KDP: శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో సీఐడీతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలపాలని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. కడపలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.