్నాడని ఆరోపించారు.
కడప జిల్లాకు చెందిన విద్యార్థిని PG సెట్‌లో సత్తా చాటింది. మండల కేంద్రమైన చెన్నూరుకు చెందిన రిహానా పర్వీన్ మే నెలలో నిర్వహించిన పీజీ సెట్‌లో 100కు 99 మార్కులు సాధించి స్టేట్ మొదటి ర్యాంకు కైవసం చేసుకుంది. శ్రమకు తగిన ఫలితం దక్కిందని, భవిష్యత్‌లో బాగా చదివి, ఉన్నత స్థానానికి ఎదగుతానని ఆమె అన్నారు. రిహానా పర్వీన్‌ను తల్లిదండ్రులు, ఊరి పెద్దలు ఆశీర్వదించారు.
KKD: ఉమ్మడి జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల రగ్బీ ఎంపికలు 31వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు పిఠాపురంలోని RRBHR గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు సెక్రటరీ పి. లక్ష్మణరావు తెలిపారు. ఈ ఎంపికల్లో 2008 నుంచి 2010 సంవత్సరాల మధ్య జన్మించిన వారు మాత్రమే పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారు రాష్ట్ర పోటీలకు అర్హులు అన్నారు.
GNTR: ఫిరంగిపురం విజ్ఞానపురం వేలాంగణి మాతగుడి వెనుక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు అధ్వానంగా మారి నడవలేని పరిస్థితి నెలకొన్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కనిపించలేదని, అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
KRNL: ఆదోని పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే తనయుడు జయ మనోజ్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబాలకు ధైర్యం చెబుతూ, బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
VZM: విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.