ELR: జిల్లాలో మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు విజయవంతంగా ముగిశాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వర్చువల్ విధానంలో క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
NDL: చాగలమర్రిలో TDP కార్యకర్తలకు అండగా ఉంటానని ఆళ్లగడ్డ నియోజకవర్గం సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ అన్నారు. మండలంలోని చిన్న వంగలి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి నరేంద్ర రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం భార్గవ్ రామ్ చిన్న వంగలి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
KRNL: నేర నియంత్రణే లక్ష్యంగా గట్టిగా పని చేయాలని, IPL ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలపాలపై గట్టి నిఘా ఉంచాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో కోరుకొండ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై నాయకులు పార్టీలో చేరడం సంతోషకరమని ఎమ్మెల్యే బత్తుల పేర్కొన్నారు
NLR: కావలి ఏరియా ఆసుపత్రిలో 27 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన సివిల్ సర్జన్ డాక్టర్ కే. సుబ్బారెడ్డి పదవీ విరమణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, డాక్టర్‌ను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందడం గొప్ప విషయమని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
PLD: నూజెండ్ల (మం) ఐనవోలులోని శ్రీ ఆంజనేయస్వామి తిరుణాల మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకుడు నిస్శంకర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
W.G: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో జి.గీతాబాయి హెచ్చరించారు. భీమవరంలోని కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, వాటిని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు.
NTR: తిరువూరు గ్రంధాలయంలో ఉచిత శిక్షణా తరగతులలో భాగంగా విద్యార్థులు, తల్లితండ్రులకు సైబర్ నేరాల గురించి S.I గౌరీశ్వరి వివరించారు. విద్యార్థులు సెల్ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నారో తల్లితండ్రులు పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులపై తల్లితండ్రులు ఒత్తిడి తేకుండా వాళ్ళకు ఇష్టమైన కోర్సు చేయించాలన్నారు. రకరకాలుగా మోసాలు జరుగుతున్నందున జాగ్రత్త వహించాలన్నారు.
సత్యసాయి: కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫ్రెండ్లీ పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్, MLA కందికుంట వెంకట ప్రసాద్ హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, నేరాలకు దూరంగా ఉండాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మైనర్లపై నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
NTR: నందిగామ పట్టణ పరిధిలోని అనాసాగరంలో శనివారం నిర్వహిస్తున్న యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలోని కాస్ట్యూమ్ జ్యువెలరీ శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి కుటుంబాలకు అండగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. ప్రభుత్వం మహిళల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
WG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో రాజకీయ కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర నేత మాధవ్ ఆరోపించారు. శనివారం భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. మరో రాష్ట్రంలో డిప్యూటీ సీఎం చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ఫ్లెక్సీల వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించుకోవాలని మాధవ్ సూచించారు.
ELR: జంగారెడ్డిగూడెం(m)గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది.ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు వివిధ సేవల ద్వారా రూ. 2,33,958 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో చందన తెలిపారు. సుమారు 4,200 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసామన్నారు.
KRNL: టీడీపీ మహానాడు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా రాజకీయ ప్రచార సభగా మారిందని ఇవాళ డీసీసీ అధ్యక్షులు క్రాంతి నాయుడు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహానాడులో చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు.
VSP: పెందుర్తి మండలం సంకల్ప కళా గ్రామంలో శనివారం SOS భీమిలి విద్యార్థులతో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం సమావేశమయ్యారు. డ్రోన్‌ల ద్వారా చల్లేందుకు 6 మి.మీ పరిమాణంలో విత్తన గోళీలు తయారు చేయించి, వాటిని కొండలు, తీర ప్రాంతాల్లో చల్లి శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయాలని సూచించారు.
AKP: గొలుగొండ మండలం పాతమల్లంపేట గ్రామంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూ బాలుర హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓ, పోలీసు, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పౌరుల హక్కులు, బాధ్యతలు, ప్రభుత్వ సేవల వినియోగం, చట్టాలపై అవగాహన కల్పించారు. తమ హక్కులను తెలుసుకోవాలని అధికారులు అన్నారు.