W.G: నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం గ్రామ సర్పంచ్‌పై అదే గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఎంపీడీవో సింహాద్రిరావుకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ తీర్మానం ఇవ్వకపోవడంతో జరగవలసిన ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయని, దీంతో పనులు లేక ఆర్థికంగా కుటుంబ పోషణ కష్టమవుతుందని వాళ్ళు వాపోయారు. ఈ సమస్యపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.