KDP: ప్రతి ద్విచక్ర వాహనదారుడు లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని SI హారిక తెలిపారు. సిద్ధవటం గ్రామ శివారులోని మూలపల్లె క్రాస్ వద్ద గురువారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. హెల్మెట్, వాహన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనదారులకు ఒక్కొ వాహనానికి రూ.185 చొప్పున జరిమానా విధించామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.
కోనసీమ: సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సహకారంతో చదువుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినిని మంత్రి వాసంశెట్టి సుభాష్, ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలు గురువారం సాయంత్రం కలిసి అభినందించారు. కాకినాడ శ్రీ చైతన్యలో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ చదువుతున్న కాటే శ్రీకృష్ణ హర్ష 470 మార్కులకు గాను 459 మార్కులుతో ఉత్తీర్ణత సాధించాడు.
ATP: ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే నెల 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. పరీక్ష ఫీజు ఈ నెల 20 నుంచి 27వ తేదీలోగా ఆన్లైన్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీటోటలింగ్ చేయించుకోవాలనుకుంటే ఫీజు చెల్లించుకోవచ్చున్నారు. సబ్జెక్టుకు 260 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు.
KRNL: ఓర్వకల్లు మండలంలోని కొమ్మిచెరువు ఆంజనేయస్వామి ఆలయంలో చైత్రమాసం శుక్రవారం అమావాస్య పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రమేష్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ స్వామి, శివరామయ్య శర్మ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, సింధురార్చన, ఆకు పూజ మహా మంగళ హారతి నిర్వహిస్తామన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
PPM: చట్టసభల్లో 33% ప్రాతనిథ్యం కల్పించడాన్నివైసీపీ స్వాగతిస్తున్నామని అని EX DY CM పాముల పుష్ప శ్రీ వాణి అన్నారు. మా ప్రభుత్వ హయాంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం, వాలంటీర్ వ్యవస్థల్లో 53 శాతం, సచివాలయాల్లో 51 శాతం రిజర్వేషన్లు కల్పించాము అన్నారు.వైయస్ జగన్ మహిళా సాధికారత అంటే ఏంటో చేతల్లో...
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం అమావాస్య సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించి పూజలు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
E.G: రాజానగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు “పల్లె పండుగ 2.0 – మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లె బాట” కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా MLA బత్తుల బలరామకృష్ణ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను స్వీకరిస్తారు. విద్య, వైద్యం, రోడ్లు, నీరు, భూమి సమస్యలపై అర్జీలు తీసుకోనున్నారు.
శ్రీకాకుళం PSNM పాఠశాల ఆవరణలో ప్రతి రోజు ఉదయం 5:30 నుంచి 7:45 వరకు MMW బాక్సింగ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ శిక్షణను కోచ్ కే. పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సీనియర్ బాక్సర్లు కూడా పాల్గొని జూనియర్లకు మార్గదర్శనం చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటూన్నారు.
TPT: శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజ టికెట్లలో మార్పులు చేశారు. రూ.500 టికెట్ రద్దు కాగా, రూ.750, రూ.1500, రూ.2500 కొనసాగుతాయి. రూ.5000 టికెట్‌ను రూ.6000కి పెంచారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు ప్రతి బుధవారం రూ.100కే సామూహిక రాహు-కేతు పూజ నిర్వహించనున్నారు. ఈ పూజలో ఒకేసారి సుమారు 2000 మందికి అవకాశం కల్పించనున్నారు.
KRNL: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చల్లా ఓబులేసును నియమితులయ్యారు. గుంటూరులో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న ఆయనను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. అలాగే నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న జి.శ్రీనివాసులు పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. కాగా, కొత్త కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
కాకినాడలో నివాసముండే బుజ్జి అనే మహిళ 15 ఏళ్ల బాలికకు నగదు ఆశచూపి బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టింది. బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న బాలికను తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కాకినాడ 3వ పట్టణ పోలీసులు నిందితురాలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VZM: ఇటీవల మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళలలను లోవర్చుకోవడం తదితర చట్టాలపై ఎస్.కోట పట్టణ ఎస్సై పలు పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ఎవరైనా దాడులు చేస్తే స్వీయ రక్షణతో తిప్పి కొట్టాలని సూచించారు. ఆనంతరం విద్యార్థులకు చట్టాలపై క్విజ్ నిర్వహించారు. అందులో గెలుపొందిన వారికి పెన్నులు, బుక్స్ పంపిణీ చేశారు.
SKLM: ఎచ్చెర్ల మండలంలో చేపల వేటపై రెండు నెలల నిషేధం అమల్లోకి రావడంతో సముద్ర తీరాలు నిర్మానుష్యంగా మారాయి. మత్స్యకారులు బోట్లను, వలలను సురక్షితంగా నిల్వ చేస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది చేపల ప్రయోజన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిషేధం అమలు చేస్తారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
గుంటూరు: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని AT అగ్రహారం ప్రాంతంలో రహస్యంగా నడుస్తున్న వ్యభిచార దందాను పోలీసులు ఛేదించారు. రెండో లైన్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు, మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని SHO సత్యనారాయణ హెచ్చరించారు.