ELR: పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి అర్జీలు స్వీకరించారు. అలాగే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.
అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అకాడమిక్ ఆడిట్‌లో ‘ఎ’ గ్రేడ్ లభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఆడిట్‌లో ఆడిటర్లు డాక్టర్ రుక్మిణి, డాక్టర్ గులాబ్ జాన్ కళాశాల నిర్వహణ, బోధనా విధానాలను పరిశీలించి ఈ గ్రేడ్‌ను ప్రకటించారు. ఈ విజయానికి అధ్యాపకుల కృషి కారణమని ప్రిన్సిపాల్ వనజ తెలిపారు.
KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల సమస్యలు ఫిర్యాదు చేశారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఇంఛార్జ్ హామీ ఇచ్చారు.
W.G: భీమవరం నియోజకవర్గ టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక గ్రీవెన్స్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ తోట సీతారామ లక్ష్మీ పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించారు. అలాగే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
TPT: పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల 43వ వార్షికోత్సవంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. రూసా నిధులతో రూ.24.63 లక్షల వ్యయంతో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
SS: బుక్కపట్నం డైట్ కళాశాల వీడ్కోలు వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ట్రైనీ ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ అలవర్చుకుని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.
ATP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన భైరవకోనను శుక్రవారం పామూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దుర్గేష్ వినోద్ కుమార్ సందర్శించారు. పామూరు నూతన సీఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఆలయాన్ని సందర్శించుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు.
కోనసీమ: మండపేట సంఘం కాలని జంక్షన్ వద్ద కారు ప్రమాదవశాత్తూ పంట బోదెలోకి దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు నుంచి రామచంద్రపురం వెళ్తుండగా మండపేట బైపాస్ రోడ్డుకు వచ్చేసరికి సత్యశ్రీ వైపు నుంచి వెళుతున్న మోటార్ సైక్లిస్ట్ అడ్డు వచ్చాడు. అతన్ని తప్పించే క్రమంలో కారు పంట బోదెలోకి దూసుకుపోయిందన్నారు.
మే 1 నుంచి జూన్ 11 వరకు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేశ్ తెలిపారు. సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో ఈ తరగతులు జరుగుతాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26 లోగా www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవచ్చన్నారు.
NTR: నందిగామ డివిజన్ ఏసీపీగా చలసాని శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం నందిగామ ఏసీపీగా ఉన్న తిలక్‌ను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. గన్నవరం డీఎస్పీగా పనిచేస్తున్న చలసాని శ్రీనివాసరావును నందిగామ ఏసీపీగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన త్వరలోనే విధుల్లో చేరనున్నారు.
SS: జిల్లా కలెక్టరేట్‌లో 20 సూత్రాల కమిటీ రాష్ట్ర ఛైర్మన్ లంకా దినకర్ జిల్లా అధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా విద్య, వైద్య రంగాల్లో జిల్లా ప్రగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. పెనుకొండ మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
ATP: గుత్తిలోని వీరారెడ్డి కాలనీలో ఇవాళ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో డాక్టర్ ఝాన్సీ లక్ష్మి,హాజరయ్యారు. హోమియోపతి వైద్య విధాన పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యూల్ హానిమన్ చిత్రపటానికి నివాళులర్పించారు.హోమియోపతి వైద్యం సురక్షితమైనదన్నారు.
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వార్డు పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగడిగుంట, కబాడీగూడెం ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.