• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వారసత్వంగా రూ.14 లక్షల కోట్లు అప్పు: మంత్రి

W.G: వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా రూ.14 లక్షల కోట్లు అప్పు ఇచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం తణుకు మండలం ముద్దాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి నిమ్మల మాట్లాడారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వేసిన ఓటు విధ్వంసానికి దారి తీసిందని చెప్పారు.

April 13, 2026 / 07:12 AM IST

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన కేంద్ర మంత్రి

SKLM: శ్రీకాకుళం జెమ్స్ గ్రౌండ్స్‌లో సిక్కోలు సోషల్ మీడియా అసోసియేషన్ సిక్కోలు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ముగింపు పోటీలలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా ఖ్యాతిని వివరిస్తూ, సానుకూల కథనాలను ప్రచారం చేయాలని కేంద్రమంత్రి అన్నారు కేంద్ర మంత్రి కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు.

April 13, 2026 / 07:05 AM IST

పెరిగిన కోడి గుడ్డు ధర.. రైతుల హర్షం

కోనసీమ: కోడిగుడ్డు ధర రూ.5.10 చేరింది. ఈ నెల 7వ తేదీన రూ.4.35 ఉన్న కోడిగుడ్డు రోజు రోజుకి పెరుగుతూ ఈ ధరకు చేరింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో నెల రోజుల కిందట కోడిగుడ్డు ధర రూ.3.80పైసలకు దిగజారడంతో రైతులు నష్టాలు చెవిచూశారు. ప్రస్తుతం కోడిగుడ్లకు డిమాండ్ నెల కొనడంతో ధర పెరుగుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

April 13, 2026 / 07:00 AM IST

నేడు ఆక్వా చెరువులకు కరెంట్ కట్

W.G: కోళ్లపర్రు 33/11 KV విద్యుత్ ఉపకేంద్రంలోని 11KV కోళ్లపర్రు ఫీడర్ వార్షిక మరమ్మతుల్లో భాగంగా చెట్లు ఆకులు తొలగించనున్నారని ఈఈ వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా నేడు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కోళ్లపర్రు, ఆకివీడు, నక్కలపుంత పరిధిలోని ఆక్వా చెరువుల లైన్‌లలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందన్నారు. 

April 13, 2026 / 06:50 AM IST

రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకోవాలి: డీఎస్పీ

KDP: నేర ప్రవృత్తిని వీడి, సమాజంలో సత్‌ప్రవర్తనతో మెలగాలని DSP వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం JMD పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై PD యాక్ట్ నమోదు చేస్తామని, అలాగే బైండోవర్ వంటి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని DSP స్పష్టం చేశారు. ఇందులో అర్బన్ సీఐ నరేశ్ బాబు, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు.

April 13, 2026 / 06:49 AM IST

వాగులు, జలపాతాలు వద్దజాగ్రత్తలేమితో ప్రాణ నష్టం

VSP: అల్లూరి జిల్లాలో వేసవి ప్రారంభంతో నీటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. లోతు అంచనా లేకుండా నీటిలో దిగడం, ఈత రాకపోయినా సాహసం చేయడం ప్రమాదాలకు దారితీస్తోంది. గుర్తింపు లేని చిన్న జలపాతాలు, గెడ్డలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా అవసరం.

April 13, 2026 / 06:47 AM IST

ఆలయ ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం

E.G: రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, బీజేపీ నేత అనాలియో బంతిజీ ఆదివారం CM చంద్రబాబును కలిశారు. మే 1న ఉండ్రాజవరంలో నిర్వహించనున్న బౌద్ధ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బౌద్ధ సాంస్కృతిక వారసత్వం ప్రోత్సాహం, ఆలయ నిర్మాణ పురోగతిని సీఎంకి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు

April 13, 2026 / 06:46 AM IST

బెల్ట్ షాపుపై దాడులు.. వ్యక్తి అరెస్టు

VZM: భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలోని ఓ బెల్ట్‌ షాపుపై ఎక్సైజ్‌ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి 6 మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ CI వి.రవికుమార్‌ తెలిపారు. అనదికారంగా మద్యం అమ్మకాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

April 13, 2026 / 06:42 AM IST

డీఎడ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సత్యసాయి: బుక్కపట్నంలో డీఎడ్ కోర్సులో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ సూచించారు. ఇంటర్ పూర్తి చేసిన వారు లేదా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి 17 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

April 13, 2026 / 06:39 AM IST

ఎమ్మెల్యే శిరీష నేటి పర్యటన వివరాలు

SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష సోమవారం ఉ.9.30 కు పలాస మున్సిపాలిటీలో మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. ఉ.10కు గంగువాడలో PM సూర్య ఘర్ పథకాన్ని, ఉ.11 కు మందస పిడి మందసలో సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. సా.3.30 కు పలాస టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తారు అని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

April 13, 2026 / 06:37 AM IST

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేలు

ATP: గుమ్మఘట్ట మండలం గలగల గ్రామంలో ప్రగతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కలిసి రూ.12 లక్షల వ్యయంతో మినీ గోకులం, సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.

April 13, 2026 / 06:36 AM IST

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనతో మెలగాలని వారిని హెచ్చరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.

April 13, 2026 / 06:35 AM IST

రోడ్డు ప్రమాదంలో భారీ ప్రామాదం.. భర్తలకు తీవ్ర గాయాలు

AKP: ఎస్. రాయవరం మండలం పెనుగొల్లు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాకకు చెందిన బి.కృష్ణ, రామలక్ష్మి దంపతులు తలుపులమ్మ లోపలకు వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వారిని సీపీఎం నాయకుడు ఎం అప్పలరాజు 108 వాహనంలో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

April 13, 2026 / 06:29 AM IST

నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం

CTR: చిత్తూరు సర్కిల్ విద్యుత్ వినియోగదారుల కోసం నేడు “డయల్ యువర్ సీఎండీ” కార్యక్రమం నిర్వహంచనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు సీఎండీకి కాల్ చేసి సమస్యలు తెలియజేయవచ్చు. జిల్లా స్థాయి సమస్యలకు ఉదయం 8:30-9:30 వరకు సంబంధిత SEలను సంప్రదించాలన్నారు. 8977716661, 8712652679, 7993147979 ఈ నంబర్లను వినియోగించుకోవచ్చు.

April 13, 2026 / 06:28 AM IST

కస్తూర్బా జూనియర్ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: ప్రభుత్వం బాలికల ఉన్నత విద్య కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఆదివారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా జూనియర్ కళాశాల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికల కోసం అన్ని వసతులతో కూడిన విద్యా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

April 13, 2026 / 06:24 AM IST